Naxal Mukt Bharat: “దేశంలో మావోయిస్ట్ (నక్సల్) సమస్యను మార్చి 31, 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తాం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం. అనుకున్నది చేసి చూపించబోతోంది. ఇందుకోసం భద్రతా చర్యలు, అభివృద్ధి, రిహ్యాబిలిటేషన్ అనే త్రిముఖ వ్యూహాన్ని అవలంభిస్తుంది. 2013లో 126 జిల్లాల్లో ఉన్న నక్సల్ ప్రభావం, ఇప్పుడు కేవలం 3 జిల్లాలకు (ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్) పరిమితమైంది. త్వరలో అక్కడ కూడా అంతం కాబోతోంది. మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ ను చూడబోతున్నారు.” కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఇది. మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తామంటూ గత ప్రభుత్వాలకు పూర్తి భిన్నంగా ముందుకు సాగుతుంది మోడీ ప్రభుత్వం. ‘ఆపరేషన్ కాగర్’ పేరుతో మావోయిస్టుల ఏరివేత కొనసాగిస్తోంది.
తాజాగా ఏపీలోని పుల్లగండి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మొత్తం ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్-1 కమాండర్ హిడ్మా, అతడి భార్య హేమ సహా మరో నలుగురు హతమయ్యారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కీలక వ్యూహాత్మకుడు, గెరిల్లా యుద్ధ నిపుణుడు అయిన హిడ్మా.. 2004-2024 మధ్యలో జరిగిన 27 కీలక దాడులకు మాస్టర్ మైండ్. ఆయన మీద ఏకంగా రూ. 1 కోటి రివార్డ్ ఉంది. ఆయన భార్య మీద రూ. 50 లక్షల రివార్డు ఉంది. హిడ్మా మరణంతో అమిత్ షా నిర్దేశించిన మార్చి 31 డెడ్ లైన్ కు మరో కీలక ముందడుగు పడినట్లు అయ్యింది. అదే సమయంలో హిడ్మా టీమ్ కు చెందిన 28 మంది మావోయిస్టులు కృష్ణా జిల్లాలో అరెస్ట్ అయ్యారు. హిడ్మా బ్యాచ్ కు తగిలిని తాజా ఎదురు దెబ్బతో.. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుల సంఖ్య 45 మంది నుంచి 10 మందికి పడిపోయింది. దండకారణ్య జోన్, సౌత్ బస్తర్‌లో మావోయిస్ట్ బ్యాక్ బోన్ బ్రేక్ అయ్యింది.
2025లో మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడింది. భద్రతా బలగాల మూకుమ్మడి దాడులతో భారీ సంఖ్యలో మావోయిస్ట్ క్యాడర్ ఆయుధాలు వదిలి ప్రజా జీవితంలో కలిసిపోతున్నారు. అదే సమయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. రోడ్లు, స్కూళ్లు, ఆసుపత్రుల నిర్మాణం చేపడుతుంది. సరెండర్ అయిన మావోయిస్టులకు రివార్డులు అందజేయంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. వారికోసం స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో CRPF లాంటి సెక్యూరిటీ ఫోర్సెస్ 400 పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లు ఏర్పాటు చేశాయి. నక్సల్స్ ఏరివేతను నిరాటకంగా కొనసాగిస్తున్నాయి.
2025లో ఇప్పటి వరకు 312 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. ఒక అబుజ్ మాడ్ లోనే నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. 836 మంది అరెస్ట్ అయ్యారు. మరో 1,639 మావోయిస్టులు సరెండర్ య్యారు. మల్లోజుల పొలిట్‌బ్యూరో మెంబర్ వేణుగోపాల్ రావు, సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాతక్క, రాజ్‌మన్ మండవి, సెంట్రల్ కమిటీ మెంబర్ రూపేష్ అలియాస్ సతీష్, సెంట్రల్ కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ చంద్రన్నాబండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, సీనియర్ మావోయిస్ట్ లీడర్, భూపతి భార్య తారక్కతో సహా కీలక మావోయిస్టు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కీలక వ్యూహాలతో మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ అవతరించబోతోంది. నక్సల్స్ అంతం అయ్యాక.. అర్బన్ నక్సల్స్ మీద కేంద్రం ప్రత్యేక ఫోకస్ పెట్టబోతుంది. ఆ దిశగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి.
Read Also: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..