Shaun Pollock On Temba Bavuma: ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా (South Africa vs Australia) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అయితే ఈ సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించగా, రెండో టెస్ట్ లో మాత్రం దక్షిణాఫ్రికా దుమ్ము లేపింది. దీంతో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఇలాంటి క్రమంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమాపై మాజీ ఆటగాడు షాన్ పొల్లాక్ (Shaun Pollock On Temba Bavuma) ప్రశంసల వర్షం కురిపించారు.
తెంబా బవుమా ఉండేది మూడు ఫీట్లు అయినప్పటికీ.. వాడిని గెలికితే ఆస్ట్రేలియాను 100 అడుగుల లోతులో పాతేస్తాడని షాన్ పొల్లాక్ హెచ్చరించారు. మొదటి టెస్ట్ గెలిచిన తర్వాత ట్రావిస్ హెడ్ అనవసరంగా వాడిని గెలికాడని.. దాని ప్రతిఫలమే రెండో టెస్ట్ విజయం అంటూ వ్యాఖ్యానించారు. పొట్టోడా పొట్టోడా అంటే గుడ్డలు కూడా తీసి కొట్టడం తప్ప వాడికి మరో విషయం తెలియదని వార్నింగ్ ఇచ్చారు. ఈ తరుణంలోనే షాన్ పొల్లాక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య అక్టోబర్ 18న ప్రారంభమైన రెండో టెస్ట్ మ్యాచ్ లో తెంబా బవుమా
సేన అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియాపై ఏకంగా 31 పరుగులు తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలవడంపై షాన్ పోల్లాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్ధులు ఎవరైనా గెలికితే, తెంబా బవుమా అసలు ఊరుకోడని వార్నింగ్ ఇచ్చాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని తెలిపారు. గతంలో ఇండియా గడ్డపై కూడా తెంబా బవుమాను ట్రోల్స్ చేశారని ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలో బ్యాట్ తోనే సమాధానమిచ్చి ఇండియాను ఓడించాడని తెలిపారు. ఈ విషయం తెలిసినా కూడా ట్రావిస్ హెడ్ ఓవరాక్షన్ చేసి.. తన గోతిలో తానే పడ్డాడని సెటైర్లు పేల్చారు. ఒరేయ్ హెడ్…బవుమా కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు అంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా స్పష్టంగా చెబుతున్నా… ఒక గొప్ప ఆటగాడిని ఎప్పుడు కూడా రెచ్చగొట్టకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. అలా గెలికితే మాత్రం పెను తుఫాను రావడం గ్యారంటీ అంటూ హెచ్చరించారు. కాగా తొలి టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత, తెంబ బవుమాను హేళన చేస్తూ ట్రావిస్ హెడ్ పోస్టులు పెట్టారు. ఈ తరుణంలోనే రెండో మ్యాచ్ ను గెలిపించి, ఆస్ట్రేలియాపై బవుమా పగతీర్చుకున్నాడు.