Podarillu Today Episode October 16th : బంగారు గాజులు వచ్చినట్టే వచ్చి చేతులు జారిపోయాయి. నారాయణ ఇంక రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చి తింటే ఆ గాజులు నా సొంతమయ్యేవి. ఎటు లేదన్న కూడా అవి రెండు లక్షలకు పైగానే ఉండేవి అని జమున తనలో తాను మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కన్నా లోపలికి వస్తాడు. కన్నా మాటలతో జమున విదేశాడా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది. కానీ కన్నా మాత్రం మా నాన్న అన్నదానికి నువ్వేమీ బాధపడకు అమ్మ అంటూ అనడంతో వీడేమీ వినలేదు. వీడిని అడ్డుపెట్టుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. ఇక జమున తన భర్త ఫోన్ చేయడంతో మాట్లాడుతూ ఉంటుంది. డబ్బులు దొరకగానే ఫోన్ చేస్తాను అని చెప్పడంతో మహాలక్ష్మి ఆ మాట వింటుంది ఎవరితో మాట్లాడుతున్నారు డబ్బులు దొరికిన తర్వాత ఫోన్ చేస్తాను అని అన్నారు కదా ఎవరికీ అని అడుగుతుంది అయితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది..
చక్రి సిగ్గు పడిపోతూ ఉంటాడు. ఏమైంది ఎందుకు సిగ్గుపడుతున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది మీరు కన్నా వాళ్ళ అమ్మతో ఏం చెప్పారు అందుకే నాకు సిగ్గేస్తుంది అని చక్రి మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. అయితే నేను పెళ్లి గురించి మాట్లాడాను అంతే కదా అని మహాలక్ష్మి చెప్పగానే అదే అందుకే నాకు సిగ్గేస్తుంది అని అంటాడు.. మహాలక్ష్మి అనవసరంగా చక్రి దగ్గర బుక్కయ్య అనే ఆలోచిస్తూ ఉంటుంది.. మీరు కన్నా వాళ్ళ అమ్మకి ఏం చెప్పారు అని చక్రి అడుగుతాడు. నేనేం చెప్పాను ఏం చెప్పలేదు కదా అని మహాలక్ష్మి ఎంతగా దాచాలని ప్రయత్నించినా కూడా చక్రి మాత్రం మీరు ఏదో దాస్తున్నారు అని అంటుంది. అయితే మహాలక్ష్మి నేను ఆవిడకి అనుమానం రాకుండా ఉండడానికి ఇలా చేశాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు నేనెవరో మీరెవరు అని అంటుంది. మొత్తానికి మహాలక్ష్మి లోపలికి వెళ్లి ఎందుకు నేను చక్రి గురించి ఇలా చెప్పాను అని ఆలోచిస్తూ ఉంటుంది.
మహాలక్ష్మి స్నానం చేసి బయటికి రాగానే జమున తన భర్తకి ఫోన్ చేసి మాట్లాడాలి. ఈ సచ్చినోడు ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే జమున తన భర్తకి ఫోన్ చేయాలి అనే అనుకునే లోపల మహాలక్ష్మి హాయ్ అండి అని వస్తుంది ఎవరితోనో టెన్షన్ పడుతూ ఫోన్ చేయడానికి చూస్తున్నారు కదా.. అయితే ఎవరు లేరు అమ్మ నాకు ఎవరు ఉన్నారని నేను ఒక అనాధని అని అంటుంది.. అయితే మహాలక్ష్మికి నేను ఒక అనాధని అంటూ ఒక కట్టు కథ చెప్పడంతో మహాలక్ష్మి నిజమే అని నమ్ముతుంది కానీ జమున మాత్రం మహాలక్ష్మిని నమ్మించాను అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే మహాలక్ష్మికి మాత్రం ఎక్కడో అనుమానం అయితే ఉంటుంది. ఆమె నేను వంట చేసుకోవాలి అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది..
కేశవ ఆ స్థలం మీద ఆశలు వదులుకున్నాను అన్నయ్య అంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు దానికి నువ్వు ఎందుకురా బాధ పడిపోతున్నావు అని అందరూ కూడా తమ దగ్గర ఉన్న డబ్బులు అని తీసి పక్కన పెడతారు. ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మొత్తం మహాలక్ష్మి నారాయణతో కలిపి కేశవ కి కావలసిన డబ్బుల్ని అరేంజ్ చేసి ఇస్తారు. మొత్తం అందరూ కలిసి కేశవ కి సాయం చేస్తారు అయితే ఏం మహాలక్ష్మి కూడా సాయం చేయడంతో కేశవ ఎమోషనల్ అయిపోతాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎమోషనల్ సెంటిమెంట్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అందరూ డబ్బులు ఇవ్వడం చూసినా జమున నేను కరెక్ట్ టయానికి ఇంట్లోకి వచ్చాను. ఈ ఇంట్లో ఇంత డబ్బులు ఉంటాయని నేను అస్సలు ఊహించలేదు ఎలాగైనా సరే వీటిని కొట్టేస్తే నా పని సులువు అవుతుంది నా మొగుడు చేసిన అప్పులన్నీ తీరతాయి అని సంతోషంగా ఉంటుంది.. అయితే మహాలక్ష్మి జమున చూపులను చూసి అనుమానంగా ఉంటుంది. జమున అసలు స్వరూపం బయట పడుతుందా లేదా అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :Intinti Ramayanam Today Episode: వదిన కోసం కమల్ కన్నీళ్లు.. భానుమతికి వార్నింగ్.. అవనికి షాక్..