E-Paper
Advertisement

మీనాక్షి సింప్లిసిటీపై డిస్కషన్! అరుదైన నేత‌గా ఆమెను చూస్తున్న జెన్-జీ!

మీనాక్షి సింప్లిసిటీపై డిస్కషన్! అరుదైన నేత‌గా ఆమెను చూస్తున్న జెన్-జీ!
Advertisement

అమాయ‌క‌మైన ముఖ వ‌ర్చ‌స్సు.. ముఖానికి క‌ళ్ల‌ద్దాలు.. ఆ అద్దాల‌లోంచి తీక్ష‌ణంగా చూసే ఆమె క‌ళ్లు.. ! సాదాసీదా దుస్తులు… చంక‌కు ఓ బ్యాగు..అంతే! ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జిగా రావ‌డ‌మే ట్రైన్‌లో వ‌చ్చారు. అప్పుడే అంద‌రి దృష్టి ఆమెపై ప‌డింది… ఆమే మీనాక్షి న‌ట‌రాజ‌న్‌. ఇప్పుడామె దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో త‌న రాజ్య‌స‌భ నామినేష‌న్ ఆర్‌వో తిర‌స్క‌రించిన అంశం.. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇదంతా రాజ‌కీయ క్రీడ‌లో భాగంగా ఆమెను బ‌లిపెట్టే ప‌న్నాగం జ‌రిగింద‌న‌డంలో అనుమానం లేదు.

ఇంటి దొంగ‌లు, బీజేపీతో చేతులు క‌లిపారు. ఆమె పెద్ద‌గా ప‌ట్టించుకోని, త‌న దృష్టిలో లేని ఓ కేసును దాచి ఉంచార‌నే నెపంతో ఆమె నామినేష‌న్‌ను ర‌ద్దు చేశారు. ఏదో సాధించిన‌ట్టుగా ఫీల‌య్యారు అక్క‌డి బీజేపీ నేత‌లు. వాస్త‌వానికి ఇది వారికి చేటు చేయ‌గా… కాంగ్రెస్‌కు క‌లిసి వ‌చ్చింది. ఇదంతా ఓ రాజ‌కీయ క్రీడ‌. ఆ కోణంలోనే చూశారు వాళ్లు. అంతే! కానీ ఇప్పుడు అది ప‌రిధులు దాటిన చ‌ర్చ‌గా మారింది. మీనాక్షి సింప్లిసిటీపైనా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.

Advertisement

ఆస‌క్తిగా ఆమె లైఫ్ స్టైల్ తెలుసుకుంటున్నారంతా. జెన్‌-జీ కీల‌కంగా మారిన త‌రుణంలో … ప్ర‌తీ రాజ‌కీయ అంశాన్ని లోతుగా అధ్య‌య‌నం చేస్తున్న కాక్రోచ్ పార్టీ ఆవిర్భావ నేప‌థ్యంలో.. మీనాక్షికి జరిగిన ఉదంతం అంద‌రిలో ఆమె ప‌ట్ల మ‌రింత విశ్వాసాన్ని, సానుభూతిని ప్రోదీ చేశాయే త‌ప్ప‌.. ఇసుమంత కూడా త‌గ్గించ‌లేదు. ఆమెకు వెల్లువ‌లా మ‌ద్ద‌తు కూడా ల‌భించింది.

త‌న‌కు సంబంధం లేని కేసులో కోర్టు నుంచి నోటీసు అందుకున్న ఉదంతంలో ఆ వివ‌రాలు తెలియ‌ప‌ర్చ‌లేద‌నే అంశం .. నామినేష‌న్ ర‌ద్దుకు కార‌ణ‌మైంది. ఈ ఉదంతం వ‌ల్ల మీనాక్షి లాంటి సాదాసీదా నేత‌లు ఇంకా ఉన్నారా? ఇంత సింపుల్‌గా ఉంటారా? త‌ను న‌మ్ముకున్న సిద్దాంతాల కోసం ఇంత క‌మిట్‌మెంట్ ప‌నిచేసే నేత‌లు.. ఇప్ప‌టి ఈ క‌లుషిత రాజ‌కీయ‌ల్లో ఉండ‌డం అరుదేన‌ని అనుకుంటున్నారు. దీనిపైనే ఇప్పుడు జెన్-జీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే బీజేపీపై భ‌గ్గుమంటున్న కాక్రోచ్ పార్టీ, త‌దిత‌రులు.. మీనాక్షి ఉదంతంతో అది మ‌రింత పెరిగింది.

Advertisement

అదే స‌మ‌యంలో కాంగ్రెస్‌పైనా కొంద‌రికి గురి కుదురుతోంది. మీనాక్షి రాజ‌కీయ జీవితాన్ని కూడా ఇప్ప‌టి త‌రం లోతుగా అధ్య‌య‌నం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఆ పార్టీలో ఆమె చేసిన సేవ‌లు.. నిర్వ‌హించిన ప‌ద‌వులు.. ఆమె ప్ర‌సంగాలు.. అన్నీ అబ్జ‌ర్వ్ చేస్తున్నారు. చాలా అరుదుగా ఉండే కొంత మంది రాజ‌కీయ నేత‌ల‌తో ఆమెను పోల్చుకుంటున్నారు. ఆమెను స్పూర్తిగా తీసుకోవ‌డం ద్వారా విలువైన రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నంగా నిల‌వొచ్చ‌నే భావ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

Related News

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

Big Stories

Advertisement
×