నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. భారత వైమానిక దళం (IAF) వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ ‘సి’ సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే 2వ తేదీన వెలువడనున్న ఎంప్లాయిమెంట్ న్యూస్ ప్రకటన ప్రకారం.. ఈ దరఖాస్తు ప్రక్రియ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్ తో పాటు సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ (CMTD) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 47 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
వెకెన్సీ వివరాలు: యూనిట్ల వారీగా చూస్తే హెచ్‌క్వార్టర్ మెయింటనెన్స్ కమాండ్‌లో 14 పోస్టులు ఉన్నాయి. హెచ్‌క్వార్టర్ ట్రైనింగ్ కమాండ్‌లో 05 పోస్టులను కేటాయించారు. హెచ్‌క్వార్టర్ సెంట్రల్ ఎయిర్ కమాండ్‌లో 03 ఖాళీలు ఉండగా.. హెచ్‌క్వార్టర్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో 06 పోస్టులు ఉన్నాయి. హెచ్‌క్వార్టర్ ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో 06 పోస్టులను భర్తీ చేస్తారు. హెచ్‌క్వార్టర్ సౌత్ వెస్ట్రన్ కమాండ్‌లో 05 ఖాళీలు ఉన్నాయి. సదరన్ ఎయిర్ కమాండ్‌లో 01 పోస్టు ఉండగా.. ఇండిపెండెంట్ యూనిట్స్ పరిధిలో మరో 07 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: ఎల్‌డీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. వీరికి కంప్యూటర్‌పై నిమిషానికి 35 పదాల ఇంగ్లిష్ టైపింగ్ వేగం అవసరం. హిందీ టైపిస్ట్ పోస్టుకు కూడా ఇంటర్మీడియట్‌తో పాటు హిందీ టైపింగ్‌లో ప్రావీణ్యం ఉండాలి. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు లైట్, హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
* అభ్యర్థులకు మోటార్ మెకానిజంపై ప్రాథమిక అవగాహన ఉండటంతో పాటు కనీసం రెండేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండటం తప్పనిసరి.
వయస్సు: దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు లభిస్తుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తారు. డ్రైవర్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉండవచ్చు.
దరఖాస్తు విధానం: అర్హులైన వారు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను నోటిఫికేషన్‌లో సూచించిన సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు నిర్ణీత గడువులోగా పంపాలి.
ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన వచ్చిన 30 రోజుల్లోగా దరఖాస్తులు చేరాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://indianairforce.nic.in/
ALSO READ: స్టూడెంట్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.48,000 స్కాలర్ షిప్, ఈ విద్యార్హత ఉంటే చాలు..!