E-Paper
Advertisement

రూ.499లకే అదిరిపోయే ఇయర్‌బడ్స్! తక్కువ ధరలో 48 గంటల బ్యాటరీ బ్యాకప్

రూ.499లకే అదిరిపోయే ఇయర్‌బడ్స్! తక్కువ ధరలో 48 గంటల బ్యాటరీ బ్యాకప్
Advertisement

Wtoo V2 Ear TWS review: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఇయర్‌ బడ్స్ లేదా హెడ్‌ఫోన్స్ రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే మంచి సౌండ్ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలా మంది భావిస్తారు. ఆ అపోహను పూర్తిగా తొలగిస్తూ ప్రముఖ బ్రాండ్ నుంచి వస్తున్న ‘Wtoo V2 Ear TWS’ ఇయర్‌ బడ్స్ కేవలం రూ.499 ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి. అందుకే వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ బడ్జెట్ ఇయర్‌ బడ్స్ యూజర్లను ఎందుకు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,లుకింగ్:

ఈ బడ్జెట్ రేంజ్‌లో ఇలాంటి ప్రీమియం లుకింగ్ ఇయర్‌ బడ్స్ రావడం నిజంగా విశేషం. ముఖ్యంగా ‘బీజ్’ కలర్ ఆప్షన్‌లో ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా అంతే కాకుండా ట్రెండీగా కనిపిస్తాయి. చెవుల్లో సరిగ్గా ఇమిడి పోయేలా ఎర్గోనామిక్ డిజైన్‌తో వీటిని తయారు చేసారు. ఇవి ఎంతసేపు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి ఉండదు. లైట్‌ వెయిట్ డిజైన్ కారణంగా.. వీటిని జేబులో లేదా చిన్న బ్యాగులో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.

సౌండ్ క్వాలిటీ, డ్రైవర్స్:

Advertisement

రూ.500 లోపు ధరలో వస్తున్నప్పటికీ, సౌండ్ విషయంలో ..  సంస్థ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో పవర్ ఫుల్ 13mm డ్రైవర్లను వాడారు. దీని వల్ల పాటలు వినేటప్పుడు బేస్ చాలా స్పష్టంగా, రిచ్‌గా వినిపిస్తుంది. వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు..అవతలి వారి కబుర్లు క్లియర్‌గా వినపడతాయి. మ్యూజిక్ లవర్స్‌కు ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది అద్భుతమైన ఆడియో ఫీల్ అందిస్తుంది.

బ్యాటరీ బ్యాకప్ 48 గంటల ప్లేటైమ్:

ఈ ఇయర్‌ బడ్స్ హైలైట్ వీటి బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 48 గంటల వరకు నాన్‌ స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. అంటే.. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు వారమంతా.. ఎలాంటి ఛార్జింగ్ టెన్షన్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. బ్యాచిలర్స్, స్టూడెంట్స్ , రోజూ ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

Advertisement

Also Read: మీ ఇంటికి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇదే..మిజియా 6 ఫీచర్లు అదుర్స్!

కనెక్టివిటీ, టచ్ కంట్రోల్స్:

లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న BT V5.4 బ్లూటూత్ కనెక్టివిటీ ఇందులో లభిస్తుంది. దీని వల్ల ఫోన్‌తో ఇయర్‌బడ్స్ క్షణాల్లో.. కనెక్ట్ అవుతాయి. కనెక్షన్ కూడా చాలా స్టేబుల్‌గా ఉంటుంది. ఆడియో లాగ్ సమస్యలు లేకుండా గేమింగ్ లేదా వీడియోలు చూడొచ్చు. అలాగే వీటిపై ఇచ్చే స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ మాట్లాడటం, మ్యూజిక్ ప్లే/పాజ్ చేయడం చాలా ఈజీగా చేయెచ్చు.

వాటర్ రెసిస్టెన్స్:

ఇవి IPX5 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో వస్తాయి. జిమ్ చేసేటప్పుడు చెమట పట్టినప్పుడు.. లేదా చిన్న పాటి వర్షంలో తిరిగినా ఇయర్‌ బడ్స్ పాడైపోతాయనే టెన్షన్ ఉండదు. అన్ని అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న.. ఈ ‘Wtoo V2 Ear TWS’ అసలు ధర మార్కెట్లో కేవలం రూ.499 మాత్రమే ఉండటం దీనిని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది.

అతి తక్కువ బడ్జెట్‌లో.. అదిరి పోయే బ్యాటరీ లైఫ్, స్టైలిష్ లుక్ , మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే.. వారికి ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.బడ్జెట్ కూడా ఈ బడ్జెట్ గాడ్జెట్‌కు భారీ డిమాండ్ ఉంది. మీరు కూడా తక్కువ.. ధరలో బెస్ట్ ఇయర్‌ బడ్స్ కొనాలనుకుంటే.. ఇది బెస్ట్ ఆప్షన్!

Related News

ఈ సౌండ్ బార్ ఉంటే..ఇల్లు డిస్కో టెక్ అవడం గ్యారంటీ!

రూ.750కే అద్భుతమైన బ్లూటూత్..ఇయర్ బడ్స్! అస్సలు మిస్సవ్వొద్దు!

బిగ్ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఏసర్‌ప్యూర్ నైట్రో 85 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్

మీ ఇంటికి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇదే..మిజియా 6 ఫీచర్లు అదుర్స్!

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్..మీ ఇంటి అవసరాలకు ఏది బెస్ట్?

తక్కువ ధరలో ప్రీమియం మ్యూజిక్..బెస్ట్ 5 సోనీ హెడ్‌ఫోన్స్ ఇవే!

అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టార్టప్ విప్లవం..స్పేస్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు..!

Big Stories

Advertisement
×