E-Paper
Advertisement

ఫోన్ రీసెట్ చేసే ముందు ఈ ఒక్క పని చేయకపోతే.. మీ గూగుల్ అకౌంట్ డేంజర్లో పడ్డట్టే!

ఫోన్ రీసెట్ చేసే ముందు ఈ ఒక్క పని చేయకపోతే.. మీ గూగుల్ అకౌంట్ డేంజర్లో పడ్డట్టే!
Advertisement

Mobile Safety Tips: సాధారణంగా కొత్త ఫోన్ కొన్నప్పుడు ప్రతి ఒక్కరూ వెంటనే చేసే పనేంటంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేయడం. దీంతో మన పని అయిపోయింది, మన డేటా అంతా సేఫ్ అనుకుంటారు. ఇంకొంతమంది మంచి బ్రాండెడ్ ఫోన్ కొంటే దాదాపు పదేళ్లుగా దానినే వాడుతారు. ఈ క్రమంలో ముఖ్యమైన ఫైల్స్, ఫొటోలు, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇలా చాలానే ఆ ఫోన్‌లో దాచుకుంటుంటారు. అయితే ఇంత డేటా ఉన్న ఫోన్‌ను కేవలం ఒక్క క్లిక్‌తో ఫ్యాక్టరీ రీసెట్ చేసి వేరేవాళ్లకి ఇచ్చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే మన గూగుల్ అకౌంట్‌ను హ్యాక్ చేసే ఛాన్స్ వేరేవాళ్లకి ఇస్తున్నాం. కేవలం రీసెట్ చేస్తే సరిపోదు.. దానికంటే ముందు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. అదేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..

ఘోస్ట్ డివైజ్‌లు అంటే?

ఫోన్ రీసెట్ చేసినా కూడా.. మీ గూగుల్ అకౌంట్‌లో ఆ పాత ఫోన్ల ఆనవాళ్లు అలాగే ఉండిపోతాయని ఎప్పుడైనా గమనించారా? వీటిని ‘ఘోస్ట్ డివైజ్‌లు’ అంటారు. అంటే.. మీ ఫోన్ అమ్మేసినా, అది ప్లే స్టోర్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఆప్షన్‌గా కనిపిస్తూనే ఉంటుంది. అలాగే గూగుల్ ‘ఫైండ్ మై డివైజ్’ లోకి వెళ్తే.. ఎప్పుడో వాడేసిన పాత పిక్సెల్ ఫోన్లో లేక పాత శాంసంగ్ ఫోన్లలోనే మీ అకౌంట్ ఇంకా అలానే ఉంటుంది. ఆ ఫోన్ మీ దగ్గర లేకపోయినా మీ అకౌంట్‌ మాత్రం అందులోనే ఉంటుంది. ఒకసారి రీసెట్ అయిపోయాక వాటిని అకౌంట్ నుంచి తొలగించడం అంత సులభం కాదు.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ.. హానర్ నుంచి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

రీసెట్ చేసే ముందు..

ఈ తలనొప్పి రాకూడదంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఫోన్ రీసెట్ బటన్ నొక్కక ముందే.. మీ ఫోన్ నుంచి గూగుల్ అకౌంట్‌ను రిమూవ్ చేయాలి. దీనికోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ‘అకౌంట్స్’ లేదా ‘పాస్‌వర్డ్స్ అండ్ అకౌంట్స్’ అనే ఆప్షన్ వెతకాలి. అక్కడ మీ గూగుల్ మెయిల్ ఐడి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ‘రిమూవ్ అకౌంట్’ నొక్కాలి. ఇలా చేస్తేనే ఆ ఫోన్‌కు, మీ అకౌంట్‌కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోతుంది. ఆ తర్వాతే ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది.

ఇలా ఎందుకు చేయాలి?

Advertisement

ఈ టెక్ యుగంలో స్మార్ట్‌ఫోన్ అంటే.. కేవలం కాల్స్ మాట్లాడుకునేవి కావు. మన బ్యాంక్ అకౌంట్లు, సబ్‌స్క్రిప్షన్లు, ఫొటోలు అన్నీ గూగుల్ అకౌంట్‌తోనే ముడిపడి ఉన్నాయి. అందుకే సెక్యూరిటీ పరంగా చూసినా, అకౌంట్ రిమూవ్ చేయాలన్నా ఈ చిన్న స్టెప్ చాలా ముఖ్యం. ఒక్క నిమిషం ఓపిక పట్టి అకౌంట్ రిమూవ్ చేస్తే.. భవిష్యత్తులో మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయ్యే పరిస్థితి రాదు. అలాగే ప్లే స్టోర్‌లో పాత ఫోన్ల లిస్టు కనిపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదు. ఇకపై మీరు ఫోన్ మారుస్తున్నా లేదంటే ఇంట్లో ఎవరికైనా ఇస్తున్నా.. ఈ విషయాన్ని మర్చిపోకుండా ఫోన్ రీసెట్ చేయండి.

Also Read: 13,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ఐప్యాడ్‌కు చుక్కలు చూపిస్తున్న Vivo Pad 6 Pro!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×