E-Paper
Advertisement

WhatsApp Schedule: నిద్రపోయే సమయంలో కూడా మెసేజ్ పంపవచ్చు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ త్వరలోనే

WhatsApp Schedule: నిద్రపోయే సమయంలో కూడా మెసేజ్ పంపవచ్చు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ త్వరలోనే
Advertisement

WhatsApp Schedule| ప్రపంచంలో అతిపెద్ద మెసేజింట్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్‌ను మరింత మెరుగుపరచడానికి మెటా కంపెనీ కొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఎంతో కాలంగా యూజర్లు కోరుకుంటున్న మెసేజ్ షెడ్యూలింగ్ ఆప్షన్ త్వరలో రాబోతోంది. ఈ ఫీచర్‌తో మీరు ఎంచుకున్న రోజు, సమయంలో మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా పంపబడతాయి. రాత్రంతా నిద్రపోకుండా సరైన సమయం కోసం వేచి ఉండి ముఖ్యమైన మెసేజ్‌లు పంపాల్సిన అవసరం ఇకపై ఉండదు.

WABetaInfo ప్రకారం వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఇంటర్నల్‌గా డెవలప్ చేస్తోంది. చాట్‌లోనే డైరెక్ట్‌గా మెసేజ్‌లు షెడ్యూల్ చేయవచ్చు. చాలా కాలంగా పర్సనల్, బిజినెస్ యూజర్లు ఈ ఫీచర్ కోసం డిమాండ్ చేస్తున్నారు.

డెవలప్‌మెంట్‌ దశలో ఫీచర్

Advertisement

ఇంకా ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు రిలీజ్ కాలేదు. ఇంటర్నల్ టెస్టింగ్‌లో ఉంది. iOS బీటా వెర్షన్ 26.7.10.72లో ఈ ఫీచర్ హింట్స్ కనిపించాయి. భవిష్యత్ అప్‌డేట్‌లో రావచ్చు. ప్రస్తుతం ఇంటర్నల్ బిల్డ్స్‌లో మాత్రమే కనిపిస్తోంది. అధికారిక రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ లీక్స్ ప్రకారం త్వరలో రావడం ఖాయంగా కనిపిస్తోంది.

iOS, ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి

ఈ ఫీచర్ మొదట iOS బీటాలో కనిపించింది. కానీ వాట్సాప్ సాధారణంగా రెండు ప్లాట్‌ఫామ్‌లకు ఒకేసారి రిలీజ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు కూడా త్వరలో యాక్సెస్ పొందవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు థర్డ్-పార్టీ యాప్స్‌తో మెసేజ్‌లు షెడ్యూల్ చేస్తున్నారు. కానీ ఇవి ప్రైవసీ, సెక్యూరిటీ రిస్క్‌లు తెస్తాయి. స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. iOSలో షార్ట్‌కట్స్ యాప్‌తో ఆటోమేషన్ చేయవచ్చు కానీ చాలా స్టెప్స్ ఉంటాయి. బిల్ట్-ఇన్ ఫీచర్ వస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి.

షెడ్యూలింగ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది

Advertisement

లీక్ అయిన స్క్రీన్‌షాట్స్ ప్రకారం చాట్ ఆప్షన్స్‌లో షెడ్యూలింగ్ సెక్షన్ ఉంటుంది. అక్కడ ఆ చాట్‌లో షెడ్యూల్ చేసిన మెసేజ్‌ల లిస్ట్ కనిపిస్తుంది. ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా, క్లీన్‌గా ఉంటుంది. స్క్రీన్‌షాట్ గ్రూప్ చాట్‌లో చూపించింది కానీ ప్రైవేట్ చాట్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. బిజినెస్ యూజర్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సెండ్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి డేట్, టైమ్ ఎంచుకుని షెడ్యూల్ చేయవచ్చు. నిర్దేశిత సమయంలో ఆటోమేటిక్‌గా మెసేజ్ వెళ్తుంది.

Also Read: ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ కొంటే పాత ఫోన్ డెలివరీ.. ఎలా గుర్తుపట్టాలంటే

ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యం?

మెసేజ్ షెడ్యూలింగ్ టైమ్ సేవ్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. బర్త్‌డే విషెస్ ముందుగానే షెడ్యూల్ చేయవచ్చు. ప్రొఫెషనల్స్ రాత్రి లేచి రిమైండర్స్ పంపాల్సిన అవసరం లేదు. బిజినెస్‌లు పీక్ టైమ్‌లో అనౌన్స్‌మెంట్స్ ప్లాన్ చేయవచ్చు. ప్రొడక్టివిటీ, కన్వీనియన్స్ పెరుగుతాయి. రిస్కీ థర్డ్-పార్టీ యాప్స్ అవసరం తగ్గుతుంది. డేటా సేఫ్‌గా వాట్సాప్‌లోనే ఉంటుంది. రైవల్ యాప్స్‌లో ఇది ఉంది కాబట్టి వాట్సాప్ యూజర్లు దీన్ని ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

వాట్సాప్ త్వరలో ఈ ఫీచర్‌ను అనౌన్స్ చేయవచ్చు. రాబోయే నెలల్లో బీటా టెస్టింగ్ మొదలవుతుంది. సక్సెస్‌ఫుల్ టెస్టింగ్ తర్వాత స్టేబుల్ వెర్షన్ రిలీజ్ అవుతుంది. యాప్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేసుకోండి. కొత్త ఫీచర్లు ఫేజ్డ్ అప్‌డేట్స్‌లో వస్తాయి. కొందరికి ముందు, మిగతా వారికి తర్వాత లభిస్తాయి. ఈ ఫీచర్ వస్తే రోజువారీ మెసేజింగ్ మరింత సులభం, ఫ్లెక్సిబుల్ అవుతుంది.

Related News

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×