E-Paper
Advertisement

Phone Hygiene: మీ ఫోన్ ఇలా వాడుతున్నారా అయితే జాగ్రత్త!.. మరి ఏం చేయాలంటే?

Phone Hygiene: మీ ఫోన్ ఇలా వాడుతున్నారా అయితే జాగ్రత్త!.. మరి ఏం చేయాలంటే?
Advertisement

Phone Hygiene: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మన శరీరంలో ఒక భాగమైపోయింది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటోంది. అయితే, మనం ప్రాణప్రదంగా చూసుకునే ఈ ఫోన్ ఒక “అదృశ్య రోగకారక క్రిముల బాండాగారం” అని మీకు తెలుసా? చాలామంది ఫోన్ కొన్నప్పటి నుండి దానిని ఒక్కసారి కూడా శుభ్రం చేయరు. ఈ అజాగ్రత్త వల్ల కలిగే పరిణామాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Read also-Jayasudha Emotional: భర్త మరణం వెనుక అసలు నిజం చెబుతూ ఎమోషన్ అయిన జయసుధ.. పాపం..

ప్రధాన తప్పులు

Advertisement

ముఖ్యంగా చాలా మందికి బాత్‌రూమ్‌లో కూడా ఫోన్ వాడటం ఒక అలవాటు. బాత్‌రూమ్‌లోని గాలిలో ఉండే ఇ-కోలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు ఫోన్ స్క్రీన్‌పై చేరతాయి. మీరు ఫ్లష్ చేసినప్పుడు ఆ సూక్ష్మక్రిములు గాలిలోకి వ్యాపించి, ఫోన్ ఉపరితలంపై స్థావరాన్ని ఏర్పరుచుకుంటాయి. మరి కొంత మంది అయితే ఫోన్‌లో మాట్లాడేటప్పుడు నోటికి దగ్గరగా పెట్టి మాట్లాడుతుంటారు. అలా ఉంచుకోవడం వల్ల లాలాజలం ఫోన్ మీద పడుతుంది. తద్వారా బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. మళ్ళీ అదే ఫోన్‌ను ముఖానికి ఆనించి మాట్లాడటం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు వచ్చే అవకాశం ఉంది. పరిశోధనల ప్రకారం, ఒక మొబైల్ ఫోన్ మీద టాయిలెట్ సీటు కంటే 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తేలింది. ఇన్ని చేస్తూ.. అదే ఫోన్ను ఒక చేత్తో భోజనం చేస్తూ, మరో చేత్తో ఫోన్ స్క్రోల్ చేయడం వల్ల ఫోన్ మీద ఉన్న క్రిములు నేరుగా మీ కడుపులోకి వెళ్లి డయేరియా వంటి వ్యాధులకు దారితీస్తాయి.

ఫోన్‌ను క్లీన్ చేసే విధానం

ఇన్ని విధాలుగా అనారోగ్యాలకు కారణం అవుతున్న మీ ఫోన్ పాడవకుండా క్రిములను వదిలించుకోవడానికి ఈ పద్ధతులను పాటిస్తే సరిపోతుంది. క్లీనింగ్ ప్రారంభించే ముందు ఫోన్‌ను ఆపివేయండి. ఛార్జింగ్ కేబుల్ వంటివి ఉంటే తీసేయండి. ఫోన్ స్క్రీన్‌ను తుడవడానికి పాత బట్టలు లేదా గరుకుగా ఉండే తువ్వాళ్లను వాడకండి. కేవలం మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్ మాత్రమే వాడండి. క్లీనింగ్ లో 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉన్న వైప్స్ వాడటం సురక్షితం. లిక్విడ్‌ను నేరుగా ఫోన్ మీద స్ప్రే చేయకుండా, క్లాత్ మీద చల్లి ఆ తడి గుడ్డతో ఫోన్‌ను మెల్లగా తుడవాలి. ఫోన్ కవర్‌ను తీసి విడిగా సబ్బు నీళ్లతో కడిగి, పూర్తిగా ఆరిన తర్వాతే మళ్ళీ వాడాలి. ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ సందుల్లోని దుమ్మును తొలగించడానికి మెత్తటి టూత్ బ్రష్ లేదా టూత్ పిక్ వాడండి.

Advertisement

Read also-Dhurandhar Trailer: ‘ధురంధర్ ది రివేంజ్’ ట్రైలర్‌లో రణవీర్ సింగ్ వాచ్‌పై సోషల్ మీడియాలో చర్చ..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోజుకు ఒక్కసారైనా ఫోన్ తుడవండి. మాట్లాడేందుకు వీలైనంత వరకు ఇయర్‌ఫోన్స్ వాడండి. గ్లాస్ క్లీనర్లు, బ్లీచ్ లేదా వినెగార్ వాడకండి. ఇవి స్క్రీన్ పై ఉండే ప్రొటెక్టివ్ కోటింగ్‌ను పాడుచేస్తాయి. పేపర్ టవల్స్ లేదా టిష్యూలు వాడకండి, ఇవి స్క్రీన్‌పై గీతలు పడేలా చేస్తాయి. మనం చేతులు కడుక్కున్నంత శ్రద్ధగా మన ఫోన్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. “చేతులు శుభ్రంగా ఉంటే సరిపోదు.. చేతిలో ఉన్న ఫోన్ కూడా శుభ్రంగా ఉండాలి”. అప్పుడే మనం టెక్నాలజీని ఆరోగ్యకరంగా ఆస్వాదించగలము. ఇలాంటి పనులు చేసే స్నేహితులు మీకూ ఉన్నారా అయితే ఇది వారి కోసమే.

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×