Best Dishwashers: సాధారణంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా పండగో, ఫంక్షనో జరిగినప్పుడు ఇంట్లో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే, ఆ ఉత్సాహం అంతా అయిపోయాక.. అసలు కష్టం మొదలవుతుంది. రోజంతా రకరకాల వంటలు చేసి కిచెన్ సింక్‌లో పడ్డ గిన్నెలను చూస్తే ఎవరికైనా చిరాకే మరి.
అలాగని పనే కదా అని వదిలేస్తే అవి కొండలా పేరుకుపోతాయి. పోనీ తోముదామంటే ఓపిక ఉండదు. అందుకే ఈ మధ్య చాలామంది డిష్‌వాషర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మీ ప్రాంతాల్లో నీటి సమస్యలు, వంటల్లో వాడే నూనె జిడ్డు, మసాలాలను దృష్టిలో పెట్టుకుని సరైదాన్ని ఎంచుకోవడం ముఖ్యం. ప్రస్తుతం రూ.50వేల లోపు అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఆప్షన్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి..
ముగ్గురు లేదా నలుగురు ఉండే చిన్న కుటుంబం అయితే బాష్ మోడల్ సూపర్ ఛాయిస్ అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఆన్‌లో ఉన్నప్పుడు పెద్దగా శబ్దం రాదు. వంటిల్లు హాల్‌కి పక్కనే ఉన్నా సరే ఎవరికీ డిస్టర్బ్ అవ్వదు. ఇక మన ఇండియన్ వంటలకు ఉన్న జిడ్డును వదలగొట్టడానికి దీనిలో ఇంటెన్సివ్ కడాయ్ అనే ఫీచర్ ఉంది. ఇది జిడ్డు వదలగొట్టడమే కాదు.. గ్లాస్ గిన్నెలను కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తుంది. దీని ధర సుమారు రూ.45,700 వరకు ఉంటుంది.
గిన్నెలు ఎక్కువగా పడే పెద్ద కుటుంబాల కోసం ఇది సరిపోతుంది. దీనిలో స్టీమ్ డ్రైయింగ్ ఫీచర్ ఉండటం వల్ల గిన్నెలు కడిగిన వెంటనే తడి లేకుండా, పరిశుభ్రంగా బయటకు వస్తాయి. మొండి మరకలు ఉన్న కుక్కర్లు, కడాయిల కోసం ఇందులో డీప్ క్లీన్ మోడ్ ఉంది. మన దగ్గర చాలా చోట్ల ఉప్పు నీటి సమస్య ఉంటుంది కదా.. దానికోసం ఈ డిష్‌వాషర్‌లో వాటర్ సాఫ్టెనర్ కూడా ఇచ్చారు. దీని ధర రూ.53,490 వరకు ఉంది.
Also Read: వివో, షియోమీల నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు చూస్తే వావ్ అవ్వాల్సిందే!
మంచి బడ్జెట్‌లో ఫీచర్లు బాగుండాలి అనుకునే వారికి ఇది కరెక్ట్ ఆప్షన్. ఈ డిష్‌వాషర్‌లో డ్యూయల్ జోన్ వాష్ అనే ఫీచర్ ఉంది. దీంతో పైన ఉండే గిన్నెలకు తక్కువ ప్రెషర్, కింద ఉండే పెద్ద గిన్నెలకు ఎక్కువ ప్రెషర్‌తో వాటర్ వస్తుంది. దీనివల్ల ఒకేసారి అన్ని రకాల గిన్నెలను క్లీన్ చేయొచ్చు. గిన్నెలు తక్కువగా ఉన్నప్పుడు సగం లోడ్‌తో కూడా పని పూర్తి చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ.36,990.
మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే వోల్టాస్ బెకోను పరిశీలించవచ్చు. ఇది చాలా తక్కువ నీటిని వాడుకుంటూనే క్లీనింగ్ బాగా చేస్తుంది. దీనిలో ఉన్న హైజీన్ ప్లస్ ఫీచర్ గిన్నెలను వేడి నీటితో కడిగి క్రిములు లేకుండా చేస్తుంది. పని కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. దీని ధర రూ.26,990 మాత్రమే.
మన భారతీయ వంటల కోసమే గోద్రెజ్ కంపెనీ దీనిని స్పెషల్‌గా డిజైన్ చేసింది. ఈ డిష్‌వాషర్‌లో తొమ్మిది రకాల వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సుమారు 70 డిగ్రీల వేడి నీటిని వాడుతుంది కాబట్టి.. నూనె జిడ్డు అస్సలు ఉండదు. ఇంట్లో పిల్లలు ఉంటే పొరపాటున బటన్లు నొక్కకుండా ఇందులో చైల్డ్ లాక్ ఫీచర్ కూడా ఇచ్చారు. అయితే డిష్‌వాషర్ కొనేటప్పుడు మీ ఇంట్లో రోజుకు ఎన్ని గిన్నెలు పడతాయో ఆలోచించి కెపాసిటీని ఎంచుకోండి. అలాగే మీ ఏరియాలో నీటి క్వాలిటీ ఎలా ఉంటుందో చూసుకుని మంచి మోడల్‌ను సెలక్ట్ చేసుకోవడం ఉత్తమం.
Also Read: భారీగా తగ్గిన Redmi Note 13 5G ధర.. స్టాక్ అయిపోయే లోపే ఆఫర్‌ను పట్టేయండి బ్రో!