Women’s T20 World Cup 2026: టీమిండియా అలాగే పాకిస్తాన్ అభిమానులకు మరో అదిరిపోయే శుభవార్త అందింది. మరోసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉమెన్స్ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( Women’s T20 World Cup 2026) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( india vs pakistan Match) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు తాజాగా షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన ఇండియా మహిళలు వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. దీంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పురుషుల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరిగిన సంఘటన తెలిసిందే. ఇక ఇప్పుడు మహిళల జట్ల మధ్య కూడా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఐసీసీ ( ICC) మరో కీలక ప్రకటన చేసింది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు ( Women’s T20 World Cup 2026 ) సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు అయింది. జూన్ 12వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు 2026 మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కొనసాగబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ టి 20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంటులో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. అయితే, ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. టీమిండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ అలాగే నెదర్లాండ్స్ జట్లను గ్రూప్ A కింద చేర్చారు. అలాగే గ్రూప్ B లో శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ అలాగే స్కాట్లాండ్ ఉంటాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫైనల్ అయిది. అయితే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India VS Pakistan) మధ్య ఈ టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ జరగనుంది. జూన్ 14వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ స్టేడియం ( Edgbaston Stadium ) వేదికగా నిర్వహించనున్నారు.
టీ20 వరల్డ్ కప్ లో 2026లో టీమిండియా ఆడే గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు ఇలా ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ లో మొత్తం 5 మ్యాచ్ లు ఆడనుంది మహిళల టీమిండియా.
జూన్ 14 – ఇండియా vs పాకిస్తాన్
జూన్ 17 – ఇండియా vs నెదర్లాండ్స్
జూన్ 21 – ఇండియా vs దక్షిణాఫ్రికా
జూన్ 25 – ఇండియా vs బంగ్లాదేశ్
జూన్ 28 – ఇండియా vs ఆస్ట్రేలియా
🚨 ICC announced the Fixtures for Women's T20 World Cup in England:-
Group A – India, Pakistan, Australia, South Africa, Bangladesh and Netherlands.
Group B – England, New Zealand, Sri Lanka, West Indies, Ireland and Scotland.
14th June – India vs Pakistan
17th June – India vs… pic.twitter.com/9HRWeEAZNp— Tejash (@Tejashyyyyy) February 24, 2026