E-Paper
Advertisement

Malla Reddy: సచ్చిపోతుండ్రు.. నా మీద ఎందుకంత పగ.. శ్రీధర్ బాబుపై మల్లారెడ్డి మాటలు వింటే

Malla Reddy: సచ్చిపోతుండ్రు.. నా మీద ఎందుకంత పగ.. శ్రీధర్ బాబుపై మల్లారెడ్డి మాటలు వింటే
Advertisement

Malla Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై అత్యంత భావోద్వేగంతో ప్రసంగించారు. ముఖ్యంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం తనపై పగ ప్రదర్శించవద్దని సభా సాక్షిగా వేడుకున్నారు. తన మిత్రుడు శ్రీధర్ బాబు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా రావడం సంతోషాన్ని ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

మల్లారెడ్డి తన ప్రసంగంలో జవహర్‌నగర్‌ను తన గుండెకాయగా అభివర్ణించారు. గతంలో దీనిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారని, కానీ ప్రస్తుతం అది కేవలం ఒక చెత్త కుప్పగా మారిందని విమర్శించారు. అక్కడ పేరుకుపోయిన వ్యర్థాల వల్ల వస్తున్న భయంకరమైన దుర్వాసనతో ప్రజలు జీవించలేకపోతున్నారని.. కనీసం తాను కూడా అక్కడ నిమిషం పాటు ఉండలేకపోతున్నానని సభలో ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఆయన ప్రభుత్వాన్ని ఒక భారీ ప్యాకేజీని డిమాండ్ చేశారు. జవహర్‌నగర్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేయడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 1,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ‘శ్రీధరన్న దండం పెడతా.. నాపై పగ వద్దు’ అంటూ మంత్రిని ఉద్దేశించి విన్నవించుకున్నారు.

చివరగా.. నియోజకవర్గంలోని ప్రజల కష్టాలను వివరిస్తూ.. అక్కడ సరైన రోడ్లు లేవని, స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, స్థానికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి, మానవతా దృక్పథంతో తన నియోజకవర్గాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: సీనియర్ నేత జీవన్‌‌రెడ్డి ఇష్యూ.. హైకమాండ్ బుజ్జగింపులు, మహేష్‌కుమార్ చర్చలు

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×