Vivo X200T: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిదారు వివో తన ప్రీమియం X సిరీస్‌లో భాగంగా కొత్త Vivo X200T స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు హైఎండ్ ఫీచర్లను అందించే ఈ ఫోన్.. ముఖ్యంగా శక్తివంతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే భారత మార్కెట్లో విడుదలకి ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు లీకైంది. ఈ వివరాల్లోకి వెళితే..
త్వరలో మార్కెట్లోకి రానున్న Vivo X200 సిరీస్‌ను కంపెనీ పలు మోడల్స్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో Vivo X200, X200 Pro, X200 Ultra, X200s, X200 FE మోడల్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదే సిరీస్‌లో భాగంగా Vivo X200T స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాదిలో లాంచ్ చేయాలని వివో యోచిస్తున్నట్లు లీక్స్ సూచిస్తున్నాయి.
Vivo X200T ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ రానుందని లీక్‌లు చెబుతున్నాయి. దీనిలో Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, అధునాతన కెమెరా ఫీచర్లు, అలాగే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ను ప్రధానంగా ఆన్‌లైన్ విక్రయాలకే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా లీక్ అయిన స్పెసిఫికేషన్ల ప్రకారం.. వివో X200Tలో 6.31-ఇంచుల AMOLED డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది 2640 x 1216 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా Android 15 ఆధారిత FunTouch OS 15పై ఈ ఫోన్ రానుందని తెలుస్తోంది. గత మోడల్స్‌తో పోలిస్తే మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా దీనిని డిజైన్ చేసినట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇకపోతే ఈ వివో కొత్త హ్యాండ్ సెట్ ధర విషయానికి వస్తే.. దీనిని రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందించనున్నారు. బేస్ వేరియంట్ ధర సుమారు రూ.54,000 నుంచి టాప్ వేరియంట్ రూ.59,000 వరకు ఉండొచ్చని అంచనా. అలాగే మూడు రంగుల్లో ఈ ఫోన్ లభించే అవకాశం ఉంటుందని సమాచారం.
కెమెరా సెటప్‌లో 50MP Sony IMX921 ప్రైమరీ కెమెరా, దానికి తోడుగా 8MP వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వనున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. అలాగే పవర్ అవసరాల కోసం ఇందులో భారీ 6,500mAh బ్యాటరీ ఉండనుందని సమాచారం. మొత్తం మీద Vivo X200T ఒక ప్రీమియం, కెమెరా ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read Also: హెచ్ఎండి టచ్ 4జీ బ్యాక్ అగైన్.. ఆలస్యం చేస్తే మంచి అవకాశాన్ని కోల్పోతారు బాసూ!