E-Paper
Advertisement

Parasakthi OTT : ఓటీటీలో ‘పరాశక్తి’ తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..?

Parasakthi OTT : ఓటీటీలో ‘పరాశక్తి’  తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Parasakthi OTT : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం పరాశక్తి.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా కోలీవుడ్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. అయితే తెలుగులో ఈ సినిమాని మొదట రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇక్కడ సంక్రాంతికి స్టార్ హీరో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండడంతో, థియేటర్స్ కొరత కారణంగా ఈ సినిమాని రిలీజ్ చేయలేదు. ఇప్పుడు తెలుగు వర్షన్ డైరెక్ట్ ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి రాబోతుంది.. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది.. అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ ని ఎక్కడ చూడొచ్చు అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘పరాశక్తి’ మూవీ ఓటీటీ..

డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన పరాశక్తి మూవీ పలు విమర్శలను సొంతం చేసుకుంది.. ఒకవైపు మౌత్ టాకీ ఎలా ఉన్నా సరే ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం భారీగానే వసూల్ అవ్వడం మామూలు విషయం కాదు. తెలుగులో రిలీజ్ కానీ ఈ మూవీ ప్రస్తుతం డైరెక్ట్గా ఓటీటీలోకి రాబోతుంది.. ఫిబ్రవరి 7 ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుంది. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్‌ కూడా విడుదల కానుంది. టాలీవుడ్‌లో శివకార్తికేయన్‌కు భారీ క్రేజ్‌ ఉండటంతో పరాశక్తి ని ఓటీటీలో చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం ఈమె తెలుగు కన్నా కోలీవుడ్ లోనే బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Advertisement

Also Read :చిరు మూవీలో దురంధర్ బ్యూటీ.. విలన్ గా బాలీవుడ్ నిర్మాత..?

ఈ మూవీ స్టోరీ విషయానికోస్తే.. 

పరాశక్తి మూవీ రిలీజ్ అయ్యాక కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యతిరేకత చూపించిన విషయం తెలిసిందే.. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దలని ప్రయత్నాలు జరిగేవి. వాటిని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల నేతలు ఉద్యమాలు చేసేవారు. గొడవల సమయంలో ఇద్దరు సోదరులు, చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయనేది అసలు స్టోరీ.. ఈ మూవీలో రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, డాలీ ధనంజయ వంటి నటులతో పాటుగా బాలీవుడ్ బ్యూటీ సంధ్య మృదుల్ నటిస్తుంది.. కోలీవుడ్ లో మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.. ఇక ప్రస్తుతం శివ కార్తికేయన్ భారీ ప్రాజెక్టులలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.. అతి త్వరలోనే ఆ సినిమాల గురించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది..

Tags

Related News

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

Big Stories

Advertisement
×