E-Paper
Advertisement

Xiaomi AC: హై క్లాస్ ఏఐ ఫీచర్లతో.. షావోమీ సరికొత్త ఏసీ.. మధ్యతరగతికి బెస్ట్ ఆప్షన్!

Xiaomi AC: హై క్లాస్ ఏఐ ఫీచర్లతో.. షావోమీ సరికొత్త ఏసీ.. మధ్యతరగతికి బెస్ట్ ఆప్షన్!
Advertisement

Xiaomi AC: ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ (Xiaomi) సరికొత్త ఏసీని లాంచ్ చేసింది. సరికొత్త ఎనర్జీ-ఎఫిషియంట్ స్మార్ట్ ఎయిర్ కండిషనర్లను చైనాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఏసీల ప్రీ-ఆర్డర్లు జోరుగా జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులోని ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నాయి. 2026 వేసవిని దృష్టిలో ఉంచుకొని త్వరలోనే భారత మార్కెట్ లోకి ఈ సరికొత్త ఏసీని లాంచ్ చేయనున్నట్లు షావోమీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ ఏసీలోని ప్రధాన ఫీచర్లు ఏంటీ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు? ధర ఎంత ఉండొచ్చు? వంటి అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

హ్యూమన్ సెన్సింగ్ టెక్నాలజీ

ఇందులో ఏఐ ఆధారిత హ్యుమన్ సెన్సింగ్ టెక్నాలజీని అమర్చారు. దీనిలోని ప్రత్యేక రాడార్ సెన్సార్లు గదిలో ఉన్న వ్యక్తులను గుర్తిస్తాయి. వాటికి అనుగుణంగా ఏసీ చల్లదనాన్ని వాటంతట అవే అడ్జస్ట్ చేసుకుంటాయి. అలాగే వ్యక్తులు ఎక్కడ ఉన్నారో గమనించి నేరుగా వారికి చల్లదనం తగిలేలా చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్ సేవింగ్ ఫీచర్.. గదిలో ఎవరూ లేనప్పుడు ఎనర్జీ సేవింగ్ మోడ్ లోకి మారిపోతుంది.

తక్కువ పవర్ బిల్లు..

Advertisement

ఈ సరికొత్త ఏసీ యాన్యువల్ పెర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్ (APF) 6.30 వరకు ఉంది. ఇది చైనాలోని లెవల్-1 ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందింది. సాధారణ ఏసీలతో పోలిస్తే ఇది ఏడాదికి సుమారు 207 యూనిట్ల నుండి 500 యూనిట్ల వరకు విద్యుత్తును ఆదా చేయగలదని కంపెనీ పేర్కొంది.

స్మార్ట్ కనెక్టివిటీ

షావోమి లేటెస్ట్ టెక్నాలజీ HyperOSపై ఇది పనిచేస్తుంది. Mi Home యాప్‌తో దీనిని కంట్రోల్ చేయవచ్చు. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఏసీని నియంత్రించవచ్చు. వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా ఈ ఏసీ పనిచేస్తుంది.

ఇతర ముఖ్య ఫీచర్లు

Advertisement

ఇది కేవలం 16 డెసిబుల్స్ (16 dB) శబ్దంతో మాత్రమే పనిచేస్తుంది. ఫలితంగా రాత్రిళ్లు చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కేవలం 30 సెకన్లలో ఫాస్ట్ కూలింగ్, 60 సెకన్లలో హీటింగ్ చేయగల సామర్థ్యం దీనికి అందించారు. ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లు రెండూ వాటంతట అవే శుభ్రం చేసుకునే (Self-cleaning) ఫీచర్‌ను కలిగి ఉన్నాయి.

Also Read: LPG Alternatives: గ్యాస్ సమస్య వేధిస్తుందా? ఈ స్మార్ట్ పరికరాలతో.. నచ్చింది తినేయచ్చు!

ధర ఎంతంటే?

ప్రస్తుతానికి ఈ అధునాతన ఏసీ చైనాలో మాత్రమే విడుదలైంది. దీని ప్రారంభ ధరను 2,399 యువాన్లుగా నిర్ణయించారు. భారత కెరన్సీలో దీని ధర సుమారు రూ.32,288. త్వరలో భారత్ లోనూ అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఇక్కడి మధ్యతరగతి ప్రజలకు.. ఈ ఏసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Gas Alternatives: దేశంలో గ్యాస్ కొరత.. ఎయిర్ ఫ్రైయర్, మైక్రోవేవ్, ఇండక్షన్ స్టవ్.. వంటకు ఏది బెస్ట్?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×