E-Paper
Advertisement

Self Employment Scheme: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!

Self Employment Scheme: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!
Advertisement

Self Employment Scheme: స్వేచ్ఛ బ్యూరో: స్వయం ఉపాధి పథకం దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ మాట్లాడుతూ.. జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లి.. మెదక్ జిల్లాలో 2025-26 వార్షిక ప్రణాళిక అమలు చేయుటకు 236.60 లక్షలలో రూపాయలతో 249 మంది లబ్దిదారులకు ఆర్థిక సహాయము చేయుటకొరకు లక్ష్యముగా నిర్ణయించడం జరిగినదని, అన్నారు.

రవాణా రంగం

Advertisement

E.V. ద్విచక్రవాహనములు యూనిట్ విలువ 1.00 లక్ష రూపాయలకు గాను (119),యూనిట్లు, E.V. ఆటో రిక్షాలు (ఎలక్ట్రిక్) వాహనములు యూనిట్ విలువ 3.00 లక్షల రూపాయలకు గాను (59) యూనిట్లు మెదక్ జిల్లాకు లక్ష్యముగా నిర్ణయించడం జరిగినదన్నారు. వ్యవసాయ రంగము పధకము క్రింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్ విలువ 3.00 లక్షల రూపాయలు నుండి 7.00 లక్షల రూపాయలు (12) యూనిట్లు లక్ష్యముగా నిర్ణయించడం జరిగినదనీ తెలిపారు.

ట్రైనింగ్ ప్రోగ్రామ్

Advertisement

స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్రింద (59) యూనిట్లు లక్ష్యముగా నిర్ణయించడం జరిగినది. పైన పేర్కొన్న అన్ని పథకాలకు రూ.1.00 లక్షలోపు యూనిట్ విలువ వాటికీ 90% సబ్సిడి, రూ.1.00 నుండి 2.00 లక్షల లోపు యూనిట్ విలువ వాటికీ 80% సబ్సిడి.. రూ.2.00 లక్షల నుండి 4.00 లక్షల వరకు యూనిట్ విలువ వాటికీ 70% సబ్సిడీ, రూ.4.00 లక్షల పైన ఉన్న యూనిట్ విలువనకు 60% సబ్సిడీ మించకుండా అందజేయబడును.

నిరుద్యోగులకు ప్రభుత్వ సహాయం

చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులు షెడ్యూల్డు కులాల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఆర్థిక సహాయము పొందుటకు www.tgobmms.cgg.gov.in వెబ్ సైట్ లో లబ్దిదారులు తమ వివరాలు (ఆధార కార్డు, ఆదాయం, రేషన్ కార్డ్, కులదృవీకరణ పత్రము, ఫోటో, సదరము సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ బుక్) నమోదు చేసుకోవాలనీ, వయస్సు జూలై 1 నాటికి 21 నుండి 50 సంవత్సరాల వరకు ఉండాలి. వ్యవసాయ పథకాలకు జూలై 1 నాటికి 21-60 సంవత్సరాలు స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమానికి 18 నుండి 45 సంవత్సరాలు , వేతన ఉపాధి కార్యక్రమాలకు 18 నుండి 35 సంవత్సరాలు. గత 5 సంవత్సరములలో ఎస్సీ కార్పొరేషన్ నుండి లబ్ది పొందిన కుటుంబాల వారు అనర్హులు. స్వయం ఉపాది పధకాలకు గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2.00 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు అర్హులు అన్నారు.

దరఖాస్తులు తేది

24.03.2026 లోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసే, హార్డ్ కాపీలను పూర్తి చేసి సంబంధిత మండల పరిషత్తు అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమీషనర్ కార్యాలయాల్లో సమర్పించాలి. జిల్లా స్థాయి కమిటీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయడం జరగుతుందనీ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు.

Also Read:హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఏసీ బస్సు టికెట్లలో భారీ డిస్కౌంట్!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×