E-Paper
Advertisement

కాకినాడ నుంచి మైసూరుకు డైరెక్ట్ ట్రైన్.. ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

కాకినాడ నుంచి మైసూరుకు డైరెక్ట్ ట్రైన్.. ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!
Advertisement

Kakinada-Mysuru Train Service Starts: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాకినాడ నుంచి  కొత్త రైల్వే సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా కాకినాడ– మైసూర్ మధ్య నేరుగా నడిచే రైలు సర్వీసును తాజాగా ప్రారంభించింది. ఈ రైలుకు 17289 అనే నంబర్‌ను కేటాయించారు అధికారులు. ఈ రైలును కాకినాడ లోక్‌సభ సభ్యుడు  టి. ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.

ఉదయం 9 గంటలకు కాకినాడ నుంచి ప్రారంభం

ఈ రైలు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరుతుంది. రాజమండ్రి, తణుకు, భీమవరం, గుడివాడ, విజయవాడ లాంటి ముఖ్య నగరాల మీదుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూరు చేరుకుంటుంది. దీని ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభమైంది.

నెరవేరిన కాకినాడ ప్రజల చిరకాల కోరిక

Advertisement

ఈ రైలు సర్వీసు ప్రారంభంతో కాకినాడ, పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. మైసూరుకు నేరుగా వెళ్లే సౌకర్యం లేకపోవడం వల్ల ఇంత వరకు ప్రయాణికులు మధ్యలో రైళ్లు మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే రైలులో సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారాలు చేసుకునేవారితో పాటు యాత్రికులకు  ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

రైల్వేమంత్రికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ధన్యవాదాలు

అటు ఈ రైలు సర్వీసు ప్రారంభం సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కేంద్రం రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు చెప్పారు. ఈ రైలు సర్వీసు వాణిజ్య, విద్య, పర్యాటక రంగాలకు మేలు చేస్తుందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయన్నారు. ఈ రైలు మంజూరు కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు పలుమార్లు వినతి పత్రాలు అందించినట్లు చెప్పారు. ఈ సర్వీసును ఆమోదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంతోషం వ్యక్తం చేసిన గోదావరి రైల్వే ప్రయాణికుల సంఘం

Advertisement

ఇక గోదావరి జిల్లా రైల్వే ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. తమ అభ్యర్థనకు త్వరగా స్పందించి ఈ రైలును ప్రారంభించినందుకు ఎంపీతో పాటు రైల్వే అధికారులకు సంఘం అధ్యక్షుడు గట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డి.ఎన్. రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కొత్త రైలు సర్వీసు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలను కూడా పెంచే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: జమ్మూ నుంచి శ్రీనగర్‌ కు డైరెక్ట్ ట్రైన్.. దశాబ్దాల కల సాకారం!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×