E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Jayasudha Emotional: భర్త మరణం వెనుక అసలు నిజం చెబుతూ ఎమోషన్ అయిన జయసుధ.. పాపం..

Jayasudha Emotional: భర్త మరణం వెనుక అసలు నిజం చెబుతూ ఎమోషన్ అయిన జయసుధ.. పాపం..
Advertisement

Jayasudha Emotional: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయసుధ గారు, తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత కష్టతరమైన ఘట్టాల గురించి మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా తన భర్త నితిన్ కపూర్ మరణానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు.

Read also-Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను చితక్కొట్టిన మీనా.. షాక్ లో ప్రభావతి, రోహిణి.. శోభాకు దిమ్మతిరిగే షాక్..

అప్పుల వల్లే..

Advertisement

నితిన్ కపూర్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని వస్తున్న వార్తలపై జయసుధ క్లారిటీ ఇచ్చారు. “మేము అప్పుల కోసం భయపడే వ్యక్తులం కాదు. ఆయన ఆత్మహత్య చేసుకునే స్థాయి అప్పులు మాకు ఎప్పుడూ లేవు. నితిన్ చాలా తెలివైన వ్యక్తి, కేవలం డబ్బు కోసమే ఆయన ప్రాణాలు తీసుకున్నారనేది కేవలం పుకారు మాత్రమే” అని ఆమె స్పష్టం చేశారు.

కుటుంబంలో ..

ఆయన మరణానికి గల అసలు కారణాన్ని వివరిస్తూ, వారి కుటుంబంలో కొందరికి ఉన్న మానసిక సమస్యలు (డిప్రెషన్) దీనికి కారణమని తెలిపారు. నితిన్ కపూర్ సోదరుడు కూడా గతంలో ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయారని, అది వారి కుటుంబంలో ఒక రకమైన వారసత్వ సమస్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ శాపం తమ పిల్లలకు, తదుపరి తరాలకు రాకూడదని తాము నిరంతరం ప్రార్థిస్తున్నట్లు జయసుధ ఎమోషనల్ అయ్యారు. నితిన్ కపూర్ మరణానికి ముందు సుమారు ఒక సంవత్సరం పాటు ఆయన మానసిక స్థితిని చూసి కుటుంబం మొత్తం ఆందోళన చెందిందని ఆమె తెలిపారు. “ఆయన ఎప్పుడు ఏం చేసుకుంటారో అని ప్రతి క్షణం భయపడుతూ బతికాం. చివరికి మేము భయపడిందే జరిగింది” అని ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ బాధ నుండి బయటపడటానికి 32 ఏళ్ల వైవాహిక బంధం తెగిపోవడం తనను ఎంతగా కృంగదీసిందో ఆమె వివరించారు.

Advertisement

Read also-Brahmamudi Rekha : ‘బ్రహ్మముడి’  రేఖ రియల్ లైఫ్.. కన్నీళ్లు పెట్టకుండా ఉండరు..

కోవిడ్ సమయంలో

భర్త మరణం తర్వాత కోవిడ్ కాలంలో జయసుధ ఒక రకమైన ‘హెల్త్ ఫోబియా’కు లోనయ్యారు. ఎవరిని కలిసినా ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతో గదికే పరిమితమయ్యేవారు. ఆ ఒత్తిడి వల్ల ఆమె ఏకంగా 16 కిలోల బరువు తగ్గారు. ఆ సమయంలో తీయించుకున్న ఫోటోలు చూసి ఆమెకు ఏదో భయంకరమైన వ్యాధి సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తనను మరింత బాధించిందని ఆమె చెప్పారు. సోషల్ మీడియాను ‘సాతాను సామ్రాజ్యం’గా ఆమె అభివర్ణించారు. ఏ విషయమైనా వాస్తవాలు తెలుసుకోకుండా రాసే విధానం, దాని కింద వచ్చే కామెంట్స్ మనుషుల మనోభావాలను దెబ్బతీస్తాయని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా తన ఆరోగ్యం గురించి, తన భర్త మరణం గురించి వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఆమె స్పష్టం చేశారు. చివరగా, జీవితం అనేది ఒక ప్రయాణం అని, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలని, ఎవరికీ తలవంచకుండా స్వతంత్రంగా బతకడమే తనకు ఇష్టమని జయసుధ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.

Related News

‘రంగస్థలం’ మహేశ్‌కి ఏమైంది? సడన్‌గా అంత మాట అనేశాడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

యూరప్ టూర్‌కు రాజమౌళి సిద్ధం.. ‘RRR’ నుంచి ‘ఈగ’ వరకు స్పెషల్ స్క్రీనింగ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

సుకుమార్ సినిమాలో చేయాలంటే ఈ హీరోయిన్ ఎన్ని కండీషన్స్ పెట్టిందో తెలుసా ?

మిగతా హీరోలు సెట్స్ పైకి.. మోక్షజ్ఞ మాత్రం ఇంకా ముహూర్తాల వేటలోనే!

సమంత వన్-వుమెన్ షో.. స్టార్ హీరోల రికార్డులను తిరగరాస్తోన్న ‘మా ఇంటి బంగారం’!

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం.. జ్యోతిష్యుడి మాట నిజమైందా?

చిన్న వయసులోనే ఫిలింఫేర్ రికార్డ్.. మూడు సిల్వర్ జూబ్లీల హ్యాట్రిక్.. అదీ ఉదయ్ కిరణ్ రేంజ్

కన్నడ స్టార్ దర్శన్ కొడుకు లగ్జరీ కారు యాక్సిడెంట్.. అసలేం జరిగిందంటే?

Big Stories

×