Yuzvendra Chahal On Dhanashree Verma Divorce: తన భార్య తన ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన సంఘటనపై మరోసారి టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత పచ్చి తాను తాగుబోతును అయ్యానంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆకాష్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుజ్వేంద్ర చాహల్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన అంశంపై కూడా స్పందించారు.
భార్యతో విడాకులు, సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో మద్యానికి బానిసైనట్టు యుజ్వేంద్ర చాహల్ వెల్లడించారు. విడాకులు తీసుకున్న తర్వాత తన పరిస్థితి పూర్తిగా అద్భుతప్పి… లిక్కర్ కు బానిస అయ్యానని ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో తనపై జరిగిన ప్రచారం నేపథ్యంలో మానసికంగా కుంగిపోయానని వెల్లడించారు. ఈ క్రమంలో దాదాపు 40 రోజులకు పైగా రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయే వాడినని.. ఆ రెండు గంటలు ఏడ్చుకుంటూ ఉండేవాడినని ఎమోషనల్ అయ్యారు. ఇలా ఒక్క విడాకులు తన లైఫ్ ను తలకిందులు చేసిందని బాంబు పేల్చారు. అలాంటి సమయంలో తనకు ఎవరు తోడు లేరన్నారు.
ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన తర్వాత మధ్యలో మునిగిన తాను క్రికెట్ పై ఆలోచన పెట్టినట్టు యుజ్వేంద్ర చాహల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ కోసం వెంటనే రిహాబ్ సెంటర్ కు వెళ్లారని తెలిపారు. దాదాపు 26 రోజులు ఆ సెంటర్లోనే ఉండి ఆల్కహాల వ్యసనం నుంచి బయటపడినట్టు గుర్తు చేశారు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చాలామంది చేశారని ఆగ్రహించారు. ధనశ్రీ వర్మను తానే మోసం చేసినట్టు కొంత మంది పోస్టులు పెట్టారని ఫైర్ అయ్యారు.
తనను చీటర్ గా చాలామంది నిర్ణయించారని ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఆత్మహ**త్య చేసుకోవాలని ఆలోచనలు కూడా వచ్చాయని బాంబు పేల్చారు. కానీ… తనకు ఇష్టమైన క్రికెట్ కోసం బతకాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇక అప్పటి నుంచి క్రికెట్ పై సాధన చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో రాణిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. టీమిండియాలో అవకాశం కోసం తాను ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. అవకాశం వస్తే కచ్చితంగా బరిలోకి దిగుతానని వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా 2020లో పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మ, చాహల్… రెండు సంవత్సరాలు కాపురం చేశారు. 2022 నుంచి విడివిడిగా ఉన్నారు. ఇక 2025 మార్చి 20వ తేదీన ముంబైలోని ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.
🔴I GET PANIC ATTACK – CHAHAL OPENS UP ABOUT HIS DIVORCE🤯
🎙️: Yuzi Chahal revealed how the difficult phase of his divorce affected his mental health and cricket career. He admitted that he struggled with anxiety and panic attacks, sometimes finding it difficult to even speak.… pic.twitter.com/1tbbuAvhph
— Sam (@cricsam02) October 15, 2026