E-Paper
Advertisement

Xiaomi 17 Ultra Leica: ఏఐ కెమెరాలకు ధీటుగా రియలిస్టిక్ ఫోటోగ్రఫీ.. షావోమీ 17 అల్ట్రా లైకా

Xiaomi 17 Ultra Leica: ఏఐ కెమెరాలకు ధీటుగా రియలిస్టిక్ ఫోటోగ్రఫీ.. షావోమీ 17 అల్ట్రా లైకా
Advertisement

Xiaomi 17 Ultra Leica| స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో షావోమీ ఒక ఛాలెంజింగ్ ఫోన్ తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ఎక్కువ ఆధారపడదు. బదులుగా రియలిస్టిక్ ఫొటోగ్రఫీ అంటే నిజమైన రూపం, భావోద్వేగ కథనానికి ప్రాధాన్యం ఇస్తుంది. చాలా ఆధునిక ఫోన్లు మంచి షార్ప్‌నెస్, డిజిటల్ పర్ఫెక్షన్ పై ఫోకస్ చేస్తాయి. కానీ ఈ ఫోన్ సహజ సిద్ధంగా కనిపించే లోపాలను అనుమతిస్తుంది. టెక్స్‌చర్లు, నీడలు, మనిషి ముఖ భావాలను అలాగే భద్రపరుస్తుంది. Leica లెన్స్ కంపెనీ రియలిస్టిక్ ఫోటోగ్రఫీకి ప్రసిద్ధి చెందింది. ఈ లెన్స్‌లు ప్రాకృతికంగా డీటైలింగ్ సంగ్రహించడానికి ప్రయత్నిస్తాయి, కృత్రిమ అందాన్ని సృష్టించడం కాదు.

లాంచ్ వివరాలు, ధరలు

షావోమీ 17 అల్ట్రా సిరీస్ ఇటీవల చైనాలో లాంచ్ అయింది. రెండు మోడల్స్ ఉన్నాయి.. ఒక బేసిక్ షావోమీ 17 అల్ట్రా, రెండవి షావోమీ 17 అల్ట్రా By Leica ఎడిషన్. సాధారణ మోడల్ ధర RMB 6999 (భారత కరెన్సీలో రూ.91288) నుంచి మొదలవుతుంది. Leica ఎడిషన్ 16GB + 512GB వేరియంట్ RMB 7999 (రూ.104331), టాప్ 1TB వేరియంట్ RMB 8999. భారతదేశంలో ధర సుమారు రూ.93,000 (రూ.117374 ) లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు.

హార్డ్‌వేర్, పనితీరు

Advertisement

చైనా వేరియంట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తుంది. గూగుల్ యాప్స్ లేవు కానీ కెమెరా పర్‌ఫామెన్స్‌పై ప్రభావం ఉండదు. మెయిన్ కెమెరా 50MP Light Fusion 1050L సెన్సార్‌తో 1-ఇంచ్ సైజు ఉంది. ఇది ఎక్కువ లైటింగ్ సేకరిచడంతో పాటు డైనమిక్ రేంజ్ ఇస్తుంది. టెలిఫోటో కెమెరా 200MP Leica లెన్స్‌తో 75mm నుంచి 100mm ఆప్టికల్ జూమ్ చేస్తుంది. 120x జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా-వైడ్ కెమెరా 50MP Samsung JN5 సెన్సార్‌తో ఉంది.

డిజైన్, Leica ఫీచర్లు

Leica ఎడిషన్‌లో ప్రసిద్ధ రెడ్ డాట్ లోగో ఉంది. షావోమీ ఫోన్‌లో ఈ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం ఇదే మొదటిసారి. ఫ్రేమ్‌పై Leica బ్రాండింగ్ ఉంది. రిబ్డ్ టెక్స్‌చర్ గ్రిప్ ఇస్తుంది. బ్యాక్ డ్యూయల్-టోన్ లెదర్ ఫినిషింగ్ ఉంది. ఇందులో ఉన్న స్పెషల్ లైకా కెమెరా రింగ్ మాన్యువల్ కంట్రోల్స్ ఇస్తుంది. ఫోకస్, జూమ్ కచ్చితంగా సర్దుబాటు చేయవచ్చు. CAI Photo Authenticity Protection ఫీచర్ నిజమైన ఫోటోలను గుర్తిస్తుంది.

రియలిస్టిక్ కెమెరా ఎక్స్‌పీరియన్స్

Advertisement

ఈ ఫోన్ ఉపయోగించడం చాలా సులభం. సెట్టింగ్స్ మార్చకుండానే అద్భుత ఫోటోలు తీయవచ్చు. మెయిన్ కెమెరా నేచురల్ కలర్స్ ఇస్తుంది. షాడోలు లేదా స్కిన్ టోన్స్ బూస్ట్ చేయదు. ఇమేజెస్ రియలిస్టిక్‌గా, బ్యాలెన్స్‌గా ఉంటాయి. టెలిఫోటో కెమెరా 60x జూమ్‌లో కూడా మంచి ఫోటోలు ఇస్తుంది. 120x వద్ద AI ఆఫ్ చేస్తే చాలా సాఫ్ట్ అండ్ రియల్ లుక్ వస్తుంది. అలాగే AI ఆన్ చేస్తే షార్ప్‌గా కనిపిస్తుంది.

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

వీడియో పర్‌ఫామెన్స్

ఫోన్ 8K 30fps వీడియో సపోర్ట్ చేస్తుంది. మెయిన్, టెలిఫోటోలో 4K 120fps రికార్డ్ అవుతుంది. అల్ట్రా-వైడ్ 60fps సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంది. వీడియో స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది.

షావోమీ 17 అల్ట్రా బై లైకా నిజమైన ఫోటోగ్రఫీ ఫ్లాగ్‌షిప్. ఈ ఫోన్ కెమెరా నేచురల్ ఫొటోగ్రఫీకే ప్రాధాన్యం ఇస్తుంది. కృత్రిమ అందంపై కాదు. Xiaomi 15 Ultraకు ఇది నేచురల్ అప్‌గ్రేడెడ్ వెర్షన్. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లలో ఈ ఫోన్ అద్భుతంగా ఉంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×