E-Paper
Advertisement

పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్.. సరైన వయసు ఎంతో తెలుసా? క్లారిటీ వచ్చేసింది!

పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్.. సరైన వయసు ఎంతో తెలుసా? క్లారిటీ వచ్చేసింది!
Advertisement

Kids Smartphone: పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు ఇవ్వాలి? ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులనూ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఇది. ఒకప్పుడు హైస్కూల్‌కి వస్తేగానీ ఫోన్ ఆలోచన వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఎనిమిది తొమ్మిదేళ్ల పిల్లలు కూడా చేతిలో ఫోన్ ఉంటేనే ముద్ద దిగుతుంది అంటున్నారు. చుట్టుపక్కల పిల్లలందరి దగ్గరా ఫోన్లు ఉండటం, చదువులన్నీ ఆన్‌లైన్ వైపు మళ్లడంతో పేరెంట్స్‌పై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అయితే పిల్లలకు మొదటి స్మార్ట్‌ఫోన్ ఇవ్వడానికి సరైన వయసు ఏంటి? ఈ విషయంపై పిల్లల మానసిక నిపుణులు, పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వయసు కంటే పరిణతి ముఖ్యం

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ ఇవ్వడానికి ఒక నిర్దిష్ట వయసు అంటూ ఏదీ లేదు. ఎందుకంటే 10 ఏళ్లకే కొందరు పిల్లలు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మరికొందరు 14 ఏళ్లు వచ్చినా ఫోన్ వాడకంపై నియంత్రణ కోల్పోతుంటారు. అందుకే వయసు కంటే పిల్లల ‘పరిణతి’ (Maturity level)ని బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పినట్లు పిల్లలు నడుచుకుంటున్నారా? ఫోన్ ఇస్తే చదువును, నిద్రను పక్కన పెట్టేస్తున్నారా? లేదా? అనే అంశాలను గమనించి ఫోన్ ఇస్తే బెటరని పేర్కొంటున్నారు.

12-14 ఏళ్లు.. బెస్ట్ టైమ్!

Advertisement

అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP)తో పాటు పలు అంతర్జాతీయ సర్వేల ప్రకారం.. పిల్లలకు మొదటి స్మార్ట్‌ఫోన్ ఇవ్వడానికి 12 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు సరైనది. 10 ఏళ్ల లోపు వయసు పిల్లలకు ఫోన్ అవసరం పడితే.. తల్లిదండ్రుల సమక్షంలోనే దానిని వినియోగించేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక 10-12 ఏళ్లు వచ్చి.. స్కూలుకు ఒంటరిగా వెళ్తున్న పక్షంలో యోగ క్షేమాలు తెలుసుకునేందుకు ఫోన్ ఇవ్వొచ్చని సర్వేలు సూచిస్తున్నాయి. అది కూడా స్మార్ట్ ఫోన్ కు బదులు బేసిక్ కీప్యాడ్ ఫోన్ ఇవ్వడం ఉత్తమమని పేర్కొంటున్నారు.

Also Read: రేపే జనసేన సభ.. పవన్‌కు బీఆర్ఎస్ ఉచ్చు.. బాబు ఫార్ములా రిపీట్ కానుందా?

విదేశాల్లో ఆసక్తికర ఉద్యమం

Advertisement

పాశ్చాత్య దేశాలలో ప్రస్తుతం ‘వెయిట్ అంటిల్ 8th’ (Wait Until 8th) అనే ఒక పెద్ద ఉద్యమం నడుస్తోంది. పిల్లవాడికి కనీసం 8వ తరగతి (సుమారు 14 ఏళ్లు) పూర్తి చేసే వరకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదని తల్లిదండ్రులంతా ఒక ఒప్పందానికి వస్తున్నారు. ఎందుకంటే చిన్న వయసులోనే ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టడం వల్ల పిల్లల్లో ఒంటరితనం, మానసిక ఒత్తిడి, ఆన్‌లైన్ వేధింపులు పెరిగే ప్రమాదం ఉందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో వారి సూచనలు పాటిస్తూ.. 14 ఏళ్లు దాటేవరకూ తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఫోన్లు ఇవ్వడం లేదు.

Also Read: అమెరికాలోకి 3.2 కోట్ల దోమలను వదిలిపెట్టనున్న గూగుల్.. ఇదెక్కడి ప్లాన్ మామ?

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×