E-Paper
Advertisement

Xiaomi X Pro QLED Smart TV: కొత్త స్మార్ట్ టీవీ కావాలా? అయితే గెట్ రెడీ.. సూపర్ డూపర్ మోడల్ వచ్చేస్తోంది!

Xiaomi X Pro QLED Smart TV: కొత్త స్మార్ట్ టీవీ కావాలా? అయితే గెట్ రెడీ.. సూపర్ డూపర్ మోడల్ వచ్చేస్తోంది!
Advertisement

Xiaomi X Pro QLED Smart TV: చైనీస్ టెక్ బ్రాండ్ షావోమి (Xiaomi)కి భారత్ లోనూ మంచి గుడ్ విల్ ఉంది. తక్కువ బడ్జెట్ లో అత్యాధునిక ఫీచర్లు కలిగిన మెుబైల్స్, గ్యాడ్జెట్స్, టీవీలను షావోమీ లాంచ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అడ్వాన్స్డ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసేందుకు చైనీస్ కంపెనీ సిద్ధమైంది. గతేడాది విడుదలైన Xiaomi X Pro QLED స్మార్ట్ టీవీ సిరీస్ లో ప్రీమియం మోడల్ ను ఫిబ్రవరి 19న భారత్ లో విడుదల చేయబోతోంది. అయితే ఈ టీవీకి సంబంధించిన ఫీచర్లను షావోమి గోప్యంగా ఉంచినప్పటికీ కొన్ని లీక్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

75 అంగుళాల స్మార్ట్ టీవీ

Xiaomi X Pro QLED సిరీస్ నుంచి గతేడాది ఏప్రిల్ లో మూడు మోడల్స్ ను షావోమి లాంచ్ చేసింది. 43, 55, 65 అంగుళాల స్క్రీన్ సైజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే రాబోయే లేటెస్ట్ ప్రీమియం మోడల్ 75 అంగుళాల స్క్రీన్ తో అడ్వాన్స్డ్ ఫీచర్లతో భారత మార్కెట్ లో అడుగుపెట్టబోతోంది. థియేటర్ లో చూస్తున్న అనుభవాన్ని ఈ పెద్ద టీవీ అందిస్తుందని షావోమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

కొత్త టీవీ ఫీచర్లు..

Advertisement

Xiaomi X Pro QLED 75 అంగుళాల టీవీకి సంబంధించిన ఫీచర్ల గురించి షావోమి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాదు ధర ఎంత ఉండొచ్చన్న విషయాన్ని కూడా గోప్యంగా ఉంచింది. కానీ టెక్ వర్గాల నుంచి ఈ టీవీ ఫీచర్లపై కొన్ని లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ టీవీ కూడా గత మోడళ్ల తరహాలోనే సినిమాజిక్యూ (CineMagiQ), మాక్స్‌మాజిక్యూ (MaxMagiQ), థిన్ బెజెల్స్ (Thin bezels) ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది. టీవీ స్టాండ్ తో పాటు మౌంట్ (గోడకు తలిగించుకొని) ద్వారా ఈ స్మార్ట్ టీవీని వినియోగించుకోవచ్చు.

178 డిగ్రీల స్పష్టమైన విజన్

Xiaomi X Pro QLED గత మోడళ్ల తరహాలోనే 75 అంగుళాల టీవీ కూడా 4K (3,840 x 2,160 పిక్సెల్స్), 178 డిగ్రీల వరకూ స్పష్టమైన వ్యూ, డాల్బీ విజన్, HDR10+ కంటెంట్‌, 120Hz వరకు రిఫ్రెష్ రెట్ ను అందిస్తుందని ప్రచారం జరుగుతోంది. Xiaomi సొంత సాంకేతికత అయిన Vivid Picture Engine 2, DLG (డ్యూయల్ లైన్ గేట్) టెక్నాలజీతో ఈ టీవీ పని చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: Road Accident: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై పడిన కంటైనర్.. స్పాట్ లోనే

గత మోడల్స్ కంటే బెటర్‌గా..!

ప్రీవియస్ ఫ్లాగ్ షిప్ మోడల్ అయిన 65 అంగుళాల X Pro QLED టీవీ.. 34W స్పీకర్ యూనిట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది Xiaomi సౌండ్, డాల్బీ ఆడియో, DTS X, DTS వర్చువల్ వంటి X టెక్నాలజీకి సపోర్ట్ చేసింది. 65 అంగుళాల మోడల్.. 2GB RAM, 32GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాబోయే మోడల్ దీనికంటే బెటర్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో అందుబాటులోకి రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. లాంచ్ అనంతరం Xiaomi X Pro QLED 75-Inch Smart TV ఫీచర్లపై క్లారిటీ రానుంది. 65 అంగుళాల మోడల్ ధర ప్రస్తుతం రూ.64,999 ఉండగా.. దీనికంటే ఎక్కువ ధరలో 75 అంగుళాల టీవీ వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read: AP Budget 2026: అసెంబ్లీ ముందుకు బడ్జెట్.. ఆర్థిక మంత్రి ప్రసంగం.. రంగాల వారీగా కేటాయింపులు

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×