E-Paper
Advertisement

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Wildlife Facts: సాధారణంగా పక్షులు తమ గూళ్లను నిర్మించుకోవడానికి ఎండుగడ్డి, చిన్న చిన్న రెమ్మలు, మెుత్తటి దూది లాంటి వాటిని ఉపయోగిస్తుంటాయి. అయితే కొన్ని పక్షులు ఒకడుగు ముందుకు వేసి.. వాటి గూళ్లలో పాము కుబుసాన్ని (Snake Skin) పెడుతుంటాయి. ఇది చూడటానికి కొంచెం వింతగా, భయానకంగా అనిపించినప్పటికీ.. దీని వెనుక పక్షుల అద్భుతమైన తెలివితేటలు, శాస్త్రీయ కారణం దాగి ఉంది. అది ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శత్రువుల నుండి రక్షణ

పక్షులు తమ గూళ్లలో పాము కుబుసాన్ని పెట్టడానికి ప్రధాన కారణం రక్షణ. పిచ్చుకలు, ఫ్లైక్యాచర్స్ (Flycatchers), బ్లూబర్డ్స్ వంటి చిన్న పక్షులు.. చెట్ల మీద లేదా తొర్రల్లో గూళ్లు కట్టుకుంటాయి. ఈ గూళ్లపై ఉడుతలు, కాకులు ఇతర పెద్ద పక్షులు దాడి చేసి గుడ్లను, పిల్లలను తినేస్తుంటాయి. కాబట్టి గూటి వెలుపల లేదా లోపల పాము కుబుసం పెడితే.. శత్రువులు తమ పిల్లల జోలికి రావని పక్షుల నమ్మకం. గూటి వద్ద పాము ఉందని భావించి.. అవి తమ పిల్లల జోలికి వచ్చే సాహసం చేయవని పక్షుల మాస్టర్ ప్లాన్.

పాము వాసనతో రక్షణ తంత్రం

Advertisement

పాము కుబుసానికి ఒక రకమైన ప్రత్యేకమైన వాసన ఉంటుంది. పక్షుల గుడ్లను దొంగిలించే కొన్ని రకాల క్షీరదాలు (Mammals), ఇతర జీవులు ఈ వాసనను పసిగట్టగానే ప్రాణభయంతో వెనక్కి తగ్గుతాయి. కేవలం చూపుతోనే కాకుండా వాసన ద్వారా కూడా శత్రువులను ముగ్గులోకి దించి మోసం చేయడంలో పక్షులు ఎంతటి మేధావులో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మెత్తటి బెడ్ షీట్

పాము కుబుసం చాలా తేలికగా, మెత్తగా, సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ గుడ్లు, పిల్లల కోసం గూటి లోపలి భాగాన్ని వెచ్చగా, సౌకర్యవంతంగా మార్చుకోవడానికి దీనిని పక్షులు ఒక బెడ్‌షీట్‌లా ఉపయోగిస్తాయి. అంతేకాకుండా గూటి నిర్మాణంలో ఇవి ఇతర పదార్థాలను గట్టిగా పట్టి ఉంచడానికి కూడా సహాయపడతాయి.

Advertisement

Also Read: మీ పాత ఏసీని అమ్మాలా? ఆన్‌లైన్ vs ఆఫ్‌లైన్.. ఎక్కడ ఎక్కువ లాభం?

పక్షుల ప్లాన్ సక్సెస్..

పక్షులు తమ గూటిలో పాము కుబుసం పెట్టడం.. శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం కొన్ని పక్షుల గూళ్ల నుండి పాము కుబుసాలను తొలగించి చూశారు. అలా తొలగించిన గూళ్లపై ఉడుతలు, ఇతర శత్రువుల దాడులు చాలా రెట్లు పెరిగినట్లు వారు గమనించారు. దీన్ని బట్టి పక్షులు ఏదో అనుకోకుండా కుబుసాన్ని తెచ్చుకోలేదని అవి కావాలనే వెతికి పట్టుకుని మరీ ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయని అర్థమవుతోంది.

Also Read: ఏసీలో వింత శబ్దాలు వస్తున్నాయా? కారణం ఇదే కావొచ్చు.. జాగ్రత్త భయ్యో!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×