E-Paper
Advertisement

Ind T20i wc 2026-WC 2011: గంభీర్ అంధ భ‌క్తుల వెర్రి ప్ర‌చారం..2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌

Ind T20i wc 2026-WC 2011: గంభీర్ అంధ భ‌క్తుల వెర్రి ప్ర‌చారం..2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌
Advertisement

Ind T20i wc 2026 – WC 2011: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs South Africa) , అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా సూపర్ 8 మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 76 పరుగుల తేడాతో టీమిండియా దారుణమైన ఓటమిని చవి చూసింది. దీంతో టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లడం కష్టమే అంటున్నారు. కానీ, 2011 సెంటిమెంట్ ప్రకారం ఈసారి టీమిండియా, ఫైనల్ కి వెళ్లి టైటిల్ కూడా గెలుస్తుందని మరి కొంతమంది పోస్టులు పెడుతున్నారు.

Also Read: Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌

Advertisement

2026 టి20 ప్రపంచ కప్ సూపర్ 8 తొలి మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా, 2011 సెంటిమెంట్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ గెలుస్తుందని గౌతమ్ గంభీర్ అంధ భ‌క్తులు పోస్టులు పెడుతున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో మహేంద్రసింగ్ ధోని టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ గా గ్రేమ్ స్మిత్ ఉన్నాడు. గ్రూప్ స్టేజిలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియాపైన దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కానీ 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా ఫైనల్ దాకా దూసుకు వెళ్లింది. ఫైనాల్స్ లో శ్రీలంక జట్టును చిత్తు చేసిన టీమిండియా, 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. చివరలో భారీ సిక్సర్ కొట్టి ట్రోఫీని టీమిండియాకు అందించాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ మ్యాచ్ ఇప్పటికీ కూడా హాట్ టాపికే.

అయితే అప్పటి సెంటిమెంట్ ను ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఈ 2026 టి20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయిందని వెల్లడిస్తున్నారు. అప్పుడు ఓటమి అలాగే ఇప్పుడు ఓటమి కాబట్టి, 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా టైటిల్ గెలుస్తుందని.. గౌతమ్ గంభీర్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 2011లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయాం కాబట్టి టైటిల్ గెలిచాం.. ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

ఇది అసాధ్యం అంటూ కౌంటర్లు

Advertisement

2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో జరిగిన పరిస్థితి ఇప్పుడు రిపీట్ అస్సలు కాబోదని కొంత మంది కౌంటర్లు పేల్చుతున్నారు. 2011 సమయంలో జరిగింది వ‌న్డే వరల్డ్ కప్ అని.. అప్పుడు గ్రూప్ సైజులోనే దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయిందని వెల్లడిస్తున్నారు. దానికి తోడు అప్పుడు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నాడని గుర్తు చేస్తున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో సూపర్ 8లో జరిగిన మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయిందని చేస్తున్నారు. దానికి దీనికి చాలా తేడా ఉందని.. ఈసారి టీమిండియా టైటిల్ కొట్టడం కష్టమే అంటున్నారు. కావాలనే గౌతమ్ గంభీర్ అభిమానులు ఇలా రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ పోస్టులు మానేసి ఆటపైన దృష్టి సారించాలని అంటున్నారు.

Also Read: Ind vs SA Super 8: ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×