Dangal: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది కెరియర్ పై ఫోకస్ పెట్టి పెళ్లి వయసు దాటిపోయినా ఇంకా పెళ్లికి దూరం అవుతారు. మరికొంతమంది సరైన వయసులోనే పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ కూతురు కూడా ఇప్పుడు ఏడడుగులు వేసింది.25 ఏళ్ల ప్రాయంలో పెళ్లి పీటలెక్కి అభిమానులకు శుభవార్త తెలిపింది. మరి ఎవరా అమీర్ ఖాన్ కూతురు? ఆమె వివాహం చేసుకున్న వరుడు ఎవరు? అనే విషయం ఎప్పుడు చూద్దాం..
విషయంలోకి వెళ్తే అమీర్ ఖాన్ (Aamir Khan) లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కిన చిత్రం దంగల్.. ఇందులో చిన్నప్పటి గీత ఫోగట్ పాత్రలో నటించింది జైరా వాసిం.. ఇందులో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఉత్తమ సహాయ నటి విభాగంలో ఈ సినిమా కోసం ఏకంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె పెళ్లి పీటలెక్కి ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా రెండు ఫోటోలు పంచుకున్న జైరా వాసిం.. అందులో ఒకటి గోరింటాకు ఎర్రగా పండిన చేతులతో రిజిస్టర్ పై సంతకం చేస్తూ దిగిన ఫోటోని పంచుకోగా.. రెండవ ఫోటోలో తన భర్తతో కలిసి నెలవంకను చూస్తున్నట్టు ఉన్న ఫోటోను షేర్ చేసింది.
అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. ఈమె తన ముఖాన్ని కానీ.. తన భర్త ముఖాన్ని కానీ పంచుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈమె భర్త ఎవరు? ఏం చేస్తుంటారు అనే విషయాలను ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచింది. జైరా వాసిం త్వరలోనే పెళ్లి ఫోటోలతో పాటు ఆ విషయాలు కూడా బయటపెట్టే అవకాశాలున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
also read:Ram Pothineni: కులపిచ్చి ఎక్కువ.. ఆ కష్టాలు చెప్పుకోలేనివి -రామ్ పోతినేని
2016 లో వచ్చిన ‘దంగల్’ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ చిన్నది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘సీక్రెట్ సూపర్ స్టార్’ అనే సంగీత నాటకంలో కూడా గాయనిగా నటించింది.. ఈ రెండు చిత్రాలకి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మద్దతు ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్న ఈమె… రెండవ సినిమాకి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఇక చివరిగా ది స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటించినది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుకు నామినేషన్ కూడా దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ఈమె.. అప్పటినుంచి మరో సినిమాలో నటించలేదు. అటు సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలను డిలీట్ చేయాలని అభిమానులను రిక్వెస్ట్ చేసింది.