E-Paper
Advertisement

జొమాటో సంచలనం.. డెలివరీ బాయ్స్‌కు కూలింగ్ వెస్ట్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

జొమాటో సంచలనం.. డెలివరీ బాయ్స్‌కు కూలింగ్ వెస్ట్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
Advertisement

Cooling Vests: దేశంలో ఎండలు మండిపోతున్న వేళ.. జొమాటో (Zomato) తన డెలివరీ ఏజెంట్ల కోసం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత నుండి వారిని రక్షించడానికి ‘కూలింగ్ వెస్ట్‌లను’ (Cooling Vests) పంపిణీ చేస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో.. డెలివరీ బాయ్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో 14పైగా నగరాల్లోని 2,500 మందికి పైగా డెలివరీ ఏజెంట్లకు కూలింగ్ వెస్ట్ లు ప్రయోగాత్మకంగా అందించాలని నిర్ణయించినట్లు లింక్డ్ ఇన్ లో జొమాటొ వెల్లడించింది.

ఇప్పటికే పంపిణీ షురూ..

తీవ్రమైన వడగాల్పుల మధ్య పని చేసే డెలివరీ ఏజెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జొమాటో ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటికే ఎంపిక చేసిన నగరాల్లో ఈ వెస్ట్‌లను అందజేస్తున్నారు. జొమాటో ప్రకారం.. ఈ కూలింగ్ వెస్ట్ లు అధిక వేడి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. వీటిని ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుందని జొమాటో చెబుతోంది. తద్వారా డెలివరీ ఏజెంట్లు వడదెబ్బకు గురికాకుండా ఉంటారని అంచనా వేస్తోంది.

అసలు కూలింగ్ వెస్ట్ అంటే ఏంటి?

Advertisement

కూలింగ్ వెస్ట్ అనేది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన జాకెట్. ఇది బయట ఎంత ఎండ ఉన్నప్పటికీ.. ధరించిన వ్యక్తికి చల్లదనాన్ని ఇస్తుంది. సాధారణంగా ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. ఎవాపరేటివ్ కూలింగ్ పద్దతిలో.. ఈ వెస్ట్‌ను నీటిలో ముంచి, పిండిన తర్వాత ధరించాలి. గాలి తగిలినప్పుడు ఆ నీరు ఆవిరై చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది.

4 గంటలు కూల్ కూల్..!

రెండో పద్దతిని ఫేజ్ చేంజ్ మెటీరియల్ అంటారు. ఈ రకమైన వెస్ట్ లలో ప్రత్యేకమైన కూలింగ్ ప్యాక్‌లు లేదా జెల్ ప్యాక్‌లు ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐస్ ముక్కల్లా పనిచేస్తూ గంటల తరబడి చల్లదనాన్ని అందిస్తాయి. అయితే జొమాటో ప్రకారం.. తాను అందించనున్న కూలింగ్ వెస్ట్ లు.. బాష్పీభవనం, PVA ఆధారిత కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉండనుంది. దీనిని ఒకసారి యాక్టివేట్ చేస్తే 4 గంటల వరకూ చల్లదనం అందిస్తాయని జొమాటో తెలియజేస్తున్నాయి. ఈ దుస్తులు తెలిగ్గా, యాంటీ మైక్రోబయల్ గా ఉంటూ కనీసం 2 వేసవి కాలాలు ఉపయోగించేందుకు వీలుగా ఉంటాయని పేర్కొంటున్నాయి.

Advertisement

Also Read: ఓరి దేవుడా.. మే నెలలో ఇన్ని అద్భుతమైన ఫోన్లు రాబోతున్నాయా? మెుబైల్ ప్రియులకు పండుగే!

జొమాటో సీఈఓ ఏమన్నారంటే?

షెల్ ఫౌండేషన్, ట్రేన్ టెక్నాలజీస్ వారి స్పేసెస్ (SPACES) ప్రోగ్రామ్ సహకారంతో ఈ కూలింగ్ వెస్ట్ లను అందించనున్నట్లు జొమాటో స్పష్టంచేసింది. కూలింగ్ వెస్ట్ ల పంపిణీ గురించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ లింక్డ్ ఇన్ లో స్పందించారు. ‘ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉన్నప్పటికీ.. ఈ వేసవిని కొంచెం భరించగలిగేలా చేస్తుందని ఆశిస్తున్నాను’ అని రాశారు. ఇదిలా ఉంటే జొమాటో తన పోస్టులో ఈ వెస్ట్ గురించి వివరించే ప్రయత్నం చేసింది. ‘తక్షణ చల్లదనం, రోజంతా సౌకర్యం.. రోజువారి పనితీరు కోసం రూపొందించాం. తేలిగ్గా ఉంటూ గాలి ప్రసరించేలా డిజైన్’ అని రాసుకొచ్చింది.

Also Read: కొత్త ఏసీ కావాలా? మేలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ బ్రాండ్స్.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×