E-Paper
Advertisement

Xiaomi 17 Ultra: గేమ్ ఛేంజర్ షియోమి కొత్తఫోన్ రాబోతోంది.. లేటెస్ట్ ఫీచర్స్ తెలిస్తే ఐఫోన్ యూజర్లు సైతం షాకవ్వాల్సిందే!

Xiaomi 17 Ultra: గేమ్ ఛేంజర్ షియోమి కొత్తఫోన్ రాబోతోంది.. లేటెస్ట్ ఫీచర్స్ తెలిస్తే ఐఫోన్ యూజర్లు సైతం షాకవ్వాల్సిందే!
Advertisement

Xiaomi 17 Ultra: చైనా బ్రాండ్ షియోమి త్వరలో తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ‘షియోమి 17 అల్ట్రా’ను విడుదల చేయనుంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించిన ఈ ఫోన్, చైనాలో లాంచ్ అయిన షియోమి 17 సిరీస్‌లో కీలక మోడల్‌గా చేరనుంది. హైఎండ్ ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఇది మరోసారి షియోమి సామర్థ్యాన్ని చూపించనుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

త్వరలోనే విడుదల:

తాజా సమాచారం ప్రకారం.. షియోమి 17 అల్ట్రా ఈనెల 26న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 83,000గా ఉండొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఈ ఫోన్ చైనా 3C సర్టిఫికేషన్ సైట్‌లో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Read Also: విడుదలకి ముందే వివో X200T స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, కీలక వివరాలు లీక్!

భారత్‌లో ప్రారంభమైన టెస్టింగ్:

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 200MP టెలిఫొటో లెన్స్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండే అవకాశముంది. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఇవ్వవచ్చని సమాచారం. ఇటీవల ఒక టిప్‌స్టర్ వెల్లడించిన ప్రకారం.. Xiaomi 17, Xiaomi 17 Ultra మోడల్స్‌కు సంబంధించిన టెస్టింగ్ ఇప్పటికే భారత్‌లో ప్రారంభమైంది.

Advertisement

డిస్‌ప్లే పరంగా.. షియోమి 17 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.3 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉండనుందని చెబుతున్నారు.

శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్:

ఈ Xiaomi 17 Ultra చైనాలో రెండు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిలో ఒక వేరియంట్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉండవచ్చని సమాచారం. ఈ ఫీచర్ వల్ల నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా కాల్స్, మెసేజ్‌లు చేసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే స్టాండర్డ్ మోడల్ 2512BPNDAC, శాటిలైట్ కనెక్టివిటీ వేరియంట్ 25128PNA1C మోడల్ నెంబర్లతో 3C సైట్‌లో కనిపించాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఫోన్ శాటిలైట్ ఫీచర్ లేకుండానే విడుదలయ్యే అవకాశముంది.

ఇక హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. షియోమి 17 అల్ట్రాలో 16జీబీ RAM, 512జీబీ స్టోరేజ్ ఇచ్చే అవకాశం ఉందని లీక్స్ సూచిస్తున్నాయి. అలాగే ఈ హ్యాండ్ సెట్ 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇవ్వవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Read Also: బంఫర్ ఆఫర్ అంటే ఇదే మరి.. Pixel 9, Pixel 10 సిరీస్‌పై గూగుల్ కళ్లుచెదిరే డిస్కౌంట్!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×