E-Paper
Advertisement

Xiaomi 17T Pro: స్మార్ట్‌ఫోన్ హిస్టరీని తిరగరాయడానికి వస్తున్న ‘మోన్స్టర్’.. 8500mAh బ్యాటరీతో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్!

Xiaomi 17T Pro: స్మార్ట్‌ఫోన్ హిస్టరీని తిరగరాయడానికి వస్తున్న ‘మోన్స్టర్’.. 8500mAh బ్యాటరీతో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్!
Advertisement

Xiaomi 17T Pro :టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే సెన్సేషన్.. అదే Xiaomi 17T Pro  ఎంట్రీ ! స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కాలింగ్, మెసేజింగ్ మాత్రమే కాదు, అది ఒక పవర్ హౌస్ అని నిరూపిస్తూ సాలిడ్  మాన్స్టర్ సిద్దం చేసింది షియోమీ .తాజాగా థాయ్‌లాండ్‌కు చెందిన NBTC సర్టిఫికేషన్ సైట్‌లో మోడల్ నంబర్ 2602EPTC0Gతో ఈ ఫోన్ ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ స్టార్ అయిపొయింది   అసలు ఈ ఫోన్ గురించి వినిపిస్తున్న లీక్స్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే, ఇప్పటివరకు మనం కేవలం 5000mAh బ్యాటరీ ఉంటేనే గొప్ప అనుకున్నాం, కానీ షియోమీ ఏకంగా 8,500mAh భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో సెటప్ చేసేసింది.అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల పాటు ఫోన్ ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదన్న మాట.ఇక  దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయిపోవడం ఇక్కడ మరో విశేషం.

also read:Top 10 Hill stations in India: సమ్మర్‌లో చిల్ అవ్వాలా? 2026లో మీరు మిస్ చేయకూడని 10 క్రేజీ హిల్ స్టేషన్లు ఇవే!

Advertisement

ఇక కేవలం బ్యాటరీ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్ విషయంలోనూ ఇది ఒక రాకెట్ లాంటిడే . ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 3nm MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్, గేమింగ్ ప్రియులకు ఒక కలల డివైజ్ అని చెప్పకతప్పదు. భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడినా, వందల యాప్స్ ఒకేసారి వాడినా ఈ ఫోన్ ఎక్కడా హ్యాంగ్ కాదని సమాచారం

ఇక భద్రత విషయానికి వస్తే, పాతకాలపు సెన్సార్లకు గుడ్ బై చెబుతూ అత్యంత వేగవంతమైన 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో వాడుతున్నారట . మీ వేలు తడిగా ఉన్నా, దుమ్మున్నా సరే సెకనులో వందవ వంతు కాలంలో ఫోన్ అన్‌లాక్ అయిపోతుందట . దీనికి తోడు IP68 మరియు IP69 రేటింగ్స్‌తో వస్తున్న ఈ ఫోన్, నీటిలో పడినా లేదా హై-ప్రెజర్ వాటర్ జెట్స్ తగిలినా చెక్కుచెదరదు.

Advertisement

గతేడాది వచ్చిన 15T Proకి ఇది వారసుడిగా రాబోతోందని తెలుస్తుంది, కానీ ఫీచర్ల పరంగా చూస్తే ఇది కొన్ని రెట్లు ముందంజలో ఉంది. ఇప్పటికే సింగపూర్ IMDA మరియు థాయ్‌లాండ్ NBTC సర్టిఫికేషన్స్ పూర్తి కావడంతో, రాబోయే కొన్ని వారాల్లోనే గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ ప్రకంపనలు సృష్టించడం ఖాయం. ఒక పక్క భారీ బ్యాటరీ, మరోపక్క అల్టిమేట్ ప్రాసెసర్, ఇంకోవైపు మొండి పట్టుదల గల బాడీ.. మొత్తానికి  Xiaomi 17T Pro ఇప్పుడు గ్లోబల్ టెక్ మార్కెట్లో మోస్ట్ అవైటెడ్ స్మార్ట్‌ఫోన్‌గా మారిపోయిందనే చెప్పాలి . మరి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకముందే  ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన ఈ ఫోన్, మార్కెట్లోకి వస్తే రికార్డులన్నీ తిరగరాయడం ఖాయమని  అంచనా వేస్తున్నారు టెక్ పండిట్స్ .చూడాలి మరి అంచనాలు పెంచేస్తున్న ఈ Xiaomi 17T Pro ఏమాత్రం ఆకట్టుకుంటుందో !

also read:IPL Records: ఐపీఎల్ హిస్టరీని షేక్ చేసిన రికార్డులు.. ఇవి బ్రేక్ అవుతాయా?

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×