E-Paper
Advertisement

Voice Recording: మీ గొంతు రికార్డింగ్‌లో ఎందుకు వరస్ట్‌గా వినిపిస్తుంది? షాకింగ్ రీజన్!

Voice Recording: మీ గొంతు రికార్డింగ్‌లో ఎందుకు వరస్ట్‌గా వినిపిస్తుంది? షాకింగ్ రీజన్!
Advertisement

Voice Recording: మనం మన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు మన గొంతు మనకు ఎంతో రాయల్ గా, బేస్ వాయిస్‌తో చాలా బాగుంది అనిపిస్తుంది. మనమేదో ఎస్పీ బాలు గారినో లేక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌నో అనుకుని మురిసిపోతుంటాం. కానీ, పొరపాటున ఎప్పుడైనా వాట్సాప్‌లో పంపిన వాయిస్ మెసేజ్‌ని ప్లే చేశామో.. ఇక అంతే! ‘ఛీ.. నా గొంతు ఇలా ఉందేంటి? అసలు ఈ గొంతుతోనేనా నేను ఇన్నాళ్లు అందరితో మాట్లాడింది?’ అని ఒక సెకను పాటు మన మీద మనకే అసహ్యం వేస్తుంది. ఆ రికార్డింగ్ విన్నాక, ‘ఇకపై ఎవరితోనూ మాట్లాడకూడదు.. మౌనవ్రతం పట్టేయాలి’ అని కూడా అనిపిస్తుంది. మరి మనకు మన గొంతు బాగుంది అనిపించి, రికార్డింగ్‌లో మాత్రం ఎందుకు అంత చెత్తగా వినిపిస్తుంది? దీని వెనుక ఉన్న ఆ ‘షాకింగ్’ సైన్స్ ఏంటో తెలుసుకుందాం!

మన గొంతు వెనుక సైన్స్

Advertisement

అసలు విషయం ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు మన గొంతును మనం రెండు దారుల్లో వింటాం. ఒకటి గాలి ద్వారా (Air Conduction), రెండోది మన పుర్రె ఎముకల ద్వారా (Bone Conduction). మనం మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్ద తరంగాలు కేవలం బయటి గాలి ద్వారానే కాకుండా, మన లోపల ఉన్న దవడ ఎముకలు, పుర్రె ద్వారా నేరుగా లోపలి చెవికి చేరుతాయి. ఇలా ఎముకల ద్వారా ప్రయాణించేటప్పుడు శబ్దం కొంచెం లో-ఫ్రీక్వెన్సీకి మారుతుంది. అందుకే మనకు మన గొంతు చాలా గంభీరంగా, బేస్ ఎక్కువగా ఉండి వినడానికి చాలా రిచ్‌గా అనిపిస్తుంది. మన లోపల మనం ఒక చిన్న థియేటర్ ఎఫెక్ట్‌ను ఎంజాయ్ చేస్తామన్నమాట!

వాయిస్ రికార్డింగ్ మిస్టరీ

Advertisement

కానీ, మీరు వాయిస్ రికార్డ్ చేసినప్పుడు ఆ మైక్రోఫోన్ కేవలం గాలి ద్వారా వచ్చే శబ్దాన్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. అంటే, మీ పుర్రె ఎముకల ద్వారా వచ్చే ఆ ‘బేస్ ఎఫెక్ట్’ రికార్డింగ్‌లో ఉండదు. కేవలం గాలి ద్వారా ప్రయాణించి ప్రపంచానికి వినిపించే మీ అసలైన గొంతు మాత్రమే అందులో ఉంటుంది. మీరు రికార్డింగ్ ప్లే చేసినప్పుడు మీ మెదడు.. ‘అరే! నేను ఎప్పుడూ వినే ఆ గంభీరమైన గొంతు ఎక్కడ? ఇదేదో కొత్తగా, కీచుగా ఉందేంటి?’ అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ తేడాను మనం తట్టుకోలేకే, మన గొంతు మనకు అంత వరస్ట్‌గా వినిపిస్తుంది.

మన మనసు చేసే చిన్న మోసం!

దీనినే సైన్స్ భాషలో ‘వాయిస్ కాన్ఫ్రంటేషన్’ (Voice Confrontation) అంటారు. అంటే మన గురించి మనకున్న ఊహకు, బయట ఉన్న వాస్తవానికి మధ్య జరిగే ఒక చిన్న పోరాటం అన్నమాట. నిజానికి మీ గొంతు మీ ఫ్రెండ్స్‌కు ఎప్పటి నుంచో అలాగే వినిపిస్తోంది. వాళ్లకు అది అలవాటే! కేవలం మీకు మాత్రమే అది కొత్తగా, వింతగా అనిపిస్తుంది. సో.. మీ గొంతు రికార్డింగ్‌లో బాగోలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అది మీకు మాత్రమే వింత.. లోకానికి అది మీ బ్రాండ్!

ఇకపై మీరు వాయిస్ మెసేజ్ విన్నప్పుడు అది మీ గొంతు కాదేమో అని భయపడకండి. మీ ఎముకలు మిమ్మల్ని ఇన్నాళ్లు ఒక మాయలో ఉంచాయని అర్థం చేసుకోండి. అయినా పరవాలేదు, మనల్ని మనం మెచ్చుకోవడానికి మన పుర్రె ఎముకలు చేసే ఈ చిన్న సాయం మనకు అవసరమే కదా!

Also Read: ఆవలింతలు ఒకరి నుంచి ఒకరికి ఎందుకు వస్తాయి? దీని వెనుకున్న ‘షాకింగ్’ సైన్స్!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×