E-Paper
Advertisement

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!
Advertisement

Infinix HOT 70 Pro: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫినిక్స్.. మిడ్‌రేంజ్ కేటగిరీలో మరో అదిరిపోయే ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. అదే ‘ఇన్ఫినిక్స్ HOT 70 Pro’. నేటి యువతను, ముఖ్యంగా బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ డివైజ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో వచ్చిన ఈ ఫోన్ విశేషాలేంటో ఓసారి చూసేద్దాం రండి..

రంగులు మారే మ్యాజిక్ డిజైన్:

Infinix HOT 70 Pro ప్రధాన ఆకర్షణ దీని డిజైన్. వెనుక వైపు లైటింగ్, ఉష్ణోగ్రతను బట్టి లుక్ మారేలా ‘డైనమిక్ షైన్’ కాన్సెప్ట్‌తో దీనిని తీర్చిదిద్దారు. ధర్మో ఆరెంజ్, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్, డైవ్ బ్లూ అనే నాలుగు కలర్స్‌లో ఇది లభిస్తుంది. ఇందులో ఆరెంజ్ వేరియంట్ టెంపరేచర్ మారినప్పుడు రంగు మారుతుంది. గ్రీన్ వేరియంట్ చీకటిలో మెరుస్తుంది. సన్నని బాడీ, మంచి గ్రిప్‌తో చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Also Read: గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

స్మూత్ డిస్‌ప్లే, అదిరిపోయే కెమెరా:

ఈ Infinix HOT 70 Pro ఫోన్ ముందు భాగంలో 144Hz రీఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. దీంతో సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్, వీడియోలు చూడటం చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ లవర్స్ కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాను అమర్చారు. రోజూ ఫొటోలు తీసుకోవడానికి, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఈ కెమెరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఫోన్ మెనూలో యాక్టివ్ మేట్రిక్స్ క్యూబ్ అనే కొత్త ఇంటరాక్టివ్ ఫీచర్ కూడా ఉంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ:

Advertisement

Infinix HOT 70 Proలో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 5G ప్రాసెసర్‌ను వాడారు. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. వేగవంతమైన 5G ఇంటర్నెట్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 6000mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఫోన్ ఎక్కువ సమయం వాడే వారికి ఈ బ్యాటరీ బ్యాకప్ బాగా ఉపయోగపడుతుంది. నీళ్లు, ధూళి నుండి రక్షణగా IP68 రేటింగ్ కూడా ఇచ్చారు.

ధర, లభ్యత వివరాలు:

ఇది 6GB+128GB, 8GB+128GB అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.22,999గా నిర్ణయించారు. ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో Infinix HOT 70 Pro అందుబాటులో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు, మంచి డిజైన్ కావాలనుకునే వారికి ఈ హ్యాండ్‌సెట్ బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: 4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

Tags

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×