E-Paper
Advertisement

IND VS PAK: రేపు పాకిస్తాన్‌, టీమిండియా మ‌ధ్య రెండు మ్యాచ్ లు..ఇక శివ‌రాత్రి రోజున‌ జాగార‌మే

IND VS PAK: రేపు పాకిస్తాన్‌, టీమిండియా మ‌ధ్య రెండు మ్యాచ్ లు..ఇక శివ‌రాత్రి రోజున‌ జాగార‌మే
Advertisement

IND vs PAK: ఇండియా, పాకిస్తాన్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రేపు కీలక టి20 మ్యాచ్ జరగనుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో శివరాత్రి అంటే రేపు రాత్రి 7 గంటలకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan )
మధ్య మ్యాచ్ ఉంది. అనేక అడ్డంకుల నడుమ ఈ మ్యాచ్ జరగనుంది. వాస్తవంగా ఇండియా తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ వెర్రి కూతలు కూసింది. కానీ చివరికి ఐసీసీ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకొని పాకిస్తాన్.

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

పాకిస్తాన్‌, టీమిండియా మ‌ధ్య బిగ్ ఫైట్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా రేపు శ్రీలంక వేదికగా మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ మ్యాచ్ చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లోను కూడా ఈ మ్యాచ్ ప్రసారాలు వస్తాయి. అయితే ఈ మ్యాచ్ కు వర్షం పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. 80 నుంచి 90 శాతం వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. ఒకవేళ వర్షం పడితే ఈ మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

ఒకే రోజు రెండు మ్యాచ్ లు..ఇక శివ‌రాత్రి జాగార‌మే

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ రేపు జరగనుంది. అయితే ఇదే రోజున మరో మ్యాచ్ కూడా ఉంటుంది. పాకిస్తాన్ A వర్సెస్ టీమిండియా A జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ 2026 మహిళల టోర్నమెంట్ లో భాగంగా ఈ మ్యాచ్ ఉండనుంది. థాయిలాండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రసారాలు చూడవచ్చు. అయితే, రేపు శివ‌రాత్రి రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య రెండు మ్యాచ్ లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఇక శివ‌రాత్రి రోజున జాగార‌మే అంటున్నారు ఫ్యాన్స్‌.

పాకిస్థాన్‌తో జరిగే T20I WC 3వ మ్యాచ్‌కు భారత జట్టు తొలి XI ఇది

Advertisement

1. అభిషేక్ శర్మ
2. ఇషాన్ కిషన్
3. తిలక్ వర్మ
4. సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్‌)
5. హార్దిక్ పాండ్యా
6. అక్షర్ పటేల్ (VC)
7. శివం దుబే
8. రింకు సింగ్
9. జస్ప్రీత్ బుమ్రా
10. వరుణ్ చక్రవర్తి
11. కుల్దీప్ యాదవ్

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

 

Related News

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

Big Stories

Advertisement
×