AC cooling problem: ఇంటికి రాగానే ఏసీ ఆన్ చేసి హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటే.. అది కాస్తా ఐదు నిమిషాలకే ట్రిప్ అయిపోతోందా? గది చల్లబడకుండా కేవలం ఫ్యాన్ గాలి మాత్రమే వస్తోందా? అయితే ఈ సమస్యను అస్సలు లైట్ తీసుకోవద్దు. ఏసీ పదే పదే ట్రిప్ అవ్వడానికి కేవలం చిన్న డస్ట్ ప్రాబ్లం నుంచి కంప్రెసర్ ఫెయిల్యూర్ వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఏసీ ట్రిప్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి కాలంలో ఏసీలు ఎక్కువ సేపు పనిచేయడం వల్ల వాటిపై లోడ్ పెరుగుతుంది. ఏసీ పదే పదే ఆఫ్ అయిపోవడాన్ని “Short Cycling” అంటారు. దీనికి గల ప్రధాన కారణాలు ఇవే..
1. డర్టీ ఎయిర్ ఫిల్టర్స్ (మురికి పట్టిన ఫిల్టర్లు):
చాలా మంది ఏసీ ఫిల్టర్లను క్రమంగా శుభ్రం చేయరు. ఫిల్టర్లలో దూళి పేరుకుపోవడం వల్ల గాలి సరిగ్గా లోపలికి వెళ్లదు. దీనివల్ల ఏసీ కాయిల్స్ గడ్డకట్టుకుపోతాయి. సిస్టమ్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండేందుకు ఏసీ ఆటోమేటిక్‌గా ట్రిప్ అయిపోతుంది.
2. కండెన్సర్ కాయిల్స్ బ్లాక్ అవ్వడం:
రూమ్ బయట ఉండే అవుట్‌డోర్ యూనిట్ లోపల కండెన్సర్ కాయిల్స్ ఉంటాయి. ఇవి బయటి వాతావరణంలో ఉండటం వల్ల దుమ్ము, ఆకులు, చెత్తాచెదారంతో నిండిపోతాయి. దీని వల్ల లోపలి వేడి బయటకు వెళ్లలేక, కంప్రెసర్ విపరీతంగా వేడెక్కి ఐదు నిమిషాల్లోనే షట్ డౌన్ అవుతుంది.
3. తక్కువ గ్యాస్ లెవెల్స్:
ఏసీలో గ్యాస్ (రెఫ్రిజెరెంట్) తగ్గినా లేదా లీకేజీ ఉన్నా కూలింగ్ రాదు. గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు గదిని చల్లబరచడానికి కంప్రెసర్ డబుల్ కష్టపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో కంప్రెసర్ ఓవర్‌లోడ్ అయిపోయి ట్రిప్ అవుతుంది.
4. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ & కేపాసిటర్ ఫెయిల్యూర్:
మన ఇళ్లలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటే ఏసీ సరిగ్గా నడవదు. అలాగే.. ఏసీ స్టార్ట్ అవ్వడానికి సహాయపడే ‘కేపాసిటర్’ పాడైపోయినా కూడా కంప్రెసర్ రన్ అవ్వలేక ఐదు నిమిషాలకే ట్రిప్ అవుతుంది. మంచి స్టెబిలైజర్ లేకపోవడం కూడా దీనికి ఒక కారణం.
5. థర్మోస్టాట్ లేదా సెన్సార్ ప్రాబ్లం:
గదిలోని ఉష్ణోగ్రతను కనిపెట్టే థర్మోస్టాట్ సెన్సార్ తప్పుగా పనిచేస్తుంటే.. గది చల్లబడకముందే చల్లబడినట్లు ఏసీ బోర్డుకు సిగ్నల్స్ పంపుతుంది. దీనివల్ల ఏసీ ఐదు నిమిషాలకే కంప్రెసర్‌ను ఆఫ్ చేసేస్తుంది.
Also Read: వాషింగ్ మెషీన్ కొంటున్నారా ? మీ కుటుంబానికి ఏ కెపాసిటీ (KG) కరెక్టో తెలుసుకోండిలా!
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?
ఫిల్టర్లు క్లీన్ చేయండి: ప్రతి 15 రోజులకు ఒకసారి మీ ఏసీ ఇండోర్ యూనిట్ ఫిల్టర్లను తీసి నీటితో శుభ్రం చేసుకోండి.
అవుట్‌డోర్ యూనిట్ చెక్ చేయండి: అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ గాలి ఆడేలా చూసుకోండి. దానిపై దుమ్ము ఎక్కువగా ఉంటే.. వాటర్ పైపుతో జాగ్రత్తగా క్లీన్ చేయండి.
స్టెబిలైజర్ వాడండి: వోల్టేజ్ సమస్యలు రాకుండా ఉండేందుకు నాణ్యమైన డిజిటల్ స్టెబిలైజర్‌ను అమర్చుకోండి.
ప్రొఫెషనల్ సర్వీసింగ్: సమస్య గ్యాస్ లీకేజీ లేదా కేపాసిటర్ వల్ల అయితే సొంత ప్రయోగాలు చేయకుండా వెంటనే ఒక మంచి ఏసీ టెక్నీషియన్‌ను పిలిపించి జనరల్ సర్వీసింగ్ చేయించడం బెస్ట్.