E-Paper
Advertisement

Used Electric Scooters: సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం సేఫేనా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి!

Used Electric Scooters: సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం సేఫేనా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి!
Advertisement

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. టాప్ బ్రాండ్ల నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు  మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇస్తున్నాయి. అయితే, ఇప్పుడు మార్కెట్ లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. చాలా మంది సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోళ్లు పెరిగాయి. అయితే, సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయడం మంచిదేనా? ఒకవేళ కొంటే ఎలాంటి స్కూటర్ తీసుకోవాలి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనేటప్పుడు జాగ్రత్త!

సెకెండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి కీలకమైన  భాగాలు, ఫీచర్లను జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా బ్యాటరీ, ఛార్జింగ్, ఎలక్ట్రిక్ మోటారు లాంటి కీలకమైన బాగాలను క్షుణ్ణంగా చూడాలి. బ్యాటరీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ కు గుండె లాంటిది. అందుకే, బ్యాటరీ పని తీరు ఎలా ఉందో చెక్ చేయాలి.  బ్యాటీర ఎంత బాగుంటే స్కూటర్ లైఫ్ అంత ఎక్కువగా ఉంటుంది. కొనుగోలుదారులు ఛార్జింగ్ పోర్ట్, ఛార్జింగ్ కేబుల్ ను కూడా జాగ్రత్తగా చూడాలి. మోటారు ను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. స్కూటర్‌ను పరీక్షించేటప్పుడు ఏవైనా వింత సౌండ్స్, పని చేయని భాగాలు ఏవైనా ఉన్నాయేమో చూడాలి. విద్యుత్ వ్యవస్థలను పూర్తిగా పరిశీలించడం వల్ల  భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

సర్వీస్ రికార్డును పూర్తిగా పరిశీలించండి!

Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేసే సమయంలో పూర్తి సర్వీస్ రికార్డును పరిశీలించాలి. ఇందుకోసం సర్వీస్ సెంటర్‌ నుంచి డేటాను తీసుకోవడం మంచిది. ఫ్లోర్ బోర్డ్ కింద, మోటారు హౌసింగ్ పైన ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకోవాలి. ఏవైనా అబ్ నార్మల్ రిపేర్లు ఉన్నాయేమో చెక్ చేయాలి.

ఇక కొనుగోలుదారులు స్మార్ట్ డిస్‌ ప్లేలతో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఫాల్ట్ హిస్టరీ, పెండింగ్ సర్వీస్ నోటిఫికేషన్లను కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కనెక్ట్ చేయబడిన ఫీచర్లను కలిగి ఉన్న స్కూటర్ల మొబైల్ యాప్‌ లో అందుబాటులో ఉండే స్కూటర్ హెల్త్ అలర్ట్స్ రికార్డులను దాని యజమానిని అడిగి తెలుసుకోవాలి.

Advertisement

ఇక ముఖ్యమైన ఎలక్ట్రికల్ భాగాలతో పాటు, సెకెండ్ హ్యాండ్ పెట్రోల్ స్కూటర్‌ తో సమానమైన స్థితిలో ఉండాలని భావించాలి.  టైర్ థ్రెడ్, బ్రేక్ ప్యాడ్ మందం, బల్బులు సహా ఇతర భాగాలను కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. ఎలక్ట్రిక్ స్కూటర్ రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. కొనుగోలుదారు సంతృప్తి చెందిన తర్వాత, వెహికిల్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లాంటి వివరాలను తెలుసుకోవాలి. వీటిని చెక్ చేసిన తర్వాత, ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అసలు యజమాని నుండి కొనుగోలు చేస్తున్నారని నిర్ధారించుకోవచ్చు. మొత్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసపోయే అవకాశం ఉంటుంది.

Read Also: చేతులు కలిపిన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా, రాయల్ బ్రదర్స్‌.. ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×