E-Paper
Advertisement

ఓర్మాక్స్ 2026 రిపోర్ట్.. బాలీవుడ్‌కు మైండ్ బ్లాంక్.. దేశంలోనే నంబర్ 1 స్టార్‌గా రెబల్ స్టార్ రేంజ్!

ఓర్మాక్స్ 2026 రిపోర్ట్.. బాలీవుడ్‌కు మైండ్ బ్లాంక్.. దేశంలోనే నంబర్ 1 స్టార్‌గా రెబల్ స్టార్ రేంజ్!
Advertisement

Tollywood Dominance: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానా అనే వారు.కానీ కాలం మారింది.ఇప్పుడు సౌత్ సినిమా.. ముఖ్యంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలైన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన ‘ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ ఏప్రిల్ 2026 నివేదిక నేషనల్ వైడ్ గా ఫిలిం సర్కిల్స్ లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.

రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా నంబర్ వన్

Advertisement

ఈ లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 మేల్ సినీ స్టార్స్ జాబితాలో టాలీవుడ్ హీరోల హవా స్పష్టంగా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మొత్తం పది స్థానాలలో ఏకంగా ఐదు స్థానాలను తెలుగు హీరోలే కైవసం చేసుకోవడం ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ కి సైతం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా నంబర్ వన్ స్పాట్‌ను కైవసం చేసుకుని తన తిరుగులేని క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తో మొదలైన ప్రభాస్ మేనియా రీసెంట్ గా వచ్చిన ‘కల్కి 2898 AD’ మరియు ‘సలార్’ చిత్రాలతో మరింత పీక్స్ కు చేరింది. రాబోయే రోజుల్లో ఆయన నటిస్తున్న స్పిరిట్ ,ఫౌజి చిత్రాలు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయబోతున్నాయో ఈ క్రేజ్ చూస్తేనే అర్థమవుతోంది.

Advertisement

Also read :సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రామ్ పోతినేని వీడియో.. అసలు విషయం తెలిసి ఫిదా అవుతున్న టాలీవుడ్

ఉత్తరాది పరువును కాపాడిన షారూక్ 

ప్రభాస్ తర్వాత ఈ లిస్టులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ రెండవ స్థానంలో నిలిచి ఉత్తరాది పరువును కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు గట్టి పోటీ ఇస్తూ.. తన అద్భుతమైన నటన, స్వాగ్‌తో పుష్పరాజ్‌గా యావత్ దేశాన్ని ఊపేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో మనకు తెలిసిందే. ఇప్పుడు మోస్ట్ అవేటెడ్ రాకా తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి రెడీ అవుతున్న ఈ సమయంలో అల్లు అర్జున్ టాప్ 3 గా నిలవడం మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది.

సౌత్, నార్త్ మధ్య ఫుల్ కాంపిటీషన్

ఇక తమిళ పరిశ్రమ నుండి దళపతి విజయ్ నాల్గవ స్థానాన్ని సొంతం చేసుకుని కోలీవుడ్‌లో తనకు తిరుగులేదని చాటుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్ సింగ్ ఆరవ స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏడవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ‘RRR’ సినిమాతో అస్కార్ వేదిక వరకు వెళ్లిన రామ్ చరణ్, ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాతో జూన్ 4న పలకరించనున్నాడు.ఒకసారి గనుక ఈ లిస్టు ని గమనిస్తే సౌత్, నార్త్ మధ్య కాంపిటీషన్ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది.

పదో స్థానాన్ని సొంతం చేసుకున్న తారక్ 

ఇక ఈ జాబితాలోని చివరి మూడు స్థానాలలో చూస్తె బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకోగా, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తొమ్మిదవ స్థానంలో నిలిచారు. అలాగే టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. తారక్, ప్రస్తుతం డ్రాగన్ లో నటిస్తూ తన సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పేందుకు రెడీ అవుతున్నాడు.

Also read :వడ్డే నవీన్ ఈజ్ బ్యాక్.. 10 ఏళ్లలో 55 ట్రాన్స్‌ఫర్లు.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ అరాచకం!

మొత్తంగా ఈ ఏప్రిల్ 2026 రిపోర్ట్ లో సగానికి పైగా తెలుగు హీరోలదే డామినేషన్ ఉండటం గమనార్హం. మరి ముందు ముందు మరికొన్ని భారీ పాన్ ఇండియా చిత్రాలు థియేటర్లలోకి రానుండ‌గా.. ఈ ర్యాంకింగ్స్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయో వేచి చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×