E-Paper
Advertisement

యూట్యూబ్ షార్ట్స్ vs ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఎక్కువ డబ్బులు దేంట్లో వస్తాయంటే?

యూట్యూబ్ షార్ట్స్ vs ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఎక్కువ డబ్బులు దేంట్లో వస్తాయంటే?
Advertisement

YouTube vs Instagram: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా షార్ట్ వీడియోల హడావుడే కనిపిస్తోంది. కేవలం టైమ్‌పాస్ కోసమే కాకుండా.. వీటి ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే, క్రియేటర్ల మనసులో ఎప్పుడూ మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే… యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్… ఈ రెండింటిలో ఎక్కువ డబ్బులు ఇచ్చే ప్లాట్‌ఫార్మ్ ఏది అని? ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం రండి..

సంపాదన మార్గాల్లో తేడాలు:

ఈ రెండు ప్లాట్‌ఫార్మ్‌లు పని చేసే విధానం, డబ్బులు ఇచ్చే పద్ధతి పూర్తిగా వేరుగా ఉంటాయి. యూట్యూబ్ తమ క్రియేటర్లకు నేరుగా యాడ్స్ (ప్రకటనలు) ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటాను ఇస్తుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి శాశ్వత విధానం లేదు. అక్కడ ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారానే క్రియేటర్లు సంపాదిస్తుంటారు. అందుకే కంటెంట్ రకాన్ని బట్టి ఆదాయంలో చాలా తేడాలు కనిపిస్తాయి.

యూట్యూబ్‌లో లభించే భరోసా:

Advertisement

డైరెక్ట్‌గా డబ్బులు సంపాదించుకోవడానికి యూట్యూబ్ షార్ట్స్ ఒక చక్కని మార్గం చూపిస్తోంది. దీనికి కొన్ని అర్హతలు సాధిస్తే చాలు.. మన వీడియోలపై వచ్చే ప్రకటనల రెవెన్యూలో వాటా లభిస్తుంది. వ్యూస్ పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యూస్‌కి వచ్చే అమౌంట్ మొదట్లో కొంచెం తక్కువగా అనిపించినా, లాంగ్ టర్మ్‌లో స్థిరమైన సంపాదనకు ఇది ఒక నమ్మకమైన వేదికగా నిలుస్తుంది.

Also Read: OnePlus 13 నుంచి Nord సిరీస్ వరకు భారీ ఆఫర్లు.. జూన్ 10 వరకు బంపర్ డిస్కౌంట్స్!

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ల సందడి:

Advertisement

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ క్రియేటర్లకు ప్లాట్‌ఫార్మ్ నుంచి నేరుగా వచ్చే సొమ్ము కంటే.. బ్రాండ్ల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, బ్యూటీ వంటి విభాగాల క్రియేటర్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ఒక కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తే, వాళ్లు ఇచ్చే అమౌంట్ ఒక్కోసారి యూట్యూబ్ వ్యూస్ ద్వారా వచ్చే ఆదాయం కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది.

వీడియోల లైఫ్ టైమ్:

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ మధ్య ఉన్న మరో పెద్ద తేడా వీడియోల మనుగడ. యూట్యూబ్‌లో ఒకసారి అప్‌లోడ్ చేసిన షార్ట్ వీడియో, కొన్ని నెలల తర్వాత కూడా వ్యూస్ తెచ్చుకుంటూ డబ్బులు సంపాదించి పెడుతుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అలా కాదు. అవి అప్‌లోడ్ చేసిన కొన్ని రోజులకే ట్రెండింగ్‌లో ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగైపోతాయి. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాల్సి వస్తుంది.

మీ లక్ష్యం ఏంటో ముఖ్యం:

చివరిగా చెప్పాలంటే.. మీకు ఎలాంటి రిస్క్ లేకుండా నేరుగా ప్లాట్‌ఫార్మ్ నుంచే వ్యూస్‌ని బట్టి డబ్బులు రావాలనుకుంటే యూట్యూబ్ షార్ట్స్ బెస్ట్ ఆప్షన్. లేదు.. బ్రాండ్లతో కాంటాక్ట్స్ పెంచుకుంటూ పెద్ద పెద్ద ప్రమోషన్లు చేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కరెక్ట్. అందుకే చాలామంది స్మార్ట్ క్రియేటర్లు రెండు ప్లాట్‌ఫార్మ్‌లను వాడుకుంటూ డబుల్ ఇన్కమ్ పొందుతున్నారు.

Also Read: iPhone 18 Proలో భారీ మార్పులు.. లాంచ్‌కు ముందే బ్యాటరీ, డిస్‌ప్లే ఫీచర్లు లీక్.. ధర కూడా పెరగనుందా?

Related News

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×