XGIMI Vibe One 1080p Full HD Projector: ఇంట్లోనే.. సినిమా థియేటర్ ఫీల్ కోరుకునే.. టెక్ లవర్స్ కోసం మార్కెట్లో.. అనేక స్మార్ట్ ప్రొజెక్టర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. బడ్జెట్ ధరలో అఫీషియల్ నెట్‌ఫ్లిక్స్, గూగుల్ టీవీ, పవర్ ఫుల్ జేబీఎల్ సౌండ్‌తో వస్తున్న.. ఈ ప్రొజెక్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. రూ 24,999 ధర కేటగిరీలో లభించే.. ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్, ఎలాంటి కేబుల్స్ లేదా ఫైర్ స్టిక్స్ అవసరం లేకుండా నేరుగా ఓటీటీ యాప్స్‌ను రన్ చేసే అద్భుతమైన ఫీచర్‌ను కలిగి ఉంది. ఆటో ఫోకస్, బిల్ట్-ఇన్ బ్యాటరీ, అదిరిపోయే పిక్చర్ క్వాలిటీతో వస్తున్న ఈ అద్భుతమైన పోర్టబుల్ ప్రొజెక్టర్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో పెద్ద టీవీల కంటే రూమ్‌లో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లగల పోర్టబుల్ ప్రొజెక్టర్లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్ అయిన ఎక్స్‌జిమి మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ ప్రొజెక్టర్ మోడ్రన్ యూజర్లను కట్టిపడేస్తోంది. దీని కాంపాక్ట్ డిజైన్, స్టైలిష్ లుక్స్ చూడటానికి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. దీన్ని మీ బెడ్‌రూమ్ నుంచి లివింగ్ రూమ్‌కు, లేదా అవుట్‌డోర్ ట్రిప్స్‌కు సైతం చాలా ఈజీగా మీ బ్యాగులో సర్దుకుని తీసుకెళ్లొచ్చు. దీని తయారీ క్వాలిటీ చాలా పటిష్టంగా ఉండటంతో.. తరచూ వాడటానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ పేరుకు తగ్గట్టుగానే.. 1080p ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా.. 4K అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను కూడా ప్లే చేయగలదు. ఇందులో.. అందించిన 250 ISO ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ కారణంగా చీకటి రూమ్‌లో లేదా తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాలలో అత్యంత స్పష్టమైన విజువల్స్ కనిపిస్తాయి. సినిమా చూసేటప్పుడు.. లేదా వెబ్ సిరీస్ ఆస్వాదించేటప్పుడు.. ప్రతీ చిన్న వివరాలు స్పష్టంగా కనిపించేలా ఇది అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది.
సాధారణ ప్రొజెక్టర్లలో.. ఓటీటీ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఈ మోడల్లో అఫీషియల్ నెట్‌ఫ్లిక్స్, గూగుల్ టీవీ సపోర్ట్ నేరుగా లభిస్తుంది. దీని వల్ల ఎలాంటి అదనపు ఫైర్ స్టిక్స్ లేదా కేబుల్స్ అవసరం లేకుండానే.. నేరుగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ యాప్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్.. చాలా స్మూత్‌గా ఉండటంతో పాటు వాయిస్ కంట్రోల్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.
4.జేబీఎల్ స్పీకర్లతో మత్తెక్కించే సౌండ్:
ఒక మంచి ప్రొజెక్టర్‌లో.. వీడియో ఎంత ముఖ్యమో.. సౌండ్ కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో.. ఈ డివైస్ అదరగొట్టింది. ఇందులో ప్రముఖ ఆడియో బ్రాండ్ అయిన జేబీఎల్ కు చెందిన 2×3W స్పీకర్లను అమర్చారు. అదనపు హోమ్ థియేటర్ స్పీకర్లు.. అవసరం లేకుండానే గది మొత్తం క్రిస్టల్ క్లియర్, పవర్ ఫుల్ ఆడియోతో నిండిపోతుంది. పాటలు విన్నా, సినిమా చూసినా థియేటర్లో.. కూర్చున్న ఫీల్ కలుగుతుంది.
Also Read: రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ
ప్రొజెక్టర్‌ను గోడ ఎదురుగా.. సెట్ చేయడం.. చాలా మందికి తలనొప్పి పని. కానీ.. ఇందులో.. ఉన్న.. ఆటో కీస్టోన్, ఆటో ఫోకస్ టెక్నాలజీ కారణంగా.. ప్రొజెక్టర్‌ను ఎక్కడ పెట్టినా అది క్షణాల్లో స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుని స్పష్టమైన పిక్చర్స్ ఇస్తుంది. అంతేకాకుండా.. ఇందులో.. బిల్ట్-ఇన్ బ్యాటరీ ఉండటం వల్ల పవర్ సప్లై లేని.. చోట కూడా సుమారు 1.2 గంటల పాటు నిరంతరం వీడియోలను ఎంజాయ్ చేయొచ్చు.
రూ.24,999 బడ్జెట్ ధరలో.. అఫీషియల్ నెట్‌ఫ్లిక్స్, గూగుల్ టీవీ, జేబీఎల్ సౌండ్, ఆటో ఫోకస్ ఫీచర్లతో.. వస్తున్న ఈ మోడల్ ప్రొజెక్టర్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ ఇంట్లోనే.. మినీ థియేటర్ ఏర్పాటు.. చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా చక్కటి వాల్యూ ఫర్ మనీ ప్రొజెక్టర్.