E-Paper
Advertisement

మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్.. HD+ స్క్రీన్, 6,000mAh బ్యాటరీ.. తక్కువ ధరలో ఇన్ని అద్భుత ఫీచర్లా!

మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్.. HD+ స్క్రీన్, 6,000mAh బ్యాటరీ.. తక్కువ ధరలో ఇన్ని అద్భుత ఫీచర్లా!
Advertisement

Poco C81 Pro: షావోమీ సబ్ బ్రాండ్ పోకో (POCO) బడ్జెట్ స్మార్ ఫోన్ ప్రియుల కోసం సరికొత్త మెుబైల్ ను లాంచ్ చేసింది. ఎలాంటి ఆర్బాటం లేకుండా పోకో సీ81 ప్రో (Poco C81 Pro) మెుబైల్ ను సెలైంట్ గా ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. బడ్జెట్ లో అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఫోన్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందని పోకో వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోకో సీ81 ప్రో ఫోన్ ప్రధాన ఫీచర్లు, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

డిస్ ప్లే, రిఫ్రెష్ రేట్

పోకో సీ81 ప్రో మెుబైల్.. 6.9 అంగుళాల HD+ LCD స్క్రీన్ తో వచ్చింది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్‌ ను అందించారు. ఫలితంగా సాధారణ వినియోగంతో పాటు గేమ్స్ ఆడేవారికి సైతం ఇది చాలా స్మూత్ పర్ ఫార్మెన్స్ ను అందిస్తుంది.

బిగ్ బ్యాటరీ..

Advertisement

ఈ ఫోన్ లో 6,000mAh భారీ బ్యాటరీని ఫిక్స్ చేశారు. దీనికి 15W ఛార్జింగ్‌ సపోర్ట్ అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని పోకో వర్గాలు పేర్కొంటున్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్

పోకో తీసుకొచ్చిన నయా బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ 3 (Xiaomi HyperOS 3)పై పనిచేస్తుంది. దీనికి యూనిసొక్ టీ7250 (Unisoc T7250) చిప్‌సెట్‌ ను అందించారు. ఇది రోజువారీ పనులకు, సాధారణ గేమింగ్‌కు సరిపోతుంది.

కెమెరా సెటప్

Advertisement

ఈ బడ్జెట్ ఫోన్ కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 13MP ప్రైమరీ కెమెరా (AI సపోర్ట్‌తో), ముందు వైపు సెల్ఫీల కోసం 8MP కెమెరా అమర్చారు. అలాగే 4GB RAMతో పాటు 64GB, 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో పోకో ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వర్చువల్ ఫీచర్ ద్వారా ర్యామ్ ని 8జీబీ వరకు పెంచుకోవచ్చని పోకో వర్గాలు తెలిపాయి.

మరికొన్ని ప్రత్యేకతలు

ఈ ఫోన్ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ను అందించారు. అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ను సైతం ఇది కలిగి ఉంది. అంతేకుండా మూడు కలర్ ఆప్షన్స్ లో పోకో సి81 ప్రో మెుబైల్ ను పొందొచ్చు. నలుపు, బంగారం, ఆకుపచ్చ రంగుల్లో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు.

Also Read: ఏసీ గ్యాస్ లీక్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. నెక్ట్స్ టార్గెట్ మీరే కావొచ్చు!

ఇంతకి ధర ఎంతంటే?

పోకో తన నయా బడ్జెట్ ఫోన్ ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. దాని ధరలను సైతం స్టోరేజ్ ఆధారంగా నిర్ణయించింది. 64GB స్టోరేజ్ కలిగిన బేసిక్ వేరియంట్ ధరను 99 డాలర్లుగా ఫిక్స్ చేసింది. అంటే ఇది భారత కరెన్సీ ప్రకారం రూ.9,300కు ఈ ఫోన్ లభించనుంది. అలాగే 128GB వేరియంట్ 109 డాలర్లు (సుమారు రూ. 10,000), 256GB మోడల్ ధరను 129 డాలర్లుగా (దాదాపు రూ. 12,000) పేర్కొంది.

Also Read: రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×