E-Paper
Advertisement

X, AWS, ChatGPT డౌన్.. సోషల్ మీడియా, న్యూస్ వెబ్ సైట్లకు అంతరాయం

X, AWS, ChatGPT డౌన్.. సోషల్ మీడియా, న్యూస్ వెబ్ సైట్లకు అంతరాయం
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డిజిటల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో.. లక్షల మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవ ChatGPT, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), గ్లోబల్ కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ అయిన Cloudflare వంటి కీలక సేవలు డౌన్ అయ్యాయి.

భారత్‌లో ఎఫెక్ట్..

Advertisement

ఈ అంతరాయం భారతదేశంలో ఎక్కువగా ప్రభావం చూపింది. అత్యధికంగా నెటిజన్లు X ప్లాట్‌ఫామ్‌పై ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో 50 శాతం మంది X ఫీడ్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొనగా, 29 శాతం మంది X వెబ్‌సైట్‌తో ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. ఈ సాంకేతిక అంతరాయం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్‌సైట్‌లకు సమస్య తలెత్తింది. ఇంటర్నెట్ స్పీడ్, DDoS (Distributed Denial of Service) రక్షణ సేవలను అందించే క్లౌడ్ ఫ్లేర్ (Cloudflare) కూడా డౌన్ అయింది. విచిత్రమేమిటంటే.. ఈ అంతరాయాలను పర్యవేక్షించే డౌన్ డిటెక్టర్ సైట్ కూడా కొంతసేపు పనిచేయడం ఆగిపోయింది. ఇది క్లౌడ్ ఫ్లేర్ రక్షణపై ఆధారపడటం వలన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

క్లౌడ్ ఫ్లేర్ వల్ల మరింత ప్రభావం..

Advertisement

సాధారణంగా.. వెబ్ సేవలకు అంతరాయం కలిగినప్పుడు ఏడబ్ల్యూఎస్ (AWS), క్లౌడ్ ఫ్లేర్ (Cloudflare) వంటి ప్రధాన సర్వీస్ ప్రొవైడర్‌లు డౌన్ అవడం వలన ఆ ప్రభావం మరింత విస్తృతంగా ఉంటుంది. AWS అనేది ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. అదేవిధంగా.. Cloudflare అనేక కంపెనీలకు యూజర్ వెరిఫికేషన్, సెక్యూరిటీ, వెబ్‌సైట్ ఫాస్ట్ లోడింగ్ సేవలను అందిస్తుంది.

వేలాది వెబ్ సైట్‌లపై ప్రభావితం..

కాబట్టి.. ఈ రెండు సేవల్లో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా..దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది ఇతర వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ సేవలను ప్రభావితం చేస్తుంది. అక్టోబర్‌లో కూడా ఏడబ్ల్యూఎస్ అవుటేజ్ కారణంగా ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ జరిగింది. ప్రస్తుతానికి, ఆయా కంపెనీలు సేవలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

ALSO READ: RRB Group-D: 32,438 గ్రూప్-డీ ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ వాయిదా, కొత్త షెడ్యూల్ ఇదే

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×