E-Paper
Advertisement

Xiaomi Study Lamp 2: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17 ఏళ్లు రన్ అయ్యే స్టడి ల్యాంప్.. 12700 ల్యూమెన్ లైటింగ్, ఏఐ ఫీచర్స్, ధర?

Xiaomi Study Lamp 2: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17 ఏళ్లు రన్ అయ్యే స్టడి ల్యాంప్.. 12700 ల్యూమెన్ లైటింగ్, ఏఐ ఫీచర్స్, ధర?
Advertisement

Xiaomi Mijia Vertical Study Lamp 2| చైనా టెక్ కంపెనీ షావోమీ ఇటీవల కొత్త కొత్త స్మార్ట్ డివైజ్లతో ప్రపంచాన్ని షాక్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా కొత్త స్మార్ట్ డెస్క్ ల్యాంప్ లాంచ్ చేసింది. దీని పేరు మీజియా వర్టికల్ స్టడీ ల్యాంప్ 2. ఇది సాధారణ లైట్ కాదు, ఇందులో చాలా స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. షావోమీ దీన్ని స్టడీ, వర్క్ స్పేస్‌ కోసమే ప్రత్యేకంగా రూపొందించింది.

ధర, లభ్యత

ఈ ల్యాంప్ ధర 2,499 యువాన్ (భారత కరెన్సీలో సుమారు రూ. 34,000). ప్రస్తుతం డిస్కౌంట్‌తో 1,996 యువాన్ (దాదాపు రూ. 26,500)కి లభిస్తోంది. చైనాలో ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇతర దేశాల్లో ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు.

చిన్న గదులకు బెస్ట్

Advertisement

ఈ ల్యాంప్ 15 చదరపు మీటర్ల గదులకు సరిపోతుంది. బెడ్‌రూమ్‌లు లేదా చిన్న హోమ్ ఆఫీస్‌లలో బాగా పనిచేస్తుంది. వర్టికల్ డిజైన్ వల్ల గది అంతా సమానంగా లైటింగ్ వ్యాప్తి చేస్తుంది. ఒక చోట మాత్రమే ఎక్కువ లైటింగ్ రాకుండా చూస్తుంది.

బలమైన లైటింగ్ పవర్

ఈ ల్యాంప్ 12,700 ల్యూమెన్స్ లైటింగ్ ఇస్తుంది. పైగా ల్యాంప్ మధ్య భాగంలో 1,800 లక్స్ ఇల్యూమినేషన్ ఉంటుంది. ఇంతకుముందు షావోమీ మీజియా వర్టికల్ స్టడీ ల్యాంప్ తీసుకొచ్చింది. ఆ మునుపటి మోడల్ కంటే ఈ కొత్త మోడల్ 17 శాతం (లేదా కొన్ని సోర్సెస్‌లో 27 శాతం) ఎక్కువ బ్రైట్‌నెస్ ఉంది. ఎక్కువ సేపు చదవడానికి లేదా పని చేయడానికి బాగుంటుంది.

ఏళ్ల తరబడి మన్నిక

Advertisement

LED లైట్లు ఎక్కువ పవర్ లైటింగ్ ఇస్తాయి. Xiaomi తెలిపిన వివరాల ప్రకారం రోజూ సాధారణ ఉపయోగంతో ఈ ల్యాంప్ లోని లైట్లు 17 సంవత్సరాలు పనిచేస్తాయి. ఇది రీప్లేస్‌మెంట్ ఖర్చులు తగ్గిస్తుంది. ఎనర్జీ సేవింగ్ కూడా ఎక్కువ.

కళ్లకు హాని లేని లైటింగ్

చేతి నీడలు రాకుండా చేస్తుంది. రాయడం లేదా డ్రాయింగ్ చేసేటప్పుడు సౌకర్యంగా ఉంటుంది. యూనిఫైడ్ గ్లేర్ రేటింగ్ (UGR) 13 కంటే తక్కువ ఉంది. దీంతో కళ్లు త్వరగా అలసిపోవు. ఎక్కువ సేపు ఉపయోగించవచ్చు.

AI స్మార్ట్ డిమ్మింగ్

AI ఆటోమాటిక్‌గా బ్రైట్‌నెస్ సర్దుబాటు చేస్తుంది. చుట్టూ పరిసరాల్లో ఉన్న లైటింగ్‌కు అనుగుణంగా మారుస్తుంది. ఎవరైనా కూర్చుంటే గుర్తించి లైట్ మారుస్తుంది. దీంతో ఈ ల్యాంప్ సౌకర్యవంతంగా ఉండడంతో పాటు విద్యుత్ కూడా ఆదా చేస్తుంది.

స్మార్ట్ కంట్రోల్స్

Mi Home యాప్‌తో కనెక్ట్ అవుతుంది. ఫోన్‌తో బ్రైట్‌నెస్, ఇతర సెట్టింగ్స్ మార్చవచ్చు. టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. త్వరగా మార్పులు చేయవచ్చు.

ఉపయోగకరమైన ఫీచర్లు

వర్టికల్ డిజైన్ వల్ల గది అంతా లైటింగ్ వస్తుంది. గ్లేర్ తక్కువ. స్టూడెంట్స్ చదవడానికి, రాయడానికి బాగుంటుంది. ఆఫీస్ వర్క్ కోసం కూడా ఉపయోగకరం. బ్రైట్‌నెస్, దీర్ఘకాలం, స్మార్ట్ ఫీచర్లు దీన్ని ప్రత్యేకం చేస్తాయి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×