E-Paper
Advertisement

ఇక పెట్రోల్ బైక్స్ కనిపించకూడదట.. ఢిల్లీ సర్కారు షాకింగ్ డెసిషన్!

ఇక పెట్రోల్ బైక్స్ కనిపించకూడదట.. ఢిల్లీ సర్కారు షాకింగ్ డెసిషన్!
Advertisement

Petrol Bikes Banned in Delhi: ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన ఈవీ పాలసీ 2.0ను కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచేందుకు షాకింగ్ డెసిషన్స్ తీసుకుంది. ఈ విధానం ప్రకారం, 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే ద్విచక్ర వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలి. అంటే, ఆ తేదీ తర్వాత పెట్రోల్ బైకులు, స్కూటర్లు కొత్తగా రిజిష్ట్రేషన్ చేయరు.

కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా..

ఢిల్లీలో ద్విచక్ర వాహనాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. మొత్తం వాహనాలలో దాదాపు 67 శాతం వరకు బైకులు, స్కూటర్లు ఉన్నాయి. ఉద్యోగులకు, విద్యార్థులకు ఇవే ప్రధాన ప్రయాణ మార్గం. ఇటీవల గిగ్ ఎకానమీ, బైక్ ట్యాక్సీలతో  కూడా వీటి సంఖ్య మరింత పెరిగింది. అందుకే ఈ విభాగాన్ని ముందుగా విద్యుదీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్రీ వీలర్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి కొత్త ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం కానుంది. దీని వల్ల క్రమంగా పెట్రోల్, డీజిల్ ఆటోలు పూర్తిగా తగ్గిపోతాయి.

స్కూల్ బస్సుల విషయంలోనూ కీలక నిర్ణయం

Advertisement

పాఠశాల బస్సుల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం, అన్ని పాఠశాలలు తమ వాహనాల్లో కొంత శాతం ఎలక్ట్రిక్ బస్సులను తప్పనిసరిగా చేర్చాలి. పాలసీ అమల్లోకి వచ్చిన రెండేళ్లలో కనీసం 10 శాతం, మూడు సంవత్సరాల్లో 20 శాతం, 2030 నాటికి కనీసం 30 శాతం బస్సులు ఎలక్ట్రిక్ కావాలి. ఇకపై క్యాబ్ సర్వీసులు, డెలివరీ కంపెనీలు తమ వాహనాల్లో కొత్తగా పెట్రోల్, డీజిల్ వాహనాలను చేర్చడానికి అనుమతి ఉండదు. అయితే 2026 చివరి వరకు BS-VI ప్రమాణాలున్న పెట్రోల్ ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

కీలక ప్రకటన చేసిన ఢిల్లీ రవాణామంత్రి

ఈవీ పాలసీ 2.0పై రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజలకు క్లీన్ రవాణా అందించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం పన్ను రాయితీలు, సబ్సిడీలు, ఛార్జింగ్ స్టేషన్ల పెంపు లాంటి చర్యల ద్వారా ఈ మార్పును వేగవంతం చేయాలని చూస్తోంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన పర్యావరణ నిపుణులు

Advertisement

పర్యావరణ నిపుణులు ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. సరైన అమలు జరిగితే, గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో   పెద్ద అడుగు అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే, కొంతమంది నిపుణులు ఈ విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ద్విచక్ర వాహనాలపై పూర్తిగా నిషేధం విధించడం వల్ల ప్రజలపై ఒత్తిడి పెరగవచ్చు అంటున్నారు.  మరికొందరు నిపుణులు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం కాకుండా, సాంప్రదాయ, ఎలక్ట్రిక్ వాహనాల మిశ్రమ విధానం ఉండాలంటున్నారు. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గించడానికి ప్రజా రవాణాను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు.

Read Also: ఒక్కసారే.. ఎక్కడికక్కడ ఆగిపోయిన వందలాది ట్యాక్సీలు.. ఓర్నీ ఇలా కూడా అవుతుందా?

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×