E-Paper
Advertisement

Manikonda News: మణికొండని చుట్టుముట్టిన వాటర్.. అపార్ట్‌మెంట్ల సెల్లార్లు మునక, అర్ధరాత్రి ఏం జరిగింది?

Manikonda News: మణికొండని చుట్టుముట్టిన వాటర్.. అపార్ట్‌మెంట్ల సెల్లార్లు మునక, అర్ధరాత్రి ఏం జరిగింది?
Advertisement

Manikonda News: హైదరాబాద్ సిటీకి వచ్చే తాగునీటి పైపు లైన్లను వాటర్ విభాగం మరమ్మతులు చేస్తోంది. ఏం జరిగిందో తెలీదుగానీ అర్ధరాత్రి మణికొండలోని పలు అపార్టుమెంట్లను వాటర్ చుట్టుముట్టింది. అపార్టుమెంటు సెల్లార్లు ముగినిపోయాయి. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

మణికొండని చుట్టుముట్టిన వాటర్

Advertisement

హైదరాబాద్‌ సిటీలోని మణికొండ ప్రాంతంలోని పలు కాలనీలను నీరు ముంచెత్తింది. అర్ధరాత్రి మణికొండలో భారీ పైప్‌లైన్‌ పగిలిపోయింది. దీంతో పలు కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. సింగూరు నుంచి హైదరాబాద్‌కు తాగునీటి పైప్ లైన్ అది. తెల్లవారుజామున పగిలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో అపార్ట్‌మెంటు సెల్లార్లు నీటితో నిండిపోయాయి.

ఎటు చూసినా నీరు కనిపించడంతో అపార్టుమెంట్ వాసులు షాకయ్యారు. సెలార్లలోని వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వాటర్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా సిబ్బంది, వాటర్ విభాగం అధికారులు అక్కడికి చేరుకున్నారు.  మోటార్లను పెట్టి సెల్లారులోని వాటర్‌ని బయటకు పంపించే ప్రయత్నం చేశారు.

Advertisement

అర్ధరాత్రి పగిలిన వాటర్ పైపులైన్..  అపార్ట్‌మెంట్  సెల్లార్లలోకి వాటర్

నీటి కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఎంప్లాయిస్‌ కాలనీ, శివసాయి కాలనీల్లోని సెల్లార్లలోకి వరద చేరింది. దీంతో కార్లు, టూ వీలర్స్ నీటిలో చిక్కుకున్నాయి. నీరు ముంచెత్తడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలో పందెన్ వాగు ఉండడంతో నీరంతా అందులోకి చేరినట్టు తెలుస్తోంది.

నీరు జోరుకు సీసీరోడ్డు ధ్వంసమయ్యాయి. పైపులైన్ బ్లాస్ట్ కావడంతో సమీపంలోని అపార్టుమెంట్ సెలార్లలోకి వాటర్ చేరింది. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ వాహనాలు నీట మునిగాయి. మణికొండ నుంచి షేక్‌పేట్‌కు వెళ్లే దారిలో రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. ప్రస్తుతం ట్రాఫిక్ నార్మల్‌గా ఉంది, పైపులైన్‌కు మరమ్మత్తులు చేస్తున్నారు అధికారులు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×