Free TV Channels| మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన టీవి ఛానెల్ అయినా చూడవచ్చు. అది కూడా ఉచితం. అమెరికా, జపాన్, రష్యా, పాకిస్తాన్ లేదా మరే దేశమైనా, ఒకే ప్లాట్‌ఫామ్‌తో అన్ని దేశాల టీవీ చానెళ్లు ఉచితంగా చూడవచ్చు. దీనికి ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ లేదా యాప్‌లు అవసరం లేదు. స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, వార్తలు వంటి అన్ని రకాల ఛానెల్స్ టివి గార్డెన్ అనే ప్లాట్‌ఫామ్ అందిస్తుంది. ఈ అద్భుతమైన ఫ్రీ సర్వీస్ గురించి వివరాలు మీ కోసం..
TV గార్డెన్ అనేది ఉచితంగా లైవ్ టీవీ చానెళ్లను అందించే వెబ్‌సైట్. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల టీవీ చానెళ్లను ఒకే చోట సేకరిస్తుంది. దీన్ని ఉపయోగించడానికి మీరు మీ ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌లో వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించవచ్చు. అందులో TV గార్డెన్ వెబ్‌సైట్ కు వెళ్లండి. ఎలాంటి ఫీజు లేకుండానే ఇందులో అంతా ఫ్రీ కంటెంట్. పైగా వెబ్‌సైట్ చాలా సులభంగా ఉపయోగించే విధంగా రూపొందించబడింది.
ముందుగా, మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌లో ఏదైనా వెబ్ బ్రౌజర్‌ను తెరవండి. ఆ తర్వాత, గూగుల్‌లో “TV గార్డెన్” అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ ఫలితాలలో మొదటి లింక్‌ను ఎంచుకోండి, అది అసలైన TV గార్డెన్ వెబ్‌సైట్‌కు మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ!
TV గార్డెన్ వెబ్‌సైట్‌లో, మీరు ఒక 3D గ్లోబ్‌ను చూస్తారు. ఈ గ్లోబ్‌పై మీరు కోరుకున్న దేశాన్ని మౌస్‌తో ఎంచుకోవచ్చు. లేదా, సైడ్‌బార్‌లోని దేశాల జాబితా నుండి ఒక దేశాన్ని ఎంచుకోవచ్చు. ఎంచుకున్న దేశానికి సంబంధించిన టీవీ చానెళ్ల జాబితా వెంటనే మీ ముందు కనిపిస్తుంది.
చానెళ్ల లిస్ట్ చూస్తే, మీకు ఆసక్తికరమైన చానెళ్ల గురించి ఒక అవగాహన వస్తుంది. చానెళ్లను వార్తలు, క్రీడలు, స్పోర్ట్స్ వంటి విభాగాలుగా విభజించారు, కాబట్టి మీరు కోరుకున్న దాన్ని సులభంగా కనుగొనవచ్చు. ప్రతి చానెల్ ప్రసార భాష కూడా అక్కడే వివరంగా ఉంటుంది. దీనివల్ల మీరు మీకు అర్థమయ్యే భాషా చానెల్ ఎంచుకోవచ్చు. మీ ఇష్టమైన చానెల్ ఎంచుకుని, ప్లే బటన్‌ను నొక్కండి.
టీవి గార్డెన్ సర్వీస్ పూర్తిగా ఉచితం. 50 కంటే ఎక్కువ దేశాల నుండి చానెళ్లు అందుబాటులో ఉన్నాయి. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అయితే ఇంటర్నెట్ కనెక్షన్ సమస్య ఉంటే పిక్చర్ కొంచెం అస్పష్టంగా కనిపించవచ్చు. ఈ సేవను ఉపయోగించడానికి అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్, డెస్క్‌టాప్ రెండింటిలోనూ పనిచేస్తుంది. ఇందులో అంతా ప్రత్యక్షంగానే ఉంటుంది. ప్రాసెస్ కూడా ఈజీగా ఎటువంటి మధ్యవర్తి దశలు లేవు.
TV గార్డెన్ ద్వారా వివిధ దేశాల సంస్కృతులను తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాలు కార్టూన్‌లను చూడవచ్చు. ప్రపంచంలోని భిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడానికి విభిన్న అనుభవాలను ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.
కొన్ని క్లిక్‌లతో, ప్రపంచంలోని కంటెంట్ అంతా చూడవచ్చు. ఇదంతా ఒక్క పైసా చెల్లించకుండా మీ చేతిలో ఉంది! ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి.
Also Read: : ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?