E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!
Advertisement

Motorola Edge 70 Plus: స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కాల్స్, సోషల్ మీడియా కోసం మాత్రమే కాదు.. ఇప్పుడు అది మన లైఫ్‌స్టైల్‌లో ఒక భాగం. అందుకే కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారీ.. లుక్స్‌తో పాటు పనితీరులోనూ ఏమేమి కొత్తగా ఇచ్చారన్నదే అందరి ఆసక్తి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే మోటరోలా మరో కొత్త ఫోన్‌తో మార్కెట్లో సందడి చేస్తోంది. అదే Motorola Edge 70 Plus.

ప్రీమియం లుక్, భారీ బ్యాటరీ, ఆకట్టుకునే కెమెరా, స్మూత్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్.. చేతిలో పట్టుకోగానే ఫ్లాగ్‌షిప్ ఫీల్ ఇచ్చేలా కనిపిస్తోంది. ధర కూడా ప్రీమియం సెగ్మెంట్‌కు చేరువలోనే ఉండటంతో.. అసలు ఈ ఫోన్‌లో అంత స్పెషల్ ఏముంది? అనేది ఇప్పుడు చూద్దాం.

కళ్లుచెదిరే డిస్‌ప్లే..

Advertisement

ఈ Motorola Edge 70 Plus ప్రధాన ఆకర్షణ స్క్రీన్ అని చెప్పుకోవాలి. 6.78 అంగుళాల ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది. 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడేటప్పుడు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే అత్యధికంగా 5200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుండటంతో, మండుటెండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గోరిల్లా గ్లాస్ సెక్యూరిటీ, మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ వల్ల ఫోన్ కిందపడినా త్వరగా పాడయ్యే ప్రమాదం ఉండదు.

Also Read: 6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

200 మెగాపిక్సెల్ పవర్..

Advertisement

ఫొటోగ్రఫీ ప్రేమికులకు Motorola Edge 70 Plus ఒక మంచి గిఫ్ట్ అని చెప్పవచ్చు. వెనుక వైపు ఏకంగా 200MP ప్రైమరీ కెమెరాను అందించారు. దీనివల్ల ఫొటోలు అత్యంత డిటైలింగ్‌తో, క్వాలిటీగా వస్తాయి. 10x జూమ్, 4K వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. AI టెక్నాలజీ వల్ల ముఖం రంగు, ఎక్స్‌ప్రెషన్లు మరింత సహజంగా డిస్‌ప్లే అవుతాయి.

పవర్‌ఫుల్ బ్యాటరీ..

ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే బాధ ఈ ఫోన్‌తో ఉండదు. దీనిలో 6500mAh బ్యాటరీని అమర్చారు. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే రోజున్నర పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. దీనికి తోడు 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ Motorola Edge 70 Plus.. గేమింగ్‌కు, మల్టీ టాస్కింగ్‌కు చాలా బాగుంటుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఇది అందుబాటులో ఉంది.

ఐదేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్:

ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి కొత్త ఏఐ ఫీచర్లు దీనిలో ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. మోటరోలా ఈ ఫోన్‌కు 2031 సెప్టెంబర్ వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే ఒక్కసారి కొంటే ఐదేళ్లకు పైగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ ఫోన్‌ను వాడుకోవచ్చు. ప్రీ-ఆర్డర్ చేసుకునే వారికి వాచ్, ట్యాగ్ కాంబో ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: 10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

Tags

Related News

డార్క్ వెబ్‌లో SBI కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్.. అకౌంట్లు సురక్షితమేనా?

బడ్జెట్ ధరకు అద్భుతమైన ఫీచర్లు..రూ.7,590కే బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్!

రూ.13,699కే ఫుల్ హెచ్‌డీ టీవీ!మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్

బడ్జెట్ గేమింగ్ హెడ్‌ఫోన్..మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో లాంచ్

రూ. 35,990కే నెక్స్ట్ లెవెల్ స్మార్ట్ టీవీ..ఫుల్ స్పెసిఫికేషన్లు ఇవిగో

రూ. 9,990కే బడ్జెట్ ల్యాప్‌టాప్..స్టూడెంట్స్‌కి పర్ఫెక్ట్!

ఏకంగా 44% డిస్కౌంట్‌తో బెస్ట్ వాషింగ్ మెషీన్!డోంట్ మిస్

రూ.2,099కే ల్యాప్‌టాప్ ఛార్జ్ చేసే..పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్!

Big Stories

Advertisement
×