RCB VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Qualifier 1) మధ్య మంగళవారం క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగు పెట్టింది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ భయంకరమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో గుజరాత్ ఓటమిపాలైంది. కీలక మ్యాచ్ లో ఓడిపోయినందుకు గాను గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ అలాగే కోచ్ ఆశిష్ నెహ్రా మధ్య డ్రెస్సింగ్ రూమ్ లోకి గొడవ జరిగినట్లు వార్తలు వైరల్ గా మారాయి. దీని అంతటికి కారణం కగిసో రబాడా అంటూ వార్తలు వస్తున్నాయి.
Also Read: Vaibhav-Parag: వైభవ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బయటపెట్టిన రియాన్ పరాగ్, ఇదిగో షాకింగ్ వీడియో
క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ సందర్భంగా బెంగుళూరు మొదటగా బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 254 పరుగులు సాధించింది బెంగళూరు. రజత్ ఒక్కడే 93 పరుగులు సాధించాడు. చివరి 5 ఓవర్లలో ప్రమాదకరంగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుండగా 14వ ఓవర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్ చేశాడు. అందులో మూడవ బంతిని ఫుల్ షాట్ ఆడెందుకు ప్రయత్నించాడు రజత్. ఆ సమయంలో క్యాచ్ రాగా.. డీప్ స్క్వేర్ లెగ్ లో ఉన్న కగిసో రబాడా (Kagiso Rabada) వదిలేశాడు. చేతులకు వచ్చిన క్యాచ్ ను ( Rabada dropped Patidar) వదిలేసి.. గుజరాత్ కొంపముంచాడు. దీంతో బెంగళూరు జట్టుకు కగిసో రబాడా అమ్ముడుపోయాడని సోషల్ మీడియాలో గుజరాత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రూ. 2.81 కోట్లకు డీల్ కూడా కుదుర్చుకున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు కగిసో రబాడాపై దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఆ క్యాచ్ పట్టి ఉంటే గుజరాత్ ( GT) గెలిచేదని అంటున్నారు.
బెంగళూరు ( RCB) చేతిలో క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ ( Gill), కోచ్ ఆశిష్ నెహ్రా మధ్య డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కగిసో రబాడాను సరిగ్గా వాడుకోలేదని ఆశిష్ నెహ్రా సీరియస్ అయ్యారట. విరాట్ కోహ్లీ ఔట్ అయిన వెంటనే, కగిసో రబాడను వాడుకోకుండా గిల్ (Shubman Gill ) పెద్ద తప్పిదం చేశాడని ఆశిష్ నెహ్రా ( Ashish Nehra) సీరియస్ అయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. నీకేం తెలుసు.. పరిస్థితి అక్కడ వేరేలా ఉందని.. ఆశిష్ నెహ్రాకు ఘాటు గానే గిల్ సమాధానం ఇచ్చాడట. దీంతో గొడవ జరిగినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఇద్దరు చల్లబడి.. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లోనైనా కలిసికట్టుగా ఆడాలని డిసైడ్ అయ్యారట. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: Abdul Razzaq: PSL అల్లా కంటే పవిత్రమైనది..ఐపీఎల్ అతిపెద్ద ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL
Ashish Nehra after watching GT's fielding!#RCBvsGT pic.twitter.com/KLaiF5hVU4
— Saumya Hemant Mishra (@SaumyaHemant) May 26, 2026
🚨 Heated argument took place between Ashish Nehra and Shubman Gill 🚨
> Acc. to sources, there was a heated argument between Gill & Nehra in the dressing room after yesterday’s loss
> Ashish Nehra had reportedly sent a message during the match asking Gill to bring Rabada back… pic.twitter.com/YO19AdvXrs
— Harsh shekhawat (@wordofshekhawat) May 27, 2026