E-Paper
Advertisement

Tanveer Ahmed: వైభ‌వ్ బ్యాట్ లో AI చిప్స్..అందుకే భ‌యంక‌ర‌మైన సిక్సులు కొడుతున్నాడు

Tanveer Ahmed: వైభ‌వ్ బ్యాట్ లో AI చిప్స్..అందుకే భ‌యంక‌ర‌మైన సిక్సులు కొడుతున్నాడు
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇరగదీశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన (Sunrisers Hyderabad) 97 పరుగులు సాధించి సెంచరీ మిస్ చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పైన మరోసారి పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా తన బ్యాట్ లో ఏఐ చిప్స్ ( AI ) పెట్టి ఉంటాడ‌ని ఆరోపణలు చేశారు. అందుకే స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ బౌలర్లను ఉతికి పారేశాడని బాంబు పేల్చారు. భయంకరమైన సిక్సర్లు అందుకే వెళ్లాయని వివరించారు. దీనిపైన ఐసీసీ కచ్చితంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు తన్వీర్ అహ్మద్.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

వైభ‌వ్ బ్యాట్ లో AI చిప్స్..అందుకే సిక్సులు కొడుతున్నాడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్  ( Indian Premier League 2026 Tournament)  నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న హైదరాబాద్ జట్టు పైన 97 పరుగులు చేసి.. చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ పైన పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే వైభవ్ సూర్య వంశీ వయస్సు పైన పలు ఆరోపణలు చేసిన తన్వీర్ అహ్మద్, ఇప్పుడు అతని బ్యాట్ల పైన కామెంట్స్ చేశారు. నిన్న హైదరాబాద్ తో ( SRH) జరిగిన మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్పులు పెట్టాడని బాంబు పేల్చారు.

అందుకే కమిన్స్ ఇలాంటి వరల్డ్ క్లాసు బౌలర్ బౌలింగ్ లో కూడా సిక్సర్లు అవలీలగా కొట్టాడని సంచలన ఆరోపణలు చేశారు. అందులో ఏఐ చిప్పులు( AI Chips) లేకపోతే అంత భారీ సిక్సులు వెళ్ళవని పేర్కొన్నారు. ఒక్క క్యాచ్ లేపకుండా అన్ని సిక్సర్లు లేదా బౌండరీలు కొట్టడం అసాధ్యమన్నారు. అందుకే వెంటనే వైభవ్ సూర్య వంశీ బ్యాట్లను ఐసీసీ పాలకమండలి చెక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐసిసికి లేఖ రాస్తానని కూడా పేర్కొన్నారు తన్వీర్ అహ్మద్. అలాగే అతడి వయస్సు కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వైభవ్ 15 సంవత్సరాలు కాదని.. అతని వయసు 23 నుంచి 25 మధ్యలో ఉంటుందని షాకింగ్ విష‌యాల‌ను బయటపెట్టారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీకి బోన్ టెస్ట్ ( Bone Test For Vaibhav) కూడా చేయాలని అప్పట్లో డిమాండ్ చేశాడు తన్వీర్ అహ్మద్.

Advertisement

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×