E-Paper
Advertisement

21 రోజుల బ్యాటరీ లైఫ్.. గేమింగ్ మోడ్‌తో షావోమి కొత్త స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడేవాళ్లకి పండగే!

21 రోజుల బ్యాటరీ లైఫ్.. గేమింగ్ మోడ్‌తో షావోమి కొత్త స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడేవాళ్లకి పండగే!
Advertisement

Xiaomi Smart Band 10 Pro: చైనాకు చెందిన ప్రముఖ షావోమీ సంస్థ తమ సరికొత్త ఫిట్‌నెస్ ట్రాకర్ ‘షావోమి స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో’ను చైనాలో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. పాత మోడల్స్‌తో పోలిస్తే.. దీనిలో డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ యూజర్లకు కూడా కనెక్ట్ అయ్యేలా ప్రత్యేక ఫీచర్లు తీసుకురావడం విశేషం.

2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌:

ఈ సరికొత్త స్మార్ట్ బ్యాండ్ చూడటానికి ఫిట్‌నెస్ ట్రాకర్‌లా కాకుండా ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లా కనిపిస్తుంది. దీనిలో 1.74 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. అల్యూమినియం బాడీతో వచ్చే ఈ బ్యాండ్ చాలా తేలికగా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇది కాకుండా వైట్ సెరామిక్ మోడల్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్:

Advertisement

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారి కోసం దీనిలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ ట్రాకింగ్‌తో పాటు కొత్తగా హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV) మానిటరింగ్‌ను చేర్చారు. ఇది అలసటను, బాడీ రికవరీని అంచనా వేస్తుంది. ఫోన్ లేకపోయినా రన్నింగ్, సైక్లింగ్ రూట్లను ట్రాక్ చేయడానికి వీలుగా ఇన్‌బిల్ట్ జీపీఎస్ (GNSS) సిస్టమ్ ఉంది. దాదాపు 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.

Also Read: తిరుగులేని ఫీచర్లతో iQOO Pad 6 Pro లాంచ్.. ల్యాప్‌టాప్‌కు పోటీగా 16GB RAM, భారీ స్క్రీన్!

గేమర్స్ కోసం స్పెషల్ మోడ్:

Advertisement

ఈ బ్యాండ్‌లో తీసుకొచ్చిన గేమింగ్ మోడ్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. గేమ్ ఆడుతున్నప్పుడు మన హార్ట్ రేట్, స్ట్రెస్ లెవల్స్ ఎలా ఉన్నాయో ఇది గమనిస్తుంది. గేమ్‌లో మీ క్యారెక్టర్ మళ్లీ బతికే (respawn) సమయం వచ్చినప్పుడు బ్యాండ్ వైబ్రేట్ అవుతుంది. గేమ్ ముగిశాక మన బాడీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్‌ను కూడా ఇస్తుంది. అలాగే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాండ్ ఏకంగా 21 రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది.

ధర ఎంతంటే?

ప్రస్తుతానికి చైనా మార్కెట్లో విడుదలైన ఈ స్టాండర్డ్ అల్యూమినియం మోడల్ ధర రూ.4,900 నుండి రూ.5,000 మధ్య ఉంది. అలాగే సెరామిక్ మోడల్ ధర రూ.5,850 నుండి రూ.5,900 మధ్య ఉంటుంది. ఈ ఈవెంట్‌లోనే షావోమి తమ సరికొత్త క్లిప్‌ఆన్ ఇయర్‌బడ్స్‌ను కూడా లాంచ్ చేసింది. ఇవి 38 గంటల భారీ బ్యాటరీ లైఫ్‌తో వస్తున్నాయి. త్వరలోనే ఇవి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ టాబ్లెట్.. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన Poco Pad C1 ఫుల్ డీటెయిల్స్ మీ కోసం!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×