E-Paper
Advertisement

ఇంట్లోనే వర్షం.. బెడ్‌రూమ్ పక్కనే వెన్నెల.. మన తాతల నాటి ‘ఏసీ ఇల్లు’!

ఇంట్లోనే వర్షం.. బెడ్‌రూమ్ పక్కనే వెన్నెల.. మన తాతల నాటి ‘ఏసీ ఇల్లు’!
Advertisement

Manduva Houses: ప్రస్తుత రోజుల్లో ఇసుక, సిమెంట్, కాంక్రీట్ తో ఎంత పెద్ద ఇల్లు కట్టినప్పటికీ.. సమ్మర్ వస్తే చాలు అవి సెగలు కక్కుతున్నాయి. ఏసీ లేకుండా క్షణం కూడా ఉండే పరిస్థితి ఆ ఇళ్లల్లో ఉండటం లేదు. అయితే మన పూర్వీకులు కట్టిన ఇళ్లు.. ఇందుకు భిన్నంగా ఎంతో చల్లగా, అహ్లాదకరమైన అనుభూతిని ఇస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సంప్రదాయ శైలి అయిన ‘మండువా ఇళ్లు’ లేదా ‘మండువా లోగిలి’ ఈ వేసవిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంటి మధ్య భాగంలో పైకప్పు లేకుండా ఓపెన్ ప్లేస్ వదిలి.. దాని చుట్టూ గదులు, వరండాలు నిర్మించడాన్ని ‘మండువా ఇల్లు’ అంటారు. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాకుండా.. దీనివెనుక గొప్ప సైన్స్ కూడా దాగుందని నిపుణులు అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఏసీని తలపించే కూలింగ్..

మండువా ఇళ్లల్లో గాలి, వెలుతురు చాలా సహజ సిద్ధంగా వస్తాయి. మధ్యలో ఉండే ఖాళీ స్థలం వల్ల వేడి గాలి పైకి పోయి.. చల్లని గాలి లోపలికి వస్తుంది. పైకప్పుకు సిమెంట్‌కు బదులు మట్టి పెంకులు ఉపయోగించడం, గోడలను నల్లరేగడి మట్టి లేదా సున్నంతో కట్టడం వల్ల.. బయట ఎండలు దంచికొడుతున్నా ఇల్లు లోపల ఏసీ ఉన్నట్లు చల్లగా ఉంటుంది.

లైట్లు, ఫ్యాన్లు అక్కర్లేదు

Advertisement

మండువా ఇళ్ల నిర్మాణాల్లో సిమెంట్, ఇనుము వాడకం చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు. కలప, మట్టి, రాయి, పెంకులు వంటి సహజ వనరులను ఉపయోగించే ఈ ఇళ్లను ప్రధానంగా నిర్మిస్తారని తెలియజేస్తున్నారు. దీని వల్ల కార్బన ఉద్గారాలు విడుదల తగ్గి.. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంటి మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉండటం వల్ల వెలుతురు, గాలి బాగా వచ్చి.. పగటిపూట లైట్లు, ఫ్యాన్లు అస్సలు అవసరం ఉండదని తెలియజేస్తున్నారు. ఫలితంగా విద్యుత్ బిల్లును భారీగా ఆదా చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.

వేసవిలో నీటి సమస్యకు చెక్

మండువా ఇళ్ల మధ్యలో పైకప్పు ఉండదు కాబట్టి.. వర్షం పడినప్పుడు ఆ నీరంతా నేరుగా ఇంటి మధ్యలోనే పడుతుంది. ఆ నీటిని వృధా పోనివ్వకుండా భూగర్భంలోకి వెళ్లేలా లేదా ‘పాతాళ గంగ’ (రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్) లోకి వెళ్లేలా అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థను అప్పట్లోనే ఏర్పాటు చేసేవారు. ఇది భూగర్భ జలమట్టాన్ని పెంచేది. ఫలితంగా సమ్మర్ లోనూ ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా భూగర్భ జలాలు అందుబాటులో ఉండేవి.

ప్రకృతి విపత్తులను తట్టుకునేలా..

Advertisement

మండువా ఇళ్లను భారీ టేకు లేదా మద్ది కర్రల స్తంభాల ఆధారంగా నిర్మిస్తారు. ఈ చెక్క స్తంభాలకు, దూలాలకు ఒకదానికొకటి ‘ఇంటర్‌లాకింగ్’ వ్యవస్థ ఉంటుంది. ఫలితంగా భూకంపాలు వచ్చినప్పుడు సిమెంట్ కట్టడాల్లా ఇవి కుప్పకూలే ఛాన్స్ ఉండదని నిపుణులు అంటున్నారు. స్ప్రింగ్ యాక్షన్ లాంటి లూజ్ జాయింట్స్ భూమి ప్రకంపనల ఒత్తిడిని తట్టుకుని నిలబడతాయని తెలియజేస్తున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద తుఫానులు, గాలి దుమారం చెలరేగిన చెక్కుచెదరకుండా ఈ ఇళ్లు సాలిడ్ గా ఉంటాయని వివరిస్తున్నారు.

Also Read: రాత్రంతా ఏసీ వేసినా కరెంట్ బిల్లు రాకూడదా? రిమోట్లోని ఈ ‘మ్యాజికల్’ బటన్ నొక్కాల్సిందే!

మానసిక ప్రశాంతత

సాధారణ ఇళ్లతో పోలిస్తే మండువా ఇళ్లు ప్రశాంతతకు కేరాఫ్ గా నిలుస్తుంటాయి. ఇంటి మధ్యలో నిలబడితే పైన ఆకాశం నేరుగా కనిపిస్తోంది. వర్షం, వెన్నెలను ఇంట్లో నుండే ఆస్వాదించేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ సభ్యులు అంతా కలిసి.. ఒకచోట చేరి ముచ్చట్లు చెప్పుకునేందుకు ఇంటి మధ్యలో ఉండే ఓపెన్ ప్లేస్ చాలా బాగా ఉపయోగపడేవి. మెుత్తంగా ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల ఇంట్లోని వారికి ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం, ప్రశాంతత లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

Also Read: మీ ఫోన్ మీపైనే నిఘా పెట్టిందా? వెంటనే ఇలా చేయకపోతే.. తప్పదు భారీ మూల్యం!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×