E-Paper
Advertisement

Food Colors: రంగులు వేసి దర్జాగా కృత్రిమ ఆహారం తయారీ.. ఎక్కడంటే..?

Food Colors: రంగులు వేసి దర్జాగా కృత్రిమ ఆహారం తయారీ.. ఎక్కడంటే..?
Advertisement

Food Colors: స్వేచ్ఛ బ్యూరో: ఫుడ్ కలర్స్ అనేవి మనుషులు తయారు చేసేవి. ఇవి పలు రసాయనాల సమ్మేళనంతో తయారవుతాయి. ఎర్రగా కాల్చిన చికెన్ కబాబ్ రంగు మీదున్న గోపి మంచూరియా, జిగేల్ మనిపించే జిలేబి, చికెన్ – 65 చూడగానే నోరూరిస్తాయి. సూపర్ మార్కెట్ లో అందంగా పేర్చిన కాటన్ క్యాండీలు,లాలీ పప్పులు, చాక్లెట్లు, పిప్పర్ మెంట్లు, బబుల్ గమ్స్, బిస్కెట్లు, ఫ్రీజర్లలో నిలువ చేసిన ఐస్ క్రీములు అన్ని కృత్తిమ రంగులతో తయారైనవే. బేకరీలో కేకులన్ని రంగుల మయమే. నేటి ఆధునిక యుగంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఇంట్లో వండడం మాని నేడు మార్కెట్ లో ఆహారం కొనాల్సిన రోజులు వచ్చాయి. అందుకే ఆహారం అతిపెద్ద వ్యాపారమైంది.

విషపూరిత కృత్రిమ రంగులు

ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అమ్మేస్తున్నారు. అందుకే మేకప్‌లో భాగంగా వచ్చినవే కృత్రిమ రంగులు. ఆకలి లేకున్నా తినాలన్న కాంక్షను రగిలించే శక్తి కృత్రిమ రంగులకుంది. సహజ పద్ధతిలో తయారు చేస్తే రుచిగా ఉంటాయి తప్ప కనికట్టులో లాభం లేదు. విషపూరిత కృత్రిమ రంగుల్ని ఆహార పదార్థాలలో కలిపి విక్రయించే పద్ధతి పెరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆహారం అతిపెద్ద వ్యాపారమైంది. క్షణాల్లో ఆకర్షించి కస్టమర్లను బుట్టలో పడేయడం ఆహార ఉత్పత్తి సంస్థల వ్యూహంగా మారింది. ఆహార పదార్థాలు, పానీయాలలో ధాన్యాలలో కృత్రిమ రంగుల వాడకం, స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి స్టార్ హోటళ్ల వరకు వ్యాప్తి చెందింది. అవగాహన ఉన్నవారికి అవి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే బయటి తిండి వద్దు మొర్రో అనిపిస్తుంది.

Advertisement

Also Read: Power Demand: విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్ టైం రికార్డు..?

పోషక విలువలకు బదులు రంగుకే మొగ్గు

ప్రస్తుతం వినియోగదారులు పోషక విలువలు చూసి కాకుండా రంగుని చూసి కొనుగోలు చేస్తున్నారు. అందుకే వ్యాపారులు తినుబండారాల తయారీలో కృత్రిమ రంగులను కలుపుతున్నారు. ఆహార నియంత్రణ సంస్థల్లో మార్గదర్శకాల ప్రకారం కాకుండా మోతాదుకు మించి వాడినప్పుడు ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది.

తనిఖీలు, పర్యవేక్షణ కరువు

Advertisement

కల్తీ నియంత్రణకు తనిఖీ, పర్యవేక్షణకు అవసరమైన అధికారులు, సిబ్బంది జనాభా కనుగుణంగా లేకపోవడంతో ఉన్న సిబ్బంది కూడా తనిఖీ చేయకపోవడంతో రెస్టారెంట్లు, హోటళ్ళు ,వీధి వ్యాపారులు మితిమీరిన కృత్రిమ రంగులతో ఆహార పదార్థాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు.అంతేగాక ప్రజల్లో ఆహార భద్రతపై చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రమాదకరమైన సింథటిక్ కెమికల్స్ , విషతుల్యమైన రసాయనాలు ఉదరంలోకి వెళ్తున్నాయి. పెట్రోలియం ఉప ఉత్పత్తులైన ఫుడ్ కలర్స్ ఉపయోగించే బేకరి ఉత్పత్తులు, ఐస్ క్రీములు, కబాబ్స్ తినడాన్ని మానివేయడం శ్రేయస్కరం.

కల్తీ నూనెలు

రోడ్డు వెంట ఉండే కొందరు టీ బండ్ల వారు కల్తీ టీ పొడి వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజుల తరబడి మరిగిన నూనెలో మిర్చీలు, గారెలు, బజ్జీలు పసందుగా ఉంటాయని తింటూ ప్రజలు అనారోగ్యం పాడిన పడుతున్నారు. జంతువుల కొవ్వుతో తయారుచేసిన చౌకగా లభించే నూనెలు, ఇతర కొన్ని రకాల కల్తీ నూనెలతో తయారు చేస్తున్న నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతోంది.

Also Read: LPG Gas Cylinder: వంట గ్యాస్ సిలిండర్లు రెడ్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి? మిగతా రంగుల సిలిండర్లు దేనికి వాడతారు?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×