E-Paper
Advertisement

హాలీవుడ్ దిగ్గజాలకే మైండ్ బ్లాక్…స్టార్స్ లేకుండానే రూ. 2200 కోట్లా?

హాలీవుడ్ దిగ్గజాలకే మైండ్ బ్లాక్…స్టార్స్ లేకుండానే రూ. 2200 కోట్లా?
Advertisement

Obsession Boxoffice:‘అబ్సెషన్’..‘అబ్సెషన్’…‘అబ్సెషన్’ ఇప్పుడీ పేరు వరల్డ్ సినిమాని ఒక రేంజ్ లో షేక్ చేస్తుంది,కారణం పెట్టిన పెట్టుబడికి వందల రెట్ల లాభాలని కొల్లగొట్టేసింది మరి. అవును…7 లక్షల 50 వేల డాలర్లు అంటే కేవలం ఏడు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా వంద రెండొందలు కాదు… ఏకంగా 234.5 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 2243 కోట్ల పై చిలుకు వసూళ్లతో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంది.ఇదొక మైక్రో-బడ్జెట్ హారర్ చిత్రం.యూట్యూబర్ నుంచి దర్శకుడిగా మారిన కర్రీ బార్కర్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మే 15న విడుదలైన ఈ సినిమా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్‌గా మారిపోయింది.

హారర్ చిత్రాలన్నింటిలో ఈ ఏడాది టాప్ పెర్ఫార్మర్‌

మాములుగా చూస్తె హర్రర్ సినిమాలకి ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గడం మనం చూస్తునే ఉంటాం. కానీ ‘అబ్సెషన్’ విషయంలో ట్రెండ్ పూర్తిగా రివర్స్ అయింది.అవును.. ఈ చిత్రం రెండో వారంలో మొదటి వారం కంటే ఏకంగా 39 శాతం అదనపు వసూళ్లను సాధించి ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్‌ను షాక్‌కు గురిచేసింది. అలాగే నాలుగో వీకెండ్ లో కేవలం 7 శాతం డ్రాప్‌తో 25.6 మిలియన్ డాలర్లు రాబట్టి హారర్ జోనర్‌లో ఆల్-టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Advertisement

also read :అభిమానులపై మళ్లీ ఫైర్ అయిన బాలయ్య.. విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్!

గతంలో సంచలనం సృష్టించిన ‘ది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్’ (1999), ‘పారానార్మల్ యాక్టివిటీ’ (2007) వంటి లో-బడ్జెట్ క్లాసిక్ సినిమాల ప్రాఫిట్ మార్జిన్స్‌ను కూడా ఇది అధిగమించి, పెట్టిన పెట్టుబడికి 300 రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది. 2026లో ఇప్పటివరకు విడుదలైన ‘నైట్ స్విమ్’, ‘ఇమాజినరీ’ వంటి హారర్ చిత్రాలన్నింటినీ వెనక్కి నెట్టి ఈ ఏడాది టాప్ పెర్ఫార్మర్‌గా నిలవడం విశేషం.

ఇండియాలో కేవలం 12 రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ 

Advertisement

అలా వెస్ట్రన్ కంట్రీస్ లో సత్తా చాటుతున్న ఈ సినిమా ఇండియాలో విడుదలైన కేవలం 12 రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటి ట్రేడ్ వర్గాలకి పెద్ద షాకే ఇచ్చింది. యూకే, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో సహా దాదాపు 56 అంతర్జాతీయ మార్కెట్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుందంటే సినిమా ఓవరాల్ ఆడియన్స్ ని ఎలా మెస్మరైజ్ చేసిందో అర్థం అవుతుంది .

also read :94 ఏళ్ల ‘భీష్మాచార్యుడు’ సింగీతంపై మెగాస్టార్ చిరంజీవి క్రేజీ పోస్ట్.. నెట్టింట వైరల్!

ఈ స్థాయి సక్సెస్ వెనుక ఉన్న అసలు కారణం సినిమాలోని ఎంగేజింగ్ కాన్సెప్ట్ అనే చెప్పాలి.ఒక సాధారణ క్లర్క్ తాను ప్రాణంగా ఇష్టపడిన అమ్మాయి ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలని ‘వన్ విష్ విల్లో’ అనే ఒక వింత అతీంద్రియ శక్తిని ఆశ్రయిస్తాడు. ఆ కోరిక తీరినట్లే తీరి, ఆ తర్వాత అతని జీవితంలోకి ఎలాంటి ఊహించని భయానక పరిణామాలు వచ్చాయి, ఆ శక్తి అతనిని ఎలా వెంటాడింది అనే పాయింట్‌ను దర్శకుడు కర్రీ బార్కర్ స్క్రీన్ మీద చూపించిన విధానం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి.

బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీ

హారర్, రొమాన్స్, ఎమోషనల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్‌గా మిక్స్ చేయడంతో యువత ఈ చిత్రానికి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. పెద్దగా ప్రమోషన్స్, స్టార్ పవర్ లేకపోయినా కేవలం నెట్టింట్లో వైరల్ అయిన మౌత్ టాక్, వీక్షకుల ఆర్గానిక్ రివ్యూల వల్లే ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని స్ప్రుష్టిస్తుంది. మొత్తానికి తక్కువ బడ్జెట్లో సరైన కంటెంట్ తో సినిమా తీస్తే అది ఏ రేంజ్ లో పేలుతుందో ‘అబ్సెషన్’ (Obsession) మరో సారి ప్రూవ్ చేసిందన్న మాట !

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×