E-Paper
Advertisement

Laptop Power Bank: ల్యాప్‌టాప్ ఛార్జ్ చేసే పవర్ బ్యాంక్ లాంచ్ చేసిన షావోమీ.. 10000mah బ్యాటరీతో 67W ఛార్జింగ్

Laptop Power Bank: ల్యాప్‌టాప్ ఛార్జ్ చేసే పవర్ బ్యాంక్ లాంచ్ చేసిన షావోమీ.. 10000mah బ్యాటరీతో 67W ఛార్జింగ్
Advertisement

Xiaomi Laptop Power Bank| చైనా ఎలెక్ట్రానిక్స్ కంపెనీ షావోమీ.. తన పవర్ యాక్సెసరీలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా యూనైటెడ్ కింగ్‌డమ్‌లో కొత్త షావోమీ 67W పవర్ బ్యాంక్ 10000ను (Xiaomi Power Bank 10000 67W) లాంచ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ ఇంతకుముందు చైనాలో విడుదల అయింది. ఇప్పుడు యూరప్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది.

ప్రయాణాలు చేసే వారి కోసం స్పెషల్

షావోమీ ఈ పవర్ బ్యాంక్‌ను తరచూ ప్రయాణం చేసే వాళ్ల కోసం తయారు చేసింది. ఇది చిన్న సైజులో బలమైన చార్జింగ్ ఇస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లను చార్జ్ చేయగలదు. తక్కువ ధరలో పవర్ ఇచ్చే ఇలాంటి పవర్ బ్యాంక్‌లు చాలా తక్కువ.

చిన్న బాడీలో పెద్ద 10,000 mah బ్యాటరీ

Advertisement

ఇందులో 10,000 mah బ్యాటరీ కెపాసిటీ ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లెట్‌లు, లైట్ ల్యాప్‌టాప్‌లకు సరిపోయే ఛార్జింగ్ ఇస్తుంది. సైడ్‌లో డిజిటల్ డిస్‌ప్లే ఉంది. ఇది బ్యాటరీ స్టేటస్ చూపిస్తుంది. ఎంత బ్యాటరీ మిగిలిందో సులువుగా మీరు ఇందులో చూడవచ్చు.

బిల్ట్-ఇన్ కేబుల్‌తో హై స్పీడ్ చార్జింగ్

షావోమీ ఈ పవర్ బ్యాంక్‌లో ఇంటిగ్రేటెడ్ యూఎస్‌బీ-సీ కేబుల్ ఇచ్చింది. ఈ కేబుల్ 67W వరకు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రయాణంలో అదనపు కేబుల్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ప్రయాణంలో చార్జింగ్ చాలా సులువుగా ఉంటుంది.

ఫాస్ట్ చార్జింగ్ పనితీరు ఎలా ఉంటుంది?

Advertisement

షావోమీ ప్రకారం.. పాపులర్ డివైస్‌లను త్వరగా చార్జ్ చేస్తుంది. షావోమీ 15ను ఒక గంటలోపు ఫుల్ చార్జ్ చేస్తుంది. ఐఫోన్ 16 ప్రోను 30 నిమిషాల్లో 56 శాతం చార్జ్ చేస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ 11-ఇంచ్ M3ని కూడా త్వరగా 33 శాతం చార్జ్ ఇస్తుంది.

ఒకేసారి మల్టిపుల్ డివైస్‌లను చార్జ్ చేయవచ్చు

పవర్ బ్యాంక్‌లో యూఎస్‌బీ-సీ, యూఎస్‌బీ-ఏ పోర్ట్‌లు ఉన్నాయి. ఒకేసారి మూడు డివైస్‌లను చార్జ్ చేయవచ్చు. ఫోన్‌లు, ట్యాబ్‌లెట్‌లు, ఇయర్‌బడ్స్ లేదా ల్యాప్‌టాప్‌లు చార్జ్ అవుతాయి. ప్రొఫెషనల్స్, తరచూ ప్రయాణికులకు ఇది సూపర్.

పవర్ బ్యాంక్ తనను తాను త్వరగా చార్జ్ చేసుకుంటుంది

ఈ పవర్ బ్యాంక్ 65W యూఎస్‌బీ-సీ ఇన్‌పుట్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ చార్జ్ కేవలం 1.3 గంటల్లో అవుతుంది. టైట్ షెడ్యూల్ ఉన్న వాళ్లకు చాలా టైమ్ సేవ్ అవుతుంది.

కాంపాక్ట్ సైజు, లైట్ వెయిట్ డిజైన్ ఉంది

షావోమీ దీన్ని చిన్న సైజులో తక్కువ బరువు ఉండే డిజైన్‌తో రూపొందించింది. దీని సైజు 115 x 66 x 26 మిల్లీమీటర్లు. బరువు సుమారు 247 గ్రాములు. బ్యాగ్ లేదా పాకెట్‌లో సులువుగా క్యారీ చేయవచ్చు.

Also Read: ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ డిస్‌ప్లే చూసి భయపడుతున్న యూజర్లు .. డ్యామేజ్ అయితే అంతే మరి

కలర్ వేరియంట్స్, లభ్యత

ఐస్ బ్లూ, టాన్ అనే రెండు రంగుల్లో లాంచ్ అయింది. రెండూ క్లీన్, మాడర్న్ లుక్ ఇస్తాయి. షావోమీ మినిమల్ స్టైల్‌కు సరిపోతాయి. ప్రస్తుతం యూరోప్, చైనా ఆన్ లైన్ లో లభిస్తున్నాయి. ఇండియాలో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ధర, ఎక్కడ కొనాలి?

యూకేలో షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో £32.99 (భారత కరెన్సీలో దాదాపు రూ.4000) ధరలో లభిస్తోంది. ఈ ధరలో ఇంత ఫీచర్లు ఇచ్చే పవర్ బ్యాంక్‌లు చాలా తక్కువ. కచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.

ఈ పవర్ బ్యాంక్ ఎందుకు ప్రత్యేకంగా నిలుస్తుంది?

చాలా పవర్ బ్యాంక్‌లు ల్యాప్‌టాప్‌లను సరిగా చార్జ్ చేయలేవు. షావోమీ ఆ పని కచ్చితంగా చేయగలదు. పవర్, పోర్టబిలిటీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో ఇది బెస్ట్ ఆప్షన్.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×